మాజీ ఐఏఎస్ అధికారి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రాజకీయం ఇక ముగిసినట్టేనని వైసీపీ నాయకులు చెబుతున్నారు. 2014లో తిరుపతిపార్లమెంటు స్థానం నుంచి విజయం దక్కించుకున్న ఆయనను నియోజకవర్గాల సమీకరణలో భాగంగా గూడూరు అసెంబ్లీకి 2019 లో పంపించారు. అక్కడ కూడా ఆయన విజయం దక్కించుకున్నారు. అయితే.. ఈ దఫా మాత్రం ఆయనకు టికెట్ లేదని తేల్చి చెప్పడం గమనార్హం. అంతర్గత వ్యవహారాలు.. అసమ్మతి …
Read More »మంగళగిరి కోసం లోకేష్ ఇంత కష్టపడుతున్నాడా…!
ఒక్క ఓటమి.. నాయకులకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. మరోసారి గెలవాలన్న పట్టుదలనే కాదు.. భారీ మెజారిటీని దక్కించుకోవాలన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశిస్తుంది. ఇదే ఇప్పుడు టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ రాజకీయ బాటగా మారిందని అంటున్నారు పరిశీలకులు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్.. తొలిసారి మంగళగిరి నుంచి పోటీ చేశారు. అయితే.. ఆయన ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయినప్పటికీ.. పట్టుదలతో ఉన్న …
Read More »టికెట్ ఎఫెక్ట్: ఎక్కడికక్కడ అడ్రస్ లేని నేతలు!
వైసీపీ ప్రజాప్రతినిధులు గత నెల రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 151మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉండగా.. సీఎం జగన్ మినహా.. గత నెల రోజులుగా మిగిలిన వారు ఎక్కడా కనిపించడం లేదు. మంత్రుల్లోనూ ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ మాత్రమే కనిపిస్తున్నారు. వారు కూడా కొన్ని అంశాలకే పరిమితమయ్యారు. మిగిలిన వారు ఎక్కడా ఐపు లేకుండా పోయారు. ఇక, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు …
Read More »వైసీపీ ఇన్ చార్జిల మూడో జాబితా ఇదే
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 నెలల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ వైసీపీ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే సర్వేల నివేదికలు, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను తొలగిస్తూ వారి స్థానంలో కొత్త వారికి జగన్ చోటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే చీటింగ్ స్థానాలు కోల్పోయిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారే యోచనలో ఉన్నారు. …
Read More »ఒకే సారి మూడు ఎన్నికలు.. ఏపీలో మరింత సెగ..!
ఏపీలో మరో రెండు మాసాల్లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ రెండే కాదు.. ఇప్పుడు మరో ఎన్నిక కూడా తెరమీదికి వచ్చింది. అదే రాజ్యసభ ఎన్నికలు. మొత్తం 3 స్థానాలకు ఈ సార్వత్రిక ఎన్నికల సమరానికి ముందే.. ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల విషయం మాత్రమే రాజకీయంగా ప్రాధాన్యం ఉంది. కానీ, ఇదేసమయంలో చాపకింద …
Read More »టీడీపీలో పాత కాపులకే పెద్దపీఠ.. ఆ 25 సీట్లు ఫిక్స్…!
టీడీపీ కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు ప్రక్రియను ముమ్మరం చేసింది. అయితే.. ఇది పైకి చెప్పకపోయినా.. అంతర్గత సమావేశాల్లో 25 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. అయితే.. ఈ పాతిక మంది కూడా పాతకాపులే కావడం గమనార్హం. నిజానికి వీరంతా గత ఎన్నికల్లో మెజారిటీ సంఖ్యలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో వారికే టికెట్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సిద్ధం చేసిన జాబితాలో …
Read More »మా ఊరొస్తా..రక్షణ కల్పించండి: రఘురామ
తనను వైసీపీ ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్ చేసిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుప్రీం కోర్టు చొరవతో రఘురామకు రాజద్రోహం కేసు నుంచి కాస్త ఊరట లభించింది. ఆ తర్వాత ఆయన ఏపీకి వచ్చేందుకు ప్రయత్నించగా..ఆయనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఆ వ్యవహారం తర్వాత ఆయన ఏపీకి రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా …
Read More »ఈ మంత్రి పరిస్ధితి ఏమిటో అర్ధంకావటంలేదా ?
రాబోయే ఎన్నికల్లో ఈ మంత్రి పరిస్ధితి ఏమిటో అర్ధంకావటం లేదట. కారణం ఏమిటంటే రెండో ఎన్నికకే నియోజకవర్గం మారాల్సి రావటమే కారణమని పార్టీలో చెప్పుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ చర్చంతా మంత్రి విడదల రజని గురించే. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న రజని రాజకీయాలపై ఇంట్రెస్టుతో రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. రావటం రావటమే తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే తనకు టీడీపీలో టికెట్ రాదని అర్ధమవ్వగానే వెంటనే వైసీపీలో చేరిపోయారు. రజనీది …
Read More »కాపు-కాంగ్రెస్-రఘువీరా.. కొత్త పాలిటిక్స్ ..!
రాష్ట్రంలో కొత్త రాజకీయాలు పురుడు పోసుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు అందరూ మరిచిపోయిన.. కాంగ్రెస్ పార్టీ వైపు పాతకాపులు ఇప్పుడు చూస్తున్నారు. అధికార వైసీపీలో టికెట్ దక్కని నాయకులు.. పొలో మంటూ కాంగ్రెస్ బాటపడుతున్నారు. గతంలో ఎవరైతే.. ఈ పార్టీని భూస్థాపితం చేశారో.. ఎవరైతే.. పార్టీని కూకటి వేళ్లతో సహా పెకలించారో వారంతా ఇప్పుడు హస్తం వైపు చూస్తున్నారు. ఆ పార్టీలో చేరుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. ఉండరన్నట్టుగా.. ఇప్పుడు …
Read More »మాగుంటకు లైన్ క్లియర్.. కానీ, పెద్ద టార్గెట్ పెట్టారా..!
నిన్న మొన్నటి వరకు తీవ్ర రసకందాయంలో ఉన్న ఒంగోలు ఎంపీ టికెట్ పై స్పష్టత వచ్చింది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించిన అనంతరం పార్టీ అధిష్టానం మాగుంటకు లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆయన కుమారుడికి కాకుండా.. మాగుంటనే ఈ దఫా పోటీ చేయాలని ఆదేశించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న …
Read More »‘పెనం మీద ఉంటారా.. పొయ్యిలో పడతారా.. ‘
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తమ డిమాండ్లు నెరవేర్చలేదంటూ.. ప్రభుత్వ ఉద్యోగులు రగిలిపోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తమ వంతు పాత్ర పోషిస్తామని కూడా వారు హెచ్చరి స్తున్నారు. దీంతో సహజంగానే ఉద్యోగుల ఓటు బ్యాంకు వైసీపీకి ఒకింత ఇబ్బందిగా మారిందనే చర్చ సాగుతోంది. ఇలాంటి కీలక సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని ఉద్యోగులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొడాలి …
Read More »వైసీపీలో మరో వికెట్..ఎంపీ బాలశౌరి ఔట్?
ఏపీలో శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీలో ముసలం ముదురుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలను మారుస్తూ జగన్ రెండు లిస్ట్ లు విడుదల చేయడంతో టికెట్ దక్కని వారు పక్క పార్టీలలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే రోజుకో ఎమ్మెల్యేనో, ఎంపీనో అన్నట్లు వైసీపీలో టపటపా వికెట్లు పడుతున్నాయి. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నిన్న తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా అదే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates