టీడీపీ అంటేనే కొంత స్పెషల్. అభ్యర్థుల ఎంపిక నుంచి టికెట్ల వరకు ప్రజల అభిప్రాయాలకు చంద్రబాబు పెద్ద పీట వేశానని చెప్పుకొంటున్నారు. అలానే చేస్తున్నారు కూడా. ఇప్పుడు తాజాగా వెలువరించిన రెండో జాబితాలోనూ .. చంద్రబాబు ఇలానే వ్యవహరించారు. 34 మంది అభ్యర్థులతో ప్రకటించిన ఈ జాబితాలో కొన్ని కొన్ని ప్రత్యేకతలు స్పష్టంగా కనిపించాయి. ఇవి ఆ పార్టీకే కాదు.. మార్పును కోరుకునే వారికి కూడా కొంత ఆశాజనకంగానే ఉన్నాయని అంటున్నారు తమ్ముళ్లు.
ఇవీ ప్రత్యేకతలు..
- మొత్తం 11 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
- 9 మంది గ్రాడ్యుయేషన్ చేసినవారు.
- ఒకరు పీహెచ్‌డీ చేసిన అభ్యర్థి(గుంటూరు జిల్లా పెదకూరపాడు, భాష్య ప్రవీణ్)
- 8 మంది ఇంటర్మీడియెట్ అర్హులు. తప్పిన వారు కూడా ఉన్నారు.
- ఐదుగురు 10వ తరగతి విద్యార్హతగా కలిగినవారు. వీరిలోనూ తప్పినవారు ఉన్నారు.
- మొత్తం 34 మంది అభ్యర్థుల్లో 27 మంది పరుషులు
- ఏడుగురు మహిళా నేతలు. దాదాపు అందరూ వారసులే.
- 25-35 ఏళ్ల మధ్య వయసువారు ఇద్దరు
- 36-45 ఏళ్లలోపువారు 8 మంది
- 46-60 ఏళ్ల వయసున్నవారు 19 మంది
- 61-75 ఏళ్లవారు ముగ్గురు
- 75 ఏళ్లకు పైబడినవారు ఇద్దరు
ఇక్కడ వారు వీరేనా?
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 14 స్థానాల్లో టీడీపీ, జనసేన అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఇప్పటికే టీడీపీ రెండు విడతల జాబితాలు ప్రకటించింది. అయితే పోలవరం విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ తరపున బొరగం శ్రీనివాసులు టికెట్ ఆశిస్తున్నారు. అయితే జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు కూడా పోటీలో ఉన్నారు. ఈయనకు గెలుపు అవకాశం తక్కువగా ఉందని పవన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిని(భీమవరంలో మాదిరిగా) జనసేనలోకి తీసుకుని టికెట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.