తెలంగాణలో వెలుగు చూసిన ఫామ్ హౌజ్ ఇష్యూ కీలక టర్న్ తీసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయంపై అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల పరస్పర ఆరోపణలు, విమర్శలతో రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ …
Read More »అలీకి పదవిచ్చిన సీఎం జగన్..
వైసీపీ నాయకుడు నటుడు, కమెడియన్ మహమ్మద్ అలీకి.. ఏపీ ప్రభుత్వం పదవిని కట్టబెట్టింది. ఆయనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా.. నియమిస్తూ.. తాజాగా ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. వాస్తవానికి 2014 ఎన్నికల కు ముందు నుంచి అలీ.. వైసీపీలోనే ఉన్నారు అప్పట్లో రాజమండ్రి ఎంపీ టికెట్‌ను ఆయన ఆశించారు. కానీ, ఇవ్వలేదు. అదేసమయంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వమని కోరారు. అది కూడా సాధ్యం కాలేదు. ప్రభుత్వంలోకి …
Read More »జగన్‌తో వర్మ భేటీ.. ఇదిగో క్లారిటీ..
వివాదాస్పద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. సుమారు రెండుగంటల పాటు ఇద్దరు చర్చించుకున్నారు. అయితే..ఆ చర్చల్లో ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు.. దీంతో ఉత్కంఠ నెలకొంది. అయితే.. తాజాగా వర్మ.. ఈ ఉత్కంఠకు తెర దించేశారు. తాను త్వరలోనే వ్యూహం అనే సీక్వెల్ చిత్రాన్ని తీయనున్నట్టు చెప్పారు. అది కూడా ఫక్తు రాజకీయ మూవీ అని తేల్చి చెప్పేశారు. ఎన్నికలే …
Read More »జగన్-వర్మ.. ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రహస్యంగా 40 నిమిషాలకు పైగా భేటీ అయ్యారన్న వార్త చర్చనీయాంశంగా మారింది. తమ రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేంశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ సినిమాలు తీసే విషయమై వీళ్లిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రోత్సాహంతో వర్మ మూడు సినిమాలు తీయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. పవన్ …
Read More »పీకే పాదయాత్రకు జగన్ సాయం చేస్తున్నారా?
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ‘జన్ సురాజ్’ పేరిట ఓ వేదికను స్థాపించి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్‌లో 3,500 కి.మీ. పాదయాత్ర చేస్తున్నారు. అయితే.. పీకే వెనుక ఎవరు ఉన్నారు? ఆయన ‘రాజకీయం’ కోసం నిధులు ఎవరు ఇస్తున్నారు? అనే ప్రశ్నలు ఎప్పటి నుంచో చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రశ్నలకు స్వయంగా జవాబు ఇచ్చారు ప్రశాంత్ కిశోర్. తాను చేస్తున్న పాదయాత్రకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ డబ్బులు సర్దు …
Read More »ఫామ్‌హౌజ్ ఘటన: ఉల్లిక్కి పడిన బీజేపీ
రూ.400 కోట్లను నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇచ్చి.. వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని.. టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి.. పోలీసులు కూడా.. దాడులు చేసి.. మధ్యవర్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వివాదం.. రాష్ట్రాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. దీనికి మూలాలు ఢిల్లీలో ఉన్నాయని అంటున్నారు. ఈ ఘటనపై బండి సంజయ్ బుధవారం అర్ధరాత్రి మీడియాతో మాట్లాడారు.ఈ ఫామ్‌హౌజ్ అంశంపై ఆసాంతం ఆయన కామెడీగా మాట్లాడడం …
Read More »వైసీపీ ఓటు బ్యాంకు పై జనసేన కన్ను..
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి? ఎన్ని ఓట్లు వస్తాయి.? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు టీడీపీతో చేతులు కలిపిన దరిమిలా.. ఈ చర్చ మరింత ఎక్కువగా సాగుతోంది. ప్రస్తుతం వచ్చే ఎన్నికల పై దృష్టి పెట్టిన జనసేన.. జిల్లాల వారీగా.. ఓటు బ్యాంకు పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఉభయగోదావరి, విశాఖ, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, ఉత్తరాంధ్ర జిల్లాలపై పెద్దగానే ఆశలు …
Read More »ఎమ్మెల్యేలకు వల.. డబ్బుల ఎర.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి..
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో తీవ్ర కలకలం రేగింది. అధికార పార్టీ టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించడంతో తీవ్ర అలజడి సృష్టించింది. హైదరాబాద్ శివారులోని ఓ ఫౌంహౌస్‌లో నలుగురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతుండగా పోలీసులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఇది పెను రాజకీయ దుమారానికి తెరదీసింది. టీఆర్ ఎస్ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించగా.. బీజేపీ నేతలు.. టీఆర్ …
Read More »‘జనసేన జెండాలు చంద్రబాబు పెట్టించాడు’
విశాఖలో పరిణామాల అనంతరం వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలపై పవన్ బూతులతో విరుచుకుపడ్డారు. ఇక అదే సందర్భంలో బిజెపికి ఊడిగం చేయబోమంటూ పవన్ చేసిన ప్రకటన జాతీయ స్థాయిలో బీజేపీ నేతలను ఆలోచనలో పడేసింది. బిజెపి అంటే తమకు గౌరవం ఉందని, అలా అని బిజెపి చెప్పిందే చేయడం సాధ్యం కాదని పవన్ చెప్పడంతో …
Read More »జగన్-రాంగోపాల్ వర్మ ఏం సినిమా ప్లాన్ చేస్తున్నారో?
వివాదాస్పద దర్శకుడుగా ఇటీవల కాలంలో వార్తల్లో ఉంటున్న సంచలన డైరెక్టర్.. రాంగోపాల్ వర్మ .. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింంది. గతంలో సినిమా టికెట్ల ధరల పెంపు.. తగ్గింపు.. విషయంలో ట్విట్టర్ వేదికగా.. వర్మ ఏపీ సర్కారుపై కొన్ని కామెంట్లు చేశారు. అదే సమయంలో అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రిపేర్ని నానితో ఆర్జీవీ భేటీ అయ్యారు. సినిమా టికెట్లపై చర్చించారు కూడా. …
Read More »భక్తులకు ‘మంత్రి’ గ్రహణం!!
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వేసిన వీరంగంతో.. భక్తులు నానా తిప్పలు పడ్డారు. అందునా.. సూర్యగ్రహణం రోజు ఎంతో ఆశ పెట్టుకుని శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చిన వందల మంది భక్తులు.. మంత్రి అనుచరులు చేసిన.. అరాచకంతో.. ఇబ్బందులు పడడమే కాకుండా.. తీవ్ర మనోవేదనకుకూడా.. గురయ్యారు. “ఎంత మంత్రి అయితే.. మాత్రం .. అని మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మంగళవారం.. సూర్యగ్రహణం అన్న సంగతి తెలిసిందే. దీనిని పురస్కరించుకుని.. రాష్ట్రంలో …
Read More »మరీ ఇంత బలుపా.. ఎమ్మెల్యేగారూ!!
ఎమ్మెల్యే అంటే.. ఎలా ఉండాలి? ప్రజలకు అంతో ఇంతో సేవ చేసేలా ఉండాలి. పోనీ.. చేయకపోయినా.. వారు ఓట్లు వేసి గెలిపించినందుకైనా వారి పట్లకనీసం మర్యాదగా ప్రవర్తించాలి. కానీ, ఇటీవల కాలంలో కొందరు ఎమ్మెల్యేలు.. దారి తప్పుతున్నారు. నోటి దురుసుతో కొందరు దూకుడు ప్రదర్శిస్తుంటే.. మరికొందరు.. ఇష్టానుసారం వ్యవహరించి.. వివాదాలకు కేంద్రం అవుతున్నారు. తాము ఏం చేసినా.. అడిగే వారెవరు.. అనుకుంటున్నారో.. లేక.. ప్రజలు భరిస్తారులే.. అని భావిస్తున్నారో.. తెలియదు.. …
Read More »