Political News

రైతులకు పెన్షన్ పథకమా ?

తెలంగాణ రైతులకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆలోచన గనుక ఆచరణలోకి వస్తే రైతులకు పెన్షన్ ఇచ్చే రాష్ట్రంగా దేశం మొత్తం మీద తెలంగాణాకి క్రెడిట్ దక్కుతుందేమో. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 47 ఏళ్లు నిండిన ప్రతి చిన్న, సన్నకారు రైతలుకు 2 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కేసీయార్ ఆలోచిస్తున్నారు. కేసీఆర్ ఆలోచన ప్రకారం ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు పెన్షన్ పథకంపై పెద్ద …

Read More »

‘బలుపు’ వ్యాఖ్యల వేళ.. చిరుతో జగన్ లంచ్

పిలుస్తారు.. కూర్చెబెడతారు.. మాట్లాడతారు.. తిరిగి వస్తారు. సమస్య తీరదు.. పరిష్కారం లభించదు. ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ ఇష్యూస్ మొత్తం ఇదేరీతిలో సాగుతూనే ఉంటాయి. సినిమా టికెట్ల పంచాయితీ మొదలు.. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఇష్యూలలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. దీనికి తోడు.. ఏపీ ప్రభుత్వంలో భాగమైన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.. ఏకంగా సినిమా వాళ్లకు బలిసిందంటూ చేసిన వ్యాఖ్యలు పెను …

Read More »

నోటీసులతో మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోయిన రఘురామ

తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈసారి సంక్రాంతి పండక్కి.. తాను ప్రాతినిధ్యం వహించే నరసాపురానికి వెళ్లనున్నట్లుగా ఆయన ప్రకటన చేయటం తెలిసిందే. సొంత పార్టీ మీద అదే పనిగా విరుచుకుపడే రఘురామ.. తన ఊరికి వెళితే.. పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. సంక్రాంతికి ఊరికి వెళ్లేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ …

Read More »

ప్ర‌శ్నించ‌డ‌మే పాపం.. పండ‌గ పూట జీతం క‌ట్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌మ ప‌ట్ల క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.  ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలంటూ ఉద్యోగులు ఆందోళన చేపట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై క‌న్నెర్ర చేసిన స‌ర్కారు.. పండ‌గ పూట వారి జీతాల్లో నిర‌స‌న తెలిపిన రోజుకు వేతనాన్ని క‌ట్ చేసేసింది.  అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలో 10,665 సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. విధులకు హాజరు కాకుండా నిరసనలో …

Read More »

ఏపీ టికెట్ల వివాదంపై త‌ల‌సాని షాకింగ్ కామెంట్స్‌

ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపు నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. టికెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డంతో తాము తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని భావిస్తున్న ధియట‌ర్ల య‌జ‌మానులు.. వాటిని మూసే స్తున్నారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం థియేటర్ల‌లో త‌నిఖీలు ముమ్మ‌రం చేసింది. దీంతో మ‌రిన్ని మూత‌బ‌డు తున్నాయి.  దీంతో ఆయా ధియేట‌ర్ల‌లో ప‌నిచేస్తున్న అన్ని ర‌కాల సిబ్బంది రోడ్డున ప‌డిన‌ట్టు అయింది. థియేటర్ల విషయంలో ఏపీ ప్రభు త్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ …

Read More »

ఏపీలో రావ‌ణ రాజ్యాన్ని అంతం చేద్దాం: RRR

వైసీపీ ఎంపీ ర‌ఘురామ రాజు ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. ఏపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు. పార్టీలకతీతంగా అంతా ఒక్కటై రావణ రాజ్యాన్ని అంతం చేద్దామంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఎంపీ ఇంటికి వచ్చిన ఏపీ సీఐడీ పోలీసులు.. రఘురామకృష్ణరాజుకు నోటీసులు అందజేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ గతంలో నమోదు చేసిన …

Read More »

సరికొత్తగా మోడీ త్రీడీ సభ

అందివచ్చిన సాంకేతికతను, డిజిటల్ విప్లవాన్ని బీజేపీ నూరు శాతం ఉపయోగించుకుంటోంది. ఏడేళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆర్ధిక వనరులకు ఎలాంటి లోటు లేకపోవటంతో కొత్త విధానాలతో ప్రచారంలో దూసుకుపోతోంది. సంక్రాంతి పండుగ తర్వాత ఉత్తరప్రదేశ్ లో భారీ ఎత్తున వర్చువల్ పద్దతిలో బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మోడీ పాల్గొనే ఈ వర్చువల్ బహిరంగ సభలో తక్కువలో తక్కువ 50 లక్షల మంది పాల్గొనేందుకు వీలుగా బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. …

Read More »

ప్రగతి భవన్లో ఏం జరుగుతోంది ?

ఇపుడిదే విషయం అర్ధం కావటంలేదు. ఒక్కసారిగా కేసీయార్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో ప్రముఖుల భేటీలు జరుగుతున్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో పాటు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారామ్ ఏచూరి, సీపీఐ కీలక నేత డీ రాజా ఇప్పటికే కేసీయార్ తో భేటీ అయ్యారు. తాజాగా బీహార్ ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ కూడా ప్రగతి భవన్ కు వచ్చారు. ఇంతకు ముందే కేసీయార్ చెన్నైకి …

Read More »

రఘురామకు వైసీపీ ఎంపీ సవాల్

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ ఎంపీ సవాలు విసిరారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ రెండు నెలలు వెయిట్ చేస్తే ఎంపీ రఘురామ పై అనర్హత వేటు పడుతుందో లేదో తెలుస్తుందన్నారు. రఘురామకు ధైర్యముంటే తన రాజీనామాను రెండు నెలలు వాయిదా వేసుకోవాలని సవాలు విసిరారు. తిరుగుబాటు ఎంపీపై తప్పకుండా అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో సాధారణంగా ఎవరిపైనా అనర్హత …

Read More »

పొత్తుల‌పై నా ఒక్క‌డిదే నిర్ణ‌యం కాదు.. ప‌వ‌న్ వ్యాఖ్య‌లు

పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు జనసేనతో పొత్తులకు సంబంధించి కార్యకర్తలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ పొత్తుల విషయంలో ఒక్కడినే నిర్ణయం తీసుకోనన్నారు. ప్రతి జనసైనికుడి ఆలోచనతో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉందని, పలు పార్టీలు జనసేనతో …

Read More »

అధికారంలోకి వ‌చ్చేవాళ్లం.. చిరంజీవే అడ్డు ప‌డ్డారు..

చిరంజీవిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమని ఆయన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని తెలిపారు. ఇప్పుడు కూడా చిరంజీవి తనతో బాగానే ఉన్నారని చెప్పారు. రాజకీయంలో పోరాటం అనేది ఆటలో ఓ భాగమన్నారు. సినిమా టికెట్ల వివాదంలోకి టీడీపీని కూడా లాగుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీకి సినీ పరిశ్రమ సహకరించింది …

Read More »

ప‌రిటాల సునీత‌, శ్రీరామ్‌కు టిక్కెట్లు ఫిక్స్‌…!

అనంత‌పురం జిల్లా టీడీపీలో ప‌రిటాల ఫ్యామిలీ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌క్క‌ర్లేదు. గ‌తంలో ఈ ఫ్యామిలీకి పెనుకొండ అడ్డా. అక్క‌డ నుంచి ర‌వితో పాటు ఆ త‌ర్వాత సునీత కూడా ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నిక‌ల్లో సునీత పెనుకొండ‌ను వ‌దిలేసి రాఫ్తాడుకు మారారు. రాఫ్తాడులో వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన సునీత గ‌త ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు శ్రీరామ్ కోసం త‌న సీటు త్యాగం చేశారు. అయితే తొలిసారి …

Read More »