Political News

‘జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌ను మా పై రుద్దకండి’

ఏపీ సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌ల‌ను త‌మ‌పై రుద్ద‌వ‌ద్దంటూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఘాటు రిప్ల‌య్ ఇచ్చింది. జ‌గ‌న్ పేరు ఎత్త‌కుండానే దుమ్ముదులిపేసింది. “ఏపీ సీఎం ఆలోచ‌న‌లు ఆయ‌న‌కు ఉంటాయి. అవి మేం పుణికి పుచ్చుకున్నామ‌ని ఎవ‌రు చెప్పారు? అలా అనుకుంటే..దేశంలో 30 మంది ముఖ్య‌మంత్రులు ఉన్నా రు. వారు చేస్తున్న‌వ‌న్నీ కేంద్రం చేస్తుందా? మీ ఆలోచ‌న త‌ప్పు” అని కేంద్రం వైసీపీ ఎంపీల‌కు త‌గిన విధంగా స‌మాధానం చెప్పింది. ఇంత‌కీ …

Read More »

జ‌గ‌న్ పుట్టిన రోజు కానుక‌.. ఇక‌, ‘ఆ మాట’ మాట్లాడొద్దు!

ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణ‌యాలు నిజంగానే షాకిస్తున్నాయి. ఏ ఉద్దేశంతో వీటిని తీసుకుం టున్నారో.. ప్ర‌బుత్వానికి అయినా తెలుసో లేదో.. కానీ, వీటి వ‌ల్ల వివాదాలే ఎక్కువగా తెర‌మీదికి వ‌స్తున్నాయి. కొన్నాళ్ల కింద‌ట‌.. క‌న్యాశుల్కం నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌పైనే నిషేధం విధించారు. అదేమంటే వైశ్యుల మ‌నోభావా లు దెబ్బ‌తినేలా ఉన్నాయంటూ.. వారి డిమాండ్‌మేర‌కు ఈ నిషేధం విధించిన‌ట్టు ప్ర‌భుత్వం తెలిపింది. వాస్తవానికి బ‌లిజేప‌ల్లి ల‌క్ష్మీకాంతం క‌వి రాసిన క‌న్యాశుల్కంలో సామాజిక …

Read More »

రాజకీయంలో తెలంగానం.. వ్యాపారం ఆంధ్రోళ్లతోనా?

ఢిల్లీ మద్యం కేసు ఏమో కానీ కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. ఏదైనా మాట్లాడినంతనే ఆంధ్రా.. తెలంగాణ అంటూ పాయింట్ల మీద పాయింట్లు తెర మీదకు తీసుకొచ్చే కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పటికి తెలంగాణ అంటే తమ పార్టీనేనని.. తమ పార్టీనే తెలంగాణ అన్నట్లుగా మాట్లాడటం తెలిసిందే. మాటల్లో వినిపించే తెలంగానం చేతల్లో ఎందుకు మిస్ అవుతుందన్నది ప్రశ్న. తెలంగాణ ప్రయోజనాల కోసం అహరహం శ్రమించే కల్వకుంట్ల ఫ్యామిలీకి.. ఈడీ ఛార్జిషీట్లో కవిత …

Read More »

అన్న‌కు.. ‘అమ్మ’ ఆశీర్వాదం క‌రువయ్యిందే!

జ‌గ‌న‌న్న పుట్టిన రోజు సంద‌ర్భంగా.. ఆ పార్టీ నేత‌లు చాలానే ఆశించారు. పార్టీ అధిష్టానం కూడా.. పెద్ద ఎత్తున సంబ‌రాలు చేయాల‌ని పిలుపునిచ్చింది. ఇక‌, ఈ నేప‌థ్యంలో టీటీడీ చైర్మ‌న్‌, వైసీపీ ముఖ్య నాయ‌కులు, సీఎం జ‌గ‌న్‌కు సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డి దంప‌తులు.. స్వ‌యంగా తాడేప‌ల్లి వ‌చ్చి.. సీఎం జ‌గ‌న్‌కు శ్రీవారి ప్ర‌సాదాల‌ను అందించి.. ఆశీర్వ‌దించారు. ఇక‌, క్రైస్త‌వ బోధ‌కులు సైతం.. వ‌చ్చి సీఎం జ‌గ‌న్‌ను ఆశీర్వ‌దించారు. ఇక‌, …

Read More »

ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ. 10 లక్షల కోట్లు

అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డులను దాటి పోతోంది. పాత అప్పులు తీర్చలేకపోగా, సరికొత్త అప్పులు చేస్తూ.. జనాన్ని రుణగ్రస్తులను చేస్తోంది. ప్రభుత్వ రోజువారీ ఖర్చులకు సైతం అప్పులు చేయక తప్పడం లేదు. జగన్ ప్రభుత్వం అధికారానికి వచ్చే నాటికి ఏపీకి రూ.3,62,375 కోట్ల అప్పులున్నాయి. గత మూడేళ్లలో వైసీపీ సర్కారు మరో రూ. 6,37,064 కోట్ల అప్పు చేసింది. అంటే ప్రస్తుతం ఏపీ అప్పులు రూ. 9,99,439 కోట్లన్నమాట. ఇంకో …

Read More »

కల్వకుంట్ల కవిత కష్టాలు – త్వరలోనే ఈడీ విచారణ

కవిత అరెస్టు ఖాయమా.. !ఆమెను ఫిక్స్ చేసేందుకు కొత్త ఎఫ్ఆఐర్ వేస్తారా !ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం కవిత చుట్టూ తిరిగిందా !బీఆర్ఎస్ నేతలకు, ఢిల్లీ ఆప్ కు ఉన్న లింకులు బయటపడుతున్నాయా ! బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ ఆమెను కేవలం సాక్షిగానే విచారించగా.. ఈడీ ఏకంగా ఛార్జ్ షీటులో ఆమె …

Read More »

డ్రగ్ టెస్ట్ కు కేటీఆర్ రెడీ

మర్యాదగా ఉంటానని.. మిగిలిన వారి మాదిరి చిల్లర రాజకీయాలు.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తీరు తనకు అలవాటు ఉండదన్నట్లుగా మాట్లాడే మంత్రి కేటీఆర్.. అందుకు భిన్నంగా వ్యవహరించారు. తనను అదే పనిగా టార్గెట్ చేసే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఘాటుగా రియాక్టు అయిన వేళలో ఆయన బ్యాలెన్స్ మిస్ అయ్యారు. ఇటీవల కాలంలో ఆయన నోటి నుంచి ఎప్పుడే వినని కొత్త తరహా మాటలు వచ్చేశాయి. …

Read More »

ఫైర్ బ్రాండ్ల‌కు ఓట‌మి భ‌యం.. రీజ‌న్ ఇదేనా?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో చాలా మంది ఫైర్ బ్రాండ్ నాయ‌కులు ఉన్నారు. వీరికి తిరుగులేద‌ని.. వారి అనుచ‌రులు, పార్టీ అధిష్టానం కూడా న‌మ్ముతోంది. అయితే, ఎంతైనా ప్ర‌జాస్వామ్యం క‌దా.. ప్ర‌జాభీష్టం లేకుంటే.. ప‌వ‌న్ లాంటి వాడే ఓడిపోయిన ప‌రిస్థితి ని చూశాం క‌దా! ఇప్పుడు వీరి ప‌రిస్థితి కూడా ఇలానే ఉందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఫైర్ బ్రాండ్ల‌లో మ‌రింత ఫైర్ అయ్యేవారి ప‌రిస్థితి ఎలా ఉందో చూద్దాం.. …

Read More »

భాగ్యనగరంపై దేశం నేత గురి

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణపై గురి పెట్టారు. 2023 ఎన్నికల్లో తెలంగాణను ఓ పట్టుపట్టాలనుకుంటున్న దేశం అధినేత హైదరాబాద్లో విజయవకాశాలు బేరీజు వేసుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ తీరుపై సెటిలర్లతో పాటు తెలంగాణ జనం కూడా విసుగు చెందారని గ్రహించిన చంద్రబాబు.. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారు. హెదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని నియోజవర్గాల ప్రజల్లో టీడీపీపై విశ్వాసం కలిగించేందుకు ఆయన వ్యూహరచన చేస్తున్నారు.. రాజధానిలో భారీ …

Read More »

జగనన్నా.. ఈ ఆత్మహత్యలు రికార్డు ఏంటన్నా?

Suicide

ఆంధ్రప్రదేశ్ పాలన పైనపటారం లోన లొటారంగా తయారైంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ప్రభుత్వం అప్పులు చేసి డబ్బులు వెదజల్లుతున్నట్లు కలరింగ్ ఇవ్వడం మినహా.. క్షేత్రస్థాయిలో చేసిందేమీ లేదని పలు సంఘటనలు, గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వేరు ప్రాంతాలకు తరలి పోతున్నట్లు రోజువారీ వార్తలు వస్తున్నాయి. పెద్దగా కొత్త పరిశ్రమలేమీ రావడం లేదు. నైపుణ్యం లేని కార్మికుల సంగతి దేవుడెరుగు.. నైపుణ్యం ఉన్న వారికే …

Read More »

బాల‌య్య నియోజ‌క‌వ‌ర్గం మోడ‌ల్ కానుందా..?

అవును.. టీడీపీ నాయ‌కుడు, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురం నియోజ‌క వ‌ర్గం పార్టీ నేత‌ల మ‌ధ్య హాట్ టాపిక్‌గా మారింది. నియోజ‌క‌వ‌ర్గంలో బాల‌య్య పెద్ద‌గా ప‌ర్య‌టించ‌క‌పోయినా.. ఉండ‌క‌పోయినా.. ఆయ‌న పేరు మాత్రం మార్మోగుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఎటు చూసినా.. బాల‌య్య పేరు, ఆయ‌న చిత్త‌రువులు క‌నిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా చూపుతున్న శ్ర‌ద్ధేన‌న్న‌ది పార్టీ వ‌ర్గాల మాట‌. గ‌త రెండు సార్లుగా బాల‌య్య హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం …

Read More »

ఈసారి అసెంబ్లీకి సంజ‌య్ పోటీ?!

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్‌.. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్నారు. దీంతో ఆయ‌న‌కు అసెంబ్లీలో అడుగు పెట్టి.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను నేరుగా విమ‌ర్శించే అవ‌కాశం లేకుండా పోయింద‌నే ఆవేద‌న ఆయ‌న‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని పార్టీ వ‌ర్గాల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న పంథాను మార్చుకున్నార‌ని స‌మాచారం. అంటే.. ఈ సారి బండి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ …

Read More »