ఏపీ వైసీపీ నాయకుడు, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీలో రాళ్లు చేరడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. దాదాపు వారం రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. మూడు రోజుల క్రితమే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం …
Read More »మంత్రికి జైల్లో ‘థాయ్ మసాజ్’లు..
మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మంత్రి సత్యేందర్ కుమార్ జైన్‌కు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. తిహార్ జైలులో ఉంటున్న జైన్‌కు సకల సౌకర్యాలు అందుతున్నట్లు అందులో స్పష్టమవుతోంది. జైలులో ఆయనకు ఓ వ్యక్తి మసాజ్ చేస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. కాళ్లకు నూనె రాసి మర్దనా చేస్తున్నాడు. ఇది సెప్టెంబరు 13వ తేదీ వీడియో కాగా ఆ …
Read More »బుగ్గనను సూటిగా అడిగేసి.. కడిగేశారు
అనూహ్య పరిస్థితి ఎదురైంది ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి. విజయవాడలో నిర్వహించిన వాణిజ్య సలహా మండలి సమావేశాన్ని వివిధ వ్యాపార సంఘాట ప్రతినిధులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు పడుతున్న కష్టాల్ని.. ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కళ్లకు కట్టినట్లుగా చెబుతూ.. ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. జగన్ ప్రభుత్వంలో అధికారుల దాడులు తరచూ జరుగుతున్నాయని.. అదేమంటే.. ప్రభుత్వానికి నిధుల కొరత అంటున్నారని.. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకుంటే మమ్మల్ని …
Read More »‘నా భార్య మంచిది కాదు .. నా భర్త తాగుబోతు ఓటేయొద్దు’
ఎన్నికలంటే ఎన్నికలే. రాజకీయాలంటే రాజకీయాలే. గతంలో ఎవరో అన్నట్టుగా.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు!! ప్రస్తుతం గుజరాత్ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలిదశ డిసెంబరు 1న జరగనుంది. అయితే.. ఈ ఎన్నికల్లో అనేక చిత్ర విచిత్రాలుతెర మీదికి వస్తున్నాయి. వీటిలో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోందేంటంటే.. ఒకే స్తానం నుంచి రెండు పార్టీల తరపున పోటీ పడుతున్న భార్యా-భర్తలు! ఔను. నిజమే. మూడు ముళ్ల బంధంతో ఏకమైన ఇద్దరు దంపతులు రెండు …
Read More »నేను కను సైగ చేస్తే.. మీరు చిత్తు చిత్తు: చంద్రబాబు
కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన చంద్రబాబుకు తొలి రోజు నుంచి వైసీపీ నేతల నుంచి అడ్డగింతలు ఎదురవుతున్నాయి. ఆయన ఎక్కడికి వెళ్లినా.. హైకోర్టు విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు.. చంద్రబాబుపైనా విమర్శలు చేస్తున్నారు. తాజాగా మూడో రోజు.. చివరి రోజు పర్యటనలోనూ వైసీపీ నాయకుల, కార్యకర్తలు ఆయనను అడ్డగించారు. ఏకంగా టీడీపీ ఆఫీస్ వద్దే హల్చల్ చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో …
Read More »అయ్యో రాహుల్… ప్లాన్ ఫెయిలైందే !
రాజకీయాల్లో ఒక్కొక్క సారి నేతలు వేసే అడుగులు బూమరాంగ్ అయి.. తమకే భారీ దెబ్బతగులుతుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్తితి కూడా ఇలానే ఉంది. బీజేపీని ఇరుకున పెట్టి.. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాలని భావించిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఆ పార్టీని రోడ్డున పడేశాయి. కీలకమైన మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో ఉన్న బందాన్ని ఠాక్రే శివసేన అధినేత ఉద్ధవ్ ఠాకరే తెంచేసుకున్నారు. దీంతో వచ్చే …
Read More »జగన్ అక్రమాస్తుల కేసులో భారీ దెబ్బ..
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హెటిరో సంస్థలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమపై కేసు కొట్టివేయాలన్న అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఏ-1గా ఉన్న జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాకే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెటిరోకు భూములు కేటాయించారని.. క్విడ్ ప్రోకో జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్న ఈ కేసు కొట్టివేయదగినది కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కేసును క్వాష్ చేసేందుకు.. …
Read More »నేను రౌడీలకు రౌడీని.. గూండాలకు గూండాను..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కర్నూలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 3 రాజధానులు కావాలని డిమాండ్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో ఘర్షణ జరిగింది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలు చేస్తే..సీఎం డౌన్ డౌన్ అంటూ తెలుగుదేశం కార్యకర్తలు పోటీగా నినాదాలు చేశారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో చంద్రబాబు అక్కడికి …
Read More »ఈ అతి తగ్గిస్తే చాలు బాబూ
నారా చంద్రబాబు నాయుడు తన ఘనతల గురించి కొంచెం ఎక్కువగా చెప్పుకుంటారన్నది వాస్తవమే. కానీ ఆయన ముఖ్యమంత్రిగా అనేక విజయాలు సాధించారన్నది నిజం. ఆయన సారథ్యంలో రాష్ట్రం ప్రగతి వైపు అడుగులు వేసిందని, హైదరాబాద్ అసాధారణంగా అభివృద్ధి చెందిందని, ఐటీలో రాష్ట్రం పరుగులు పెట్టిందని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తుంటారు. ఐతే ఆయన గురించి వేరే వాళ్లు ఎలివేషన్లు ఇచ్చినపుడు బాగుంటుంది కానీ కొన్నిసార్లు …
Read More »ఎంపీని చెప్పుతో కొడతానన్న కవిత
తెలంగాణలో మళ్లీ రాజకీయ రచ్చ ప్రారంభమైంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన కామెంట్లు తీ వ్ర వివాదానికి దారితీశాయి. సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందు కు సమాయత్తం అయ్యారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఈ క్రమంలో కవిత తీవ్రస్థాయిలో స్పందించారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలోనే చెప్పుతో కొడతా! అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియాతో …
Read More »జగన్ కుటుంబానికి కేంద్రం షాక్.. ఏం చేసిందంటే!
ఏపీ సీఎం జగన్ కుటుంబానికి కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. తన మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నిర్వహిస్తున్న కీలక ట్రస్టును కేంద్ర ప్రబుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం ఈ ట్రస్టును విజయమ్మ నిర్వహిస్తున్నారు. ‘విజయమ్మ చారిటబుల్ ట్రస్టు’ పేరుతో నిర్వహిస్తున్న దీని ద్వారా.. కడపలో పేదలకు సాయం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం చేస్తున్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే.. ఈ ట్రస్టును రద్దు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం …
Read More »సీఎం జగన్ రాయలసీమ ద్రోహి: చంద్రబాబు
సెల్‌ఫోన్ అనే ఆయుధంతో సీఎం జగన్ ప్రభుత్వ అరాచకాలను, వైఫల్యాలను అందరికీ చెప్పాలని.. ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికి అందరూ బాధ్యత తీసుకోవాలన్న ఆయన.. ఇది ప్రజాస్వామ్య పోరాటానికి నాంది కావాలన్నారు. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని నిప్పులు చెరిగిన చంద్రబాబు.. వైసీపీ గూండాలతో తన పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అరాచకాలు ఆపకపోతే ప్రజలే జగన్‌ను తరిమికొడతారన్న నిప్పులు చెరిగారు. కర్నూలు జిల్లాలో మూడు …
Read More »