Political News

నారాయణ బాధేమిటో ?

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెగ బాధ పడిపోతున్నారు. ఇంతకీ ఈయన బాధేమిటయ్యా అంటే పీఆర్సీ సాధన సమితి ఉద్యమంలోకి రాజకీయ పార్టీలకు అనుమతి లేదని చెప్పినందుకు. ఉద్యోగులు ఎవరు రాజకీయపార్టీల ఉచ్చులో పడవద్దని, ప్రభుత్వంపై అనవసరంగా ఆరోపణలు, వ్యాఖ్యలు చేయవద్దని ఉద్యోగసంఘాల నేతలు బహిరంగంగా ఉద్యోగులందరికీ అప్పీల్ చేశారు. ఆ అప్పీలునే నారాయణ తప్పు పడుతున్నారు. ఉద్యోగుల సమ్మెలోకి రాజకీయ పార్టీలకు అనుమతి లేదని చెప్పడం ఏమిటంటు బాధపడిపోయారు. …

Read More »

వణికించేస్తున్న ఎంఐఎం

ఒక్క సీటులో కూడా గెలుస్తుందో లేదో తెలీని ఎంఐఎం పెద్ద పార్టీలను కూడా వణికించేస్తోంది. కారణం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో ప్రతి సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకం కాబట్టే. ఇంతకీ విషయం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించే ఇదంతా. ఎంఐఎం 100 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. మొదటి జాబితాలో 25 మంది అభ్యర్థులను కూడా ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. మిగిలిన పార్టీ అధినేతలు గెలుపు …

Read More »

జ‌గ‌న్ మొండిత‌నం.. రెండు విధాలా చేటేనా?

ఏ ప్ర‌భుత్వానికైనా.. ఏ పాల‌కుడికైనా ప‌ట్టు విడుపులు ఉండాలి. లేక‌పోతే.. మొద‌టికే మోసం వ‌స్తుంది. ఇప్పుడు ఈ మాట ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యంలో అధికార పార్టీ వైసీపీలోని సీనియ‌ర్ నేత‌ల నుంచే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఉద్యోగులతో ఏపీ ప్ర‌భుత్వం తెగేదాకా లాగుతున్న ప‌రిణామాలు.. వారి పీఆర్సీ విష‌యంలో అనుస‌రిస్తున్న ధోర‌ణి.. ఒక‌ర‌కంగా..సీఎంకు ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చే కొంద‌రికి న‌చ్చిందేమో కానీ.. చాలా మంది సీనియ‌ర్ల‌కు న‌చ్చ‌డం లేదు. దీనికి కార‌ణం.. …

Read More »

పాత ట్రిక్కునే వాడుతున్న మోడీ సర్కారు

సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ సర్కార్ ఓటర్లకు తాయిలాల లీకులను వదులుతోంది. ఎప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నా ఆర్థిక అంశాలకు సంబంధించి లీకులివ్వటం అలవాటుగా మారింది. ఎన్నికల్లో లబ్ది దొరికిందా సరే లేకపోతే మళ్ళీ ఆ ఊసును కూడా కేంద్రం పట్టించుకోవటం లేదు. ఆ మధ్య బీహార్ ఎన్నికల్లో గెలుపు కోసం, తర్వాత పశ్చిమబెంగాల్లో విజయం కోసం, ఇపుడు ఐదు రాష్ట్రాల్లో గెలుపు కోసం ఇలాంటి …

Read More »

బీజేపీకి వ‌రుస షాక్‌లు

గోవాలో ఎన్నిక‌ల‌కు ముందు అధికార బీజేపీకి వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ నేత‌లు వ‌రుస‌గా ఆ పార్టీని వీడుతున్నారు. దీంతో కీల‌క స‌మ‌యంలో పార్టీకి దెబ్బ ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ రాజీనామాలు, చేరిక‌ల‌తో గోవా రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్ప‌టికే త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోవడంతో దివంగ‌త ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ త‌న‌యుడు ఉత్ప‌ల్ పారిక‌ర్ పార్టీకి రాజీనామా చేసిన …

Read More »

సీఎం జ‌గ‌న్‌, సాయిరెడ్డిల‌కు ఆర్ ఆర్ ఆర్ సవాల్‌

త‌న మాట‌ల‌తో రాజ‌కీయాల‌ను వేడెక్కించే వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌, వైసీపీ కీల‌క నాయ‌కుడు, ఎంపీ విజ‌యసాయిరెడ్డికి సంచ‌ల‌న స‌వాల్ రువ్వారు. కొన్నాళ్లుగా త‌న‌పై సాయిరెడ్డి చేస్తున్న‌విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడ‌తాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా విజ‌యసాయిరెడ్డి.. త‌న‌ను పారిపోయార‌ని.. సీఐడీ నోటీసులు ఇస్తే.. త‌ప్పించుకున్నార‌ని.. ఎంపీ ప‌ద‌వికి రాజీనామా విష‌యంలో దోబూచులు ఆడుతున్నార‌ని విమ‌ర్శిస్తున్న‌ట్టు ర‌ఘురామ తెలిపారు. అయితే.. తాను పారిపోలేద‌ని.. త‌న …

Read More »

కొడాలి నాని.. ఈ కామెంట్ మ‌రీ దారుణం

సోష‌ల్ మీడియాలో చాలామంది కొడాలి నాని పేరు ప్ర‌స్తావించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌రు. బూతుల మంత్రి అని పిలుస్తుంటారు. ఇందులో టీడీపీ వాళ్లు మాత్ర‌మే కాదు.. న్యూట్ర‌ల్ జ‌నాలు కూడా ఉంటారు. ఎందుకంటే ఆయ‌న ఆ స్థాయిలో మీడియా ముందు బూతుల దండ‌కం అందుకుంటూ ఉంటారు. ఎవ‌రి రెక‌మండేష‌న్‌తో వ‌చ్చింది అన్న‌ది ప‌క్క‌న పెడితే నానికి టీడీపీలో తొలిసారిగా టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసింది చంద్ర‌బాబు నాయుడే అన్న‌ది వాస్త‌వం. కానీ …

Read More »

రాష్ట్ర‌మంతా ద‌ళిత బంధు.. కేసీఆర్ నిర్ణ‌యం..

ద‌ళిత బంధు- ల‌బ్ధిదారులైన ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఇచ్చే కీల‌క‌మైన ప‌థ‌కం. దీనిని ఎప్పుడు అమ‌లు చేస్తారు? ఎలా అమ‌లు చేస్తారు? అనే సందేహాలు.. అనుమానాలు.. అన్ని వ‌ర్గాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఆయా సందేహాల‌కు, అనుమానాల‌కు చెక్ పెడుతూ.. కేసీఆర్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టికే హుజూరాబాద్‌లో ఇది అమ‌ల‌వుతోంది. దీంతో మిగిలిన‌.. 118 నియోజ‌క‌వ‌ర్గా్ల‌లో ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లుకు …

Read More »

భారతిని ఇన్వాల్ చేసి జగన్ పై సెటైర్లు

స‌టైర్లు వేయ‌డంలో త‌న‌కు తానే సాటి అనిపించుకునే ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చెందిన టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు.. తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌పై త‌న స్ట‌యిల్లో స‌టైర్లు వేసి న‌వ్వించేశారు. ప్ర‌స్తుతం ఏపీ సీఎం జ‌గ‌న్‌.. జిల్లాకో విమానాశ్ర‌యం క‌డ‌తామంటూ.. వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం జ‌రిగిన కేబినెట్‌లో దీనికి సంబంధించి నిర్ణ‌యం తీసుకున్న విష‌యం కూడా అంద‌రికీ తెలిసిందే. అయితే.. ఈ కామెంట్ల‌పై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు …

Read More »

ఆ అధికారం మీకెక్క‌డిది? సీఎం జ‌గ‌న్‌కు ముద్ర‌గ‌డ ఘాటు లేఖ‌

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. కాపుల రిజ‌ర్వేష‌న్ కోసం చంద్ర‌బాబు హ‌యాంలో ఉద్య‌మించిన నాయ‌కుడు. అయితే.. త‌న ఉద్య‌మాన్ని ఆయ‌న కొన్నాళ్ల కింద‌టే ప‌క్క‌న పెట్టారు. ఈ క్ర‌మంలో కాపు ఉద్య‌మం నుంచి కూడా తాను త‌ప్పుకొంటున్న‌ట్టు చెప్పేశారు. అయితే. ప్ర‌జ‌ల కోసం.. తాను నిరంత‌రం.. ప‌నిచేస్తుంటాన‌ని మాత్రం వెల్ల‌డించిన ఆయ‌న‌.. త‌ర‌చుగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు లేఖలు రాస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా ముద్ర‌గ‌డ సీఎం జ‌గ‌న్‌కు లేఖ రాశారు. …

Read More »

నియామకం తర్వాత చట్ట సవరణా ?

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఇందుకు తాజాగా హైకోర్టులో చేసిన వ్యాఖ్యలే ఉదాహరణ. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్టు బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై కోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే బోర్డులో 29 మంది సభ్యులున్నారు. వీరు కాకుండా మరో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఉత్తర్వులివ్వటమే కాకుండా నియామకాలు కూడా చేసింది. దాన్ని కోర్టులో సవాలు …

Read More »

ప్ర‌పంచ వ్యాప్త దేశాధినేత‌ల్లో మోడీనే నెంబ‌ర్ 1

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి అగ్ర స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ అనే సంస్థ ఆయా దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో మోడీని 71 శాతం మంది ప్రజలు ఆమోదించారని తెలిపింది. ఇక ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానంలో నిలవ‌డం గ‌మ‌నార్హం. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల అధినేతలపై మార్నింగ్‌ కన్సల్ట్‌ ఈ సర్వే …

Read More »