Political News

కృష్ణాలో జ‌న‌సేన‌కు బూస్ట్‌.. కీల‌క నేత ఎంట్రీ…!

కృష్ణా జిల్లా జ‌న‌సేన‌లో ఊపు రానుందా? ఇప్ప‌టి వ‌రకు కేవ‌లం విజ‌య‌వాడ వ‌ర‌కే ప‌రిమిత‌మైన జ‌న‌సేన దూకుడు.. ఇక నుంచి జిల్లాలోనూ ఊపందుకోనుందా? అంటే.. అవున‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా ఇక్క‌డ మారుతున్న ప‌రిణామాలు.. జ‌న‌సేన‌లో మార్పుల‌ను స్ప‌ష్టంగా చూపిస్తున్నాయ‌ని అంటున్నారు. తాజాగా కీల‌క‌మైన నాయ‌కుడు ఒక‌రు జ‌న‌సేన‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఆయనే డీవై దాస్‌. రాజ‌కీయంగా వివాద ర‌హిత నాయ‌కుడుగా.. ఎస్సీ సామాజిక వ‌ర్గంలో బల‌మైన నేతగా …

Read More »

బాబు క‌న్నీరు.. తెలంగాణ‌నూ క‌దిలించిందే!

ఔను.. ఇప్పుడు ఈమాటే వినిపిస్తోంది. టీడీపీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌.. మాజీ సీఎం చంద్ర‌బాబు త‌న‌కు అసెంబ్లీలో ఘోర అవ‌మానం జ‌రిగిందంటూ.. క‌న్నీరు పెట్టుకున్నారు. మీడియా ముందు.. ఎంతో ధైర్యంతో మాట్లాడే చంద్ర‌బాబు.. ప్ర‌త్య‌ర్థుల‌పై నిప్పుల చెరిగే.. చంద్ర‌బాబు ఒక్క‌సారిగా భోరుమ‌న్నారు. దీంతో అంద‌రూ క‌దిలిపోయారు. పార్టీల‌కు అతీతంగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఏపీ స‌ర్కారుపై దుమ్మెత్తిపోశారు. అయితే.. ఈవిష‌యంలో ఏపీలోని రాజ‌కీయ ప‌క్షాల‌క‌న్నా..కూడా తెలంగాణ నుంచి …

Read More »

చంద్ర‌బాబుపై వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ కానిస్టేబుల్ రాజీనామా

అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిపై అధికార వైసీపీ నాయ‌కులు అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపై క‌ల‌త చెందిన ఓ హెడ్ కానిస్టేబుల్ త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. త‌న భార్య‌పై వైసీపీ నాయ‌కులు దారుణ వ్యాఖ్య‌లు చేశార‌ని స‌భ నుంచి వెళ్లిపోయిన బాబు క‌న్నీళ్లు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే హెడ్‌కానిస్టేబుల్ విజ‌య‌కృష్ణ.. ప్ర‌భుత్వ తీరును వ్య‌తిరేకిస్తూ ప్ర‌స్తుత పోలీస్ వ్య‌వ‌స్థ‌ను త‌ప్పుప‌డుతూ త‌న ఉద్యోగానికి రాజీనామా …

Read More »

వైజాగ్ విషయంలో కూడా వెనక్కు తగ్గుతారా ?

Vizag Steel Plant

మూడు వ్యవసాయ చట్టాలు నరేంద్ర మోడీ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఇపుడందరి దృష్టి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంపై పడింది. మూడు వ్యవసాయ చట్టాలను చేసిన తర్వాత రైతుల ఆధ్వర్యంలో ఢిల్లీ శివార్లలో గడచిన 12 మాసాలుగా ఎంత పెద్ద ఉద్యమం నడుస్తోందో అందరికీ తెలిసిందే. ఇంతకాలం చట్టాలను వెనక్కు తీసుకునేది లేదని తెగేసి చెబుతు వచ్చిన మోడి హఠాత్తుగా చట్టాలను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిన …

Read More »

సంచలన సర్వే – పంజాబ్ కేజ్రీవాల్ దే

క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ అలాగే అనిపిస్తోంది. తాజాగా ఏబీపీ-సీఓటర్ లాంటి సంస్ధలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేల్లో ఆప్ కే పట్టం కట్టాయి. 117 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్ లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశముందని సర్వే ఫలితాలను బట్టి తేలుతున్నాయి. 117 సీట్లలో ఆప్ కు 51 సీట్లు రావటం ఖాయమని సర్వే …

Read More »

ఎన్టీఆర్, జగన్… ఇపుడు బాబు !

రాబోయే రెండున్నరేళ్లు అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ఎంఎల్ఏలు బహిష్కరించబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. అసెంబ్లీని తాను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబునాయుడు ప్రకటించినా మొత్తం టీడీపీ సభ్యులంతా అదే దారిలో నడవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమ అధినేత చంద్రబాబే సభను బహిష్కరించిన తర్వాత తాము మాత్రం సభలో ఉండి చేసేదేమీ ఉండదని మిగిలిన ఎంఎల్ఏలు కూడా ఆలోచిస్తున్నారట. అధికార సభ్యుల వైఖరిలో ఎలాంటి మార్పుండదు కాబట్టి …

Read More »

నోరు అదుపులో పెట్టుకోండి.. బాలయ్య వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం వైసీపీ నాయకులు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపం చెందిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో కన్నీటి పర్యంతం కావడం నందమూరి కుటుంబాన్ని బాగానే కదిలించినట్లుంది. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పురంధరేశ్వరి తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శనివారం నందమూరి బాలకృష్ణ సహా పలువురు నందమూరి కుటుంబ సభ్యులు కలిసి హిందూపురంలో విలేకరుల సమావేశం పెట్టారు. బాలయ్యతో పాటు …

Read More »

బాబు వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని రియాక్షన్

కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న తమ్మినేని సీతారాం. ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో విపక్ష నేత చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తమ్మినేనికి తాను రాజకీయంగా పున:భిక్ష పెట్టానంటూ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. బాబు మాటల్లో నిజం లేదన్న ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు అని.. …

Read More »

హోదాపై కేంద్రానికి నోటీసులు

విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని హైకోర్టు కేంద్రానికి నోటీసులిచ్చింది. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటనను విచారణ సందర్భంగా న్యాయమూర్తి గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం విభజన చట్టానికి, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు ఎందుకు కట్టుబడి ఉండలేదో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని …

Read More »

వైసీపీలో విషాదం.. ఎమ్మెల్సీ కరీమున్నీసా కన్నుమూత

ఏపీ అధికారపక్షంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్సీ అనారోగ్యంతో కన్నుమూశారు. 65 ఏళ్ల వయసున్న పార్టీ ఎమ్మెల్సీ కరీమున్నీసా అకాలమరణం చెందారు. శుక్రవారం సైతం ఆమెకు మండలి సమావేశాలకు హాజరు అయ్యారు. అలాంటి ఆమె రోజు గడిచేసరికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారన్న వాస్తవాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్న సభలో తమతో ఉన్న వ్యక్తి.. ఈ రోజు నుంచి ఇక ఎప్పటికి లేరన్న …

Read More »

నేను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగాం: పురందేశ్వరి

ఏపీ అసెంబ్లీలో ఈ రోజు జరిగిన ఘటన రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగిన వాదోపవాదాల్లో తన సతీమణిని వైసీపీ ఎమ్మెల్యేలు కించపరిచే విధంగా మాట్లాడారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు. తాను తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే భువనేశ్వరిపై చేసిన …

Read More »

కేసీఆర్‌కు ఛాన్స్ ఇవ్వ‌ని మోడీ!

రాజ‌కీయాల్లో ఇదొక చిత్రం! తాను ఒక‌టి త‌లిస్తే.. మ‌రొక‌టి జ‌రిగిన‌ట్టుగా ఉంది.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఆయ‌న ఏద‌నుకున్నా.. జ‌రిగి తీరాల్సిందే. తాను అనుకున్నది సాధించే వ‌ర‌కు కూడా నిద్ర‌పోని నాయ‌కుడిగా.. ఎంత‌కైనా తెగించే నేత‌గా కేసీఆర్ గుర్తింపు పొందారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ఎవ‌రు అడ్డు ఒచ్చినా.. త‌ల ఒంచేది లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అయితే.. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. …

Read More »