Political News

నాలుగు ఉల్లిపాయ‌లు, నాలుగు బంగాళ దుంప‌లు.. నాలుగు ట‌మాటాలు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ స‌ర్కారును, ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి.. ఆస‌క్తిక‌ర మైన ట్వీట్ చేశారు. “లెక్క చూసుకో జ‌గ‌న్ రెడ్డీ.. నాలుగంటే.. నాలుగే!!” అని న‌ర్మ‌గ‌ర్భంగా ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. విష‌యం లోకి వెళ్తే.. గోదావ‌రి జిల్లాల‌ను వ‌ర‌ద ముంచెత్తింది. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం… వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకుంటా మ‌ని ప్ర‌క‌టించింది. సీఎం జ‌గ‌న్ దీనిపై వ‌రుస స‌మీక్ష‌లు కూడా చేశారు. అధికారుల‌ను …

Read More »

మీ వ‌ల్లే మేం మునుగుతున్నాం.. ఏపీపై మంత్రి పువ్వాడ ఫైర్‌

ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ, తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌ల మ‌ధ్య వివాదం చెల‌రేగింది. మీ వ‌ల్లే మా భ‌ద్రాచ‌లం మునిగిపోయింద‌ని.. మంత్రి పువ్వాడ అజ‌య్ అన‌గానే.. అటు వైపు ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వెంట‌నే రియాక్ట్ అయ్యారు. మీ ప‌నిమీరు చూసుకుంటే మంచిది.. అని ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. ఏం జ‌రిగిందంటే..ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ముంపు ముప్పు ఉందని తెలంగాణ రాష్ట్ర …

Read More »

ఆ లేడీ ఎమ్మెల్యే ఇక‌ ఆసుప‌త్రికే ప‌రిమితం!

ఆమె లేడీ డాక్ట‌ర్‌. మ‌రోమాట‌లో చెప్పాలంటే.. సీఎం జ‌గ‌న్ ఇంటి డాక్ట‌ర్ కూడా. హైద‌రాబాద్‌లో ఆమెకు ఉన్న ఆమె మ‌ల్టీస్పెషాలిటీ ఆసుప‌త్రిలోనే.. సీఎం జ‌గ‌న్ కుటుంబం త‌ర‌చుగా వైద్య సేవ‌లు పొందుతూ ఉంటుంద‌ని అంటారు. ఈ ప‌రిచ‌యాల నేప‌థ్యంలోనే 2019 ఎన్నిక‌ల్లో ఆమెకు జ‌గ‌న్ పిలిచి టికెట్ ఇచ్చారు. అప్ప‌టి వ‌ర‌కు పార్టీ కోసం ప‌నిచేసిన వారిని కూడా ప‌క్క‌న పెట్టి మ‌రీ.. లేడీ డాక్ట‌ర్‌కు టికెట్ కేటాయించారు. ఆమే.. …

Read More »

గోమూత్రం అమ్ముతాం.. కొనుక్కోండి..బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న‌

బీజేపీ పాలిత ప్ర‌భుత్వాలు.. వింత వింత ప‌నుల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నాయి. త‌మ‌కు ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న వారి ఇళ్ల‌పైకి రాత్రి వేళ ఏదో ఒక కార‌ణం చెప్పి.. బుల్ డోజ‌ర్లు పంపించ‌డం.. హిజాబ్ ర‌గ‌డ‌ల‌కు.. త‌మ వారినే ప్రోత్స‌హించడం .. వంటివి తెర‌మీదికి వ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఇప్పుడు.. గోమూత్రం అమ్ముతామంటూ.. బీజేపీ స‌ర్కారు బేరం పెట్టింది. లీటర్ ఆవు మూత్రాన్ని రూ.4 చొప్పున కొనుగోలు చేసి స‌బ్సిడీపై తాము …

Read More »

టీడీపీ, జనసేన పోటీచేస్తాయా ?

మార్చిలో రాబోతున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పోటీ చేస్తాయా ? ఇపుడిదే అంశంపై చర్చ మొదలైంది. వచ్చే మార్చిలో మూడు ఎంఎల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేయబోయే అభ్యర్ధులను జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేసేశారు. పట్టభద్రుల నియోజకవర్గాల కోటాలో భర్తీ అవబోయే ఎంఎల్సీల సంఖ్య మూడే అయినా ఓటర్లు మాత్రం తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఉన్నారు. ఈ మూడు నియోజకర్గాలు ఏమిటంటే …

Read More »

ఈ ఎంఎల్ఏకి టికెట్ డౌటేనా ?

జగన్మోహన్ రెడ్డి ఎంఎల్ఏలతో సోమవారం నిర్వహించిన సమీక్ష తర్వాత ఇదే విషయం చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఎంఎల్ఏలందరు హాజరయ్యారు కాబట్టి జగన్ గడపగడపకు వైసీపీ కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రులు, ఎంఎల్ఏలు ఎవరెవరు ఎన్నెన్ని రోజులు కార్యక్రమంలో పాల్గొన్నారనే విషయాన్ని జగన్ నివేదిక రూపంలో చదివి వినిపించారు. కార్యక్రమంలో తాము పాల్గొంటున్నది లేనిది తెలుసుకునేందుకు జగన్ ఇంత లోతుగా రోజువారి నివేదికలు తెప్పించుకుంటారని బహుశా ఎంఎల్ఏలు …

Read More »

త‌మ్ముళ్లూ తెలుసుకోండ‌యా.. ఇదీ.. బాబుకు జ‌గ‌న్‌కు ఉన్న తేడా..!!

ఔను! రాజ‌కీయ విశ్లేష‌కులు ఇదేమాట చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని.. పార్టీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావాలని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌పిస్తున్నారు. పార్టీ నాయ‌కుల‌ను త‌న సొంత మ‌నుషులు చూస్తూ..నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగుతూ.. ఈ వ‌య‌సులోనూ.. 18 గంట‌ల పాటు ఆయ‌న ప‌నిచేస్తున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉండికూడా.. ఆయ‌న నిరంత‌రం.. ప‌నిచేస్తున్నారు. …

Read More »

టీడీపీ కంచుకోట‌ల ప‌రిస్థితేంటి?

ఔను.. టీడీపీకి కంచుకోట‌ల్లా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఏంటి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌ను తిరిగి ద‌క్కించుకుంటామా? అస‌లు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎలా పుంజుకుంది? ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణా, ఉభ‌య గోదావ‌రి, శ్రీకాకుళం.. ఇలా పలు జిల్లాల్లో వైసీపీ ఎలా దూకుడు ప్ర‌ద‌ర్శించింది? అనేది టీడీపీ నేత‌ల మ‌ధ్య మ‌రోసారి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో …

Read More »

వైసీపీలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2 కోట్లు ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌

వైసీపీ ఎమ్మెల్యేల‌పై క‌న‌క వ‌ర్షం కుర‌వ‌నుంది. స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ ఈ విష‌యాన్ని చెప్పారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు సహా ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజల ఆశీస్సులు తిరిగి పొందేలా ప్రయత్నాలు చేయాలని …

Read More »

టీడీపీ ఫస్ట్ టార్గెట్ జగన్ కాదా?

మాజీ మంత్రి కొడాలి నాని అంటే చంద్రబాబునాయుడు అభిమానులకు ఎంతమంటుందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని ఇప్పటికి ఎన్నోసార్లు బహిరంగంగానే ప్రకటించారు. దానికి తగ్గట్లే టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే తమ మొట్టమొదటి టార్గెట్ మాజీమంత్రి కొడాలినానీయే అని స్పష్టంగా ప్రకటించారు. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీలో చాలామందే మాట్లాడుతున్నారు. …

Read More »

మానవత్వం లేని జగన్ పాలన: చంద్రబాబు ఫైర్‌

ఏపీలో వైసీపీ పాల‌న‌పై టీడీపీ అదినేత చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మాన‌వ‌త్వం లేని పాల‌న అంటే ఇదే అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రోనా స‌మ‌యంలో చ‌నిపోయిన వారి కుటుంబాల కోసం కేంద్రం ఇచ్చిన నిధుల‌ను కూడా వాడుకున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇంత‌క‌న్నా దారుణం ఇంకేం ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. “నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.1100 కోట్ల కోవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. దారి …

Read More »

‘బాబు, ప‌వ‌న్‌ కుళ్లు రాజ‌కీయాలు’

ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ఏ బ‌హిరంగ స‌భ‌లోనో.. పార్టీ కార్య‌క్ర‌మంలోనో కాదు.. ఏకంగా అధికారులతో నిర్వ‌హించిన వ‌ర‌ద స‌మీక్ష‌లోనే జ‌గ‌న్ ఇలా వ్యాఖ్యానించారు. `వీళ్ల‌వి కుళ్లు రాజ‌కీయాలు. వ‌ర‌ద సాయాన్నీ రాజ‌కీయం చేస్తున్నారు“ అని జ‌గ‌న్ నిప్పులు చెరిగారు. వరద సాయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని తప్పుబట్టారు. ప్రతిపక్షాలు, మీడియా అభూత కల్పనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. కొందరికి …

Read More »