జనసేన నాయకుడు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు..తాజాగా సంచలన వ్యాఖ్యలు చేవారు. ప్రతి వెధవనూ గౌరవించనక్కర్లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఇది రాజకీయంగా దుమారం రేపింది. కొన్నాళ్లుగా నాగబాబు చాలా నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. జనసేన నాయకులను విమర్శించిన వారిని, వారి విధానాలను తప్పుబట్టిన వారిని కూడా ఆయన ఏకేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉద్యమ నాయకుడి గురించేనని అంటున్నారు పరిశీలకులు.
నాగబాబు ఏమన్నారంటే.. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవను గౌరవించక్కర్లేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లు అవుతారు అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అయితే.. ఇది వివాదం అవుతుందని అనుకున్నారో.. లేక మరేమో తెలియదు కానీ.. గమనిక అంటూ దీనికి వివరణ కూడా ఇచ్చారు. ఏం మాట్లాడినా మా గురించేనేమో అని ఆపాదించుకుంటున్నారని… ఇది ఎన్నికల సమయం కాబట్టి తన ఉద్దేశాలను చెపుతున్నానే కానీ… ఎవరినీ ఉద్దేశించి చెప్పింది కాదు అని తెలిపారు. తాను చెప్పింది జీవిత సత్యమని చెప్పారు.
ఎవరి గురించి?
నాగబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సమయం సందర్భం లేకుండా అయితే చేయరు. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో నేనే హీరో.. మిగిలిన వాళ్లు జీరో.. అంటూ పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు బుధవారం పవన్ నిర్వహించిన పిఠాపురం నేతల సమావేశంలో చర్చకు వచ్చారు. దీనిపై పవన్.. ఆయన పెద్దాయన. ఏమంటాం అని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా నాగబాబు ఇప్పుడు ఇలా దూకుడు ప్రదర్శించారని జనసేన నాయకులు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates