ఏపీ అధికార పార్టీ వైసీపీలో కలవరం బయలు దేరిందా? ఆ పార్టీపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎలా రియాక్ట్ అవుతున్నారు? జనసేన అధినేత వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తున్నారు? అని వైసీపీ నేతలు ఆలోచన చేస్తున్నారా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన నేతల దూకుడు, ప్రజల్లోకి వెళ్తుండడం.. ఇప్పటం వ్యవహారం, పవన్ వ్యాఖ్యలు, చెప్పులు చూపించడం, వంటి అంశాల పై వైసీపీలో …
Read More »మంగళగిరిలో రెడ్డి నాయకులను Bye Bye.. జగన్ అనేశారు
‘గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? అసలు ఎందుకింత రాజకీయం రచ్చగా మారింది? తక్షణం నివేదిక ఇవ్వండి!’ ఇదీ.. జిల్లా ఇంచార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి మేకతోటి సుచరితకు పార్టీ అధిష్టానం తాజాగా ఆదేశాలు చేసిందని.. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గంలో సీఎం జగన్‌కు అత్యంత ముఖ్యుడు, సన్నిహితుడు ఆళ్ల రామకృష్నారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన కనుసన్నల్లోనే ఇక్కడ రాజకీయాలు సాగుతున్నాయి. అయితే, ఇటీవల …
Read More »మోడీ భజన లో మునిగిపోయిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గురించి రెండుముక్కల్లో చెప్పాలంటే.. మనసులో ఏది అనుకుంటే అది దాచుకునే తత్వం ఆయనకు లేదు! అంతే!! ఇదే ఆయనకు ఒక్కొక్కసారి ప్లస్ అవుతుంటే.. ఎక్కువ సార్లు మైనస్ అయిపోతోంది. నిజానికి రాజకీయ నాయకుడు అంటే ఎక్కడికయ్యెడి ప్రస్తుత.. మప్పటికామాటలాడి.. అని భర్తృహరి అన్నట్టు వ్యవహరించాలి. ఇప్పటి వరకు ఉన్నపార్టీలు ఇలానే ఉన్నాయి. కానీ, ఎటొచ్చీ.. పవన్ మాత్రం తన మనసులో మాటను భావావేశాన్ని ఏమాత్రం …
Read More »జగన్‌కు త్వరలో హాలీడేస్
ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై టీడీపీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పవర్ హాలిడే, క్రాప్ హాలిడే, ఇప్పుడు ఆక్వా హాలిడే అమలు చేస్తున్నారని అన్నారు. ఇదే పద్ధతి కొనసాగితే.. త్వరలోనే జగన్‌కు పొలిటికల్ హాలీడే ప్రకటించడం తథ్యమని వ్యాఖ్యానించారు. ప్రజలు కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఇక జగన్ రెడ్డి హాలిడే తీసుకోవడం మాత్రమే మిగిలి …
Read More »‘కేసీఆర్ కాబోయే ప్రధాని’.. ‘ఏపీకి ముఖ్యమంత్రిగా పవన్’
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. ఉద్య మ నాయకుడిగా, తెలంగాణ సారథిగా ఢిల్లీపై కొట్టాడిన నాయకుడుగా కూడా ఆయనకు పేరుంది. ఈ క్రమం లోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ అంటే అభిమానం కురిపిస్తారు. అయితే, ఇప్పుడు కేసీఆర్‌కు కేవలం తెలంగాణలోనేకాదు.. పొరుగున ఉన్న ఏపీలోనూ అభిమానులు ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గతంలో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, తర్వాత సీఎం జగన్‌ను కలుసుకునేందుకు …
Read More »సిల్క్ స్మితకు పవన్‌కు తేడా లేదు: మంత్రి బొత్స
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా విజయనగరంలో పర్యటించి.. గుంకలాంలో ప్రభుత్వం వేసిన లే అవుట్‌ను పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించా రు. జగనన్న ఇళ్ల విషయంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. అయితే, తాజాగా పవన్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఒకప్పుడు సినిమాల్లో వ్యాంపు.. వ్యాంపు కారెక్టర్లు చేసిన సిల్క్ స్మితకు.. ఇప్పుడు …
Read More »జగన్ ముద్దుబిడ్డపై జనసేన యుద్ధం?
ఏపీ సీఎం జగన్ తన మానస పుత్రికగా భావిస్తున్న కీలక పథకం ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జగనన్న ఇళ్ల కాలనీలను ఏర్పాటు చేసి.. ఇళ్లను నిర్మించే చర్యలు చేపట్టారు. అయితే, వేసిన లేఅవుట్లకు ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు వాటిలో కనీసం మార్కింగ్ కూడా వెయ్యలేదు. దీంతో ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన విజయనగరంలోని …
Read More »పోలవరం.. ఐదేళ్లయినా పూర్తికాదు: హరీశ్ రావు
ఏపీ ప్రభుత్వం.. ముఖ్యంగా సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి హరీశ్‌రావు. ఈ ప్రాజెక్టు ఇప్పుడే కాదు.. మరో ఐదేళ్లకు కూడా పూర్తికాదు.. అని వ్యాఖ్యానించారు. అంతేకాదు రాసిపెట్టుకోవాలని ఏపీ ప్రజలకు సైతం ఆయన సూచించడం గమనార్హం. ఇక, తెలంగాణలోని కాళేశ్వరం గురించి ప్రతిపక్ష నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక అబద్దాన్ని పదేపదే చెప్పి నిజమే అని నమ్మించే …
Read More »ఎన్నికల మేనిఫెస్టోపై పవన్ క్లారిటీ
వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి వస్తామని చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇటీవల కాలంలో దాదాపు మేనిఫెస్టోను ప్రకటించేస్తున్నారు. అంతేకాదు.. తాను సీఎం అయ్యాక చేసే తొలి రెండు సంతకాలు ఇవే అని కూడా చెబుతున్నారు. దీంతో ఎన్నికల మేనిఫెస్టోపై పవన్ క్లారిటీకి వచ్చేశారా? అనే చర్చ సాగుతోంది. ఇటీవల ఇప్పటంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కాగానే.. రాష్ట్రంలోని …
Read More »వైసీపీ గడ్డపై టీడీపీ దూకుడు
వైసీపీ అధినేత, సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పరిస్థితి తారుమారవుతోంది. 2014, 2019లో తిరుగులేని విధంగా ఇక్కడ వైసీపీ దూకుడు ప్రదర్శించింది. 2014లో రాజంపేటలో టీడీపీ విజయం దక్కించుకుంది. అయితే, 2019 వచ్చే సరికి మాత్రం వైసీపీ పూర్తిగా పట్టు పెంచుకుంది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలను కూడా వైసీపీ దక్కించుకుంది. అంటే మొత్తంగా కడపపై పూర్తి పట్టు సాధించింది. పైగా 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నేతలు …
Read More »వైసీపీ తాటతీస్తాం.. ఒక్క అవకాశం: పవన్
వైసీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లాలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదని తప్పుబట్టారు. 2024లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలని, జనసేన రావాలని ఆకాంక్షించారు. జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, అవినీతిపరుల తాటతీస్తామని పవన్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు జనసేన పిలుపునిచ్చింది. జగనన్న ఇళ్లు-పేదల కన్నీళ్లు-జగనన్న మోసం.. పేరుతో …
Read More »పవన్ తో మాట్లాడితే.. పట్టా రద్దే?
ఏపీలో కొత్త రూల్ పాసైనట్టుగా కనిపిస్తోందని జనసేన పార్టీ నాయకులు అంటున్నారు. తాజాగా విజయ నగరం జిల్లాలో ప్రభుత్వం పేదలకు ఇస్తున్న జగనన్న ఇళ్ల కాలనీకి సంబంధించిన లే అవుట్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇస్తోంది. అయితే.. విజయనగరంలో వేసిన గుంకలాం అతి పెద్ద లే అవుట్. ఈ నేపథ్యంలో దీనిని పరిశీలించాలని పవన్ …
Read More »