జాతీయపార్టీ బీఆర్ఎస్ లో విలీనం విషయంలో జేడీఎస్ అగ్రనేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టమైన వివరణ ఇచ్చేశారు. తమ పార్టీ బీఆర్ఎస్ లో విలీనం అవుతుందనే ప్రచారాన్ని కొట్టేశారు. తమ రెండుపార్టీలు మిత్రపక్షాలేనని స్పష్టంగా చెప్పారు. కర్నాటక అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రెండుపార్టీలు కలిసి పోటీచేయబోతున్నట్లు కుమారస్వామి చెప్పారు. 2023లో జరగబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోను తర్వాత 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లోను రెండుపార్టీలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే …
Read More »ఇద్దరికీ ఇగో సమస్య తప్ప మరేంలేదా ?
చాలా చిన్న విషయమే చిలికిచిలికి గాలివానలాగ మారింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. అలాగే నిర్వాహకులు ప్రవచనకారుడు గరికపాటి నరసింహరావుతో ప్రవచనాలు కూడా ఏర్పాటుచేశారు. చిరంజీవికన్నా గరికపాటి ముందే వచ్చిన తన ప్రవచనాలను మొదలుపెట్టారు. తర్వాతెప్పుడో చిరంజీవి కూడా కార్యక్రమంలో జాయినయ్యారు. ఎప్పుడైతే మెగాస్టార్ వచ్చారో వెంటనే జనాల దృష్టంతా ప్రవచనం మీదనుండి …
Read More »అప్పట్లో అల్లమైన సీమాంధ్ర ఇపుడు బెల్లం ఎలాగవుతోంది కేసీయార్ ?
కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళదాం అంటే ప్రత్యేక తెలంగాణా కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న రోజుల్లోకి. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడగటంలో తప్పులేదు కానీ సీమాంధ్రులంటూ నానా గోల చేసే వాళ్ళు. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవితతో పాటు జేఏసీ ఛైర్మన్ గా పనిచేసిన కోదండరామ్ మరికొందరు సీమాంధ్రులను, రాష్ట్రాన్ని పరిపాలించిన సీమాంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులను బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అప్పటివరకు రాష్ట్రాన్ని …
Read More »ఆ ఎంపీ టికెట్లు ఎవరికి? టీడీపీలో తర్జన భర్జన
వచ్చే ఎన్నికల్లో 15-20 దాకా ఎంపీస్థానాలను దక్కించుకోవాలని.. టీడీపీ ప్లాన్ చేసుకుంది. దీనికి తగ్గట్టుగానే .. అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. అయితే.. అనుకున్న విధంగా మాత్రం పరిస్తితి కనిపించడం లేదట. టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్లపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దీంతో పార్లమెంటు స్థానాలపైనా.. దృష్టి పెట్టాలని.. నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా చాలా నియోజకవర్గాల్లో పార్టీకి అభ్యర్థుల కొరత వెంటాడుతోంది. ఈ జాబితా తలుచుకుంటేనే బాధేస్తోందని.. సీనియర్లు అంటున్నారు. …
Read More »TDP : ఈసారి సూపర్ ఫాస్ట్ ఉందే
నియోజకవర్గాల వారీగా చేస్తున్న సమీక్షల్లో కొన్ని చోట్ల అభ్యర్థులను చంద్రబాబునాయుడు దాదాపు ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో రెండు నియోజకవర్గాలు తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేసేశారట. అంటే ఖరారు కానీ రెండు నియోజకవర్గాలపై పార్టీలోనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి అభ్యర్ధిగా కేశినేని శివనాధ్ (చిన్ని), మచిలీపట్నం ఎంపీ …
Read More »అందరిని ఆశ్చర్యపరిచిన గద్దర్ !
ఉద్యమ నేపథ్యం ఉన్న ప్రజా గాయకుడు గద్దర్ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచారు. కారణం ఏమిటంటే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకోవటమే. దీనికన్నా ఇంకా పెద్ద సర్ ప్రైజ్ ఏమిటంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా ఎన్నికలోకి దిగుతుండటమే. తెలంగాణాలోని రాజకీయ పార్టీలు అలాగే జనాలు ఈ రెండు విషయాలను ఏమాత్రం ఊహించలేదు. ఉద్యమ నేపథ్యం ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఏమీలేదు. కాకపోతే గద్దర్ ఎన్నికల్లో పోటీ …
Read More »కేసీయార్ కొత్తపార్టీకి ఏపీలో కీలకం ??
కేసీయార్ కొత్తపార్టీ కలకలం రేపుతున్నట్లుంది. కొత్తపార్టీ రేపుతున్న కలకలం తెలంగాణాలో కన్నా ఏపీలోనే ఎక్కువగా కనబడుతోంది. తెలంగాణాలో టీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే అధికారంలో ఉంది కాబట్టి ఇతర పార్టీల నుండి వచ్చి జాతీయపార్టీలో చేరబోయే నేతలు పెద్దగా ఉండరు. ఎందుకంటే జాతీయపార్టీలో పనిచేయటానికి తెలంగాణాలోనే కావాల్సినంత మంది నేతలున్నారు. కొత్తగా ఏర్పాటవ్వబోయే జాతీయపార్టీలో పనిచేయటానికి మిగిలిన రాష్ట్రాల్లోనే నేతల అవసరం చాలావుంది. మిగిలిన రాష్ట్రాల్లో జాతీయపార్టీ పరిస్ధితి ఎలాగున్నా ఏపీలో …
Read More »మొదటి వికెట్ కాంగ్రెస్ !
కేసీయార్ ఏర్పాటు చేయబోయే కొత్త జాతీయపార్టీలోకి చేరే నేతల్లో మొదటి వికెట్ కాంగ్రెస్ నుండి పడింది. ఈమధ్యనే టీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదేలు తాజాగా తిరిగి టీఆర్ఎస్ లో చేరిపోయారు. బుధవారం ఉదయం ప్రగతిభవన్లో కేసీయార్ ను కలిసి ఓదేలు తాను టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. కేసీయార్ సమక్షంలో కారు కండువా కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం ఇవ్వాలని …
Read More »రాజకీయం క్రీడ కాదు..టాస్క్: కేసీఆర్
విజయదశమి పండుగనాడు జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్…బీఆర్ఎస్ గా కొనసాగుతుందని అన్నారు. దేశంలో చాలా పార్టీలకు రాజకీయం అనేది ఒక క్రీడ అని, కానీ తనకు మాత్రం రాజకీయం అంటే ఒక టాస్క్ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మన దేశంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, బీజేపీ ప్రభుత్వం వల్లే రైతాంగం నానా ఇబ్బందులు పడుతోందని కేసీఆర్ దుయ్యబట్టారు. …
Read More »టీఆర్ఎస్ టు బీఆర్ఎస్..ప్రస్థానం
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి అఫీషియల్ గా తన పార్టీతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసలు పార్టీ ఎలా పుట్టింది? టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ ప్రస్థానం ఏమిటి అన్న చర్చ జరుగుతోంది. 2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం దగ్గర తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీని కేసీఆర్ ప్రకటించారు. ఆ ఇల్లే కొంతకాలం పార్టీ కార్యాలయంగా …
Read More »బ్రేకింగ్: టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్
విజయదశమి నాడు సీఎం కేసీఆర్ తాను పెట్టబోతోన్న జాతీయ పార్టీ పేరు ప్రకటించారు. టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బేషరతుగా బలపర్చారు. కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మొత్తం 283 మంది టీఆర్ఎస్ ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీ జెండా గతంలో మాదిరిగానే …
Read More »దెందులూరులో పస తగ్గని చింతమనేని.. రీజన్లు ఇవే..!
ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి.. పస ఏమాత్రం తగ్గలేదా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే.. ఏకపక్షంగా ఇక్కడి ప్రజలు ఆయనను గెలిపిస్తారా? లక్ష ఓట్ల మెజారి టీతో ఆయన గెలిచే ఛాన్స్ ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరగడం .. ఒక కారణమైతే.. ఆయన అసలు ప్రజల మధ్య ఉండకపో వడం మరోకారణంగా కనిపిస్తోంది. …
Read More »