ఓడలు బండ్లు..బండ్లు ఓడలు అవుతాయనటానికి తెలంగాణా రాజకీయాలే ఉదాహరణ. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ పై మరో ప్రతిపక్షం బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టింది. రాబోయే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే అంటు కమలనాథులు ఊదరగొడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు పోటీలోనే ఉండదని పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని గట్టిగా బీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టలేకపోతుండటమే విచిత్రంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ …
Read More »ఈసారి కడప జిల్లా రాజకీయమే వేరు
రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోను త్రిముఖ పోటీ తప్పదు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పోటీ రసవత్తరంగా ఉండబోతోంది. అలాంటి నియోజకవర్గాలు కడప జిల్లాలోనే ఎక్కువగా ఉండబోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే కడప జిల్లా అంటేనే వైఎస్ కుటుంబంది అని ముద్రపడిపోయింది. ఇలాంటి కుటుంబంలో అన్న జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మల మధ్య రాజకీయ పోరు నడుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకోగానే కడప …
Read More »ఏసీబీ ముందుకు ఐఏఎస్ అరవింద్
మొత్తానికి సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ పెద్ద ప్రమాదంలోనే పడ్డారు. అవినీతి ఆరోపణలపై ఏసీబీ ఉన్నతాధికారులు అరవింద్ కు నోటీసులు జారీచేశారు. నోటీసులు అందిన రెండురోజుల్లోగా తమ ముందు విచారణ హాజరుకావాలని అందులో స్పష్టంగా చెప్పారు. హెచ్ఎండీఏ డైరెక్టర్ గా పనిచేసిన శివబాలకృష్ణను ఏసీబీ అరెస్టుచేసిన విషయం తెలిసిందే. డైరెక్టర్ హోదాలో రియల్ ఎస్టేట్ సంస్ధలకు అనుమతులు ఇవ్వటానికి శివ కోట్లాది రూపాయలు సంపాదించాడని ఇప్పటికే బయటపడింది. ఇప్పటివరకు …
Read More »13వ తేదీ బిగ్ ఫైట్ ?
13వ తేదీన ఒకేరోజు తెలంగాణాలో రెండు కీలకమైన ఘటనలు జరగబోతున్నాయి. మొదటిదేమో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజి సందర్శన. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, అవినీతిని వివరించేందుకు రేవంత్ రెడీ అయ్యారు. నాసిరకం నిర్మాణం కారణంగానే కొన్ని పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయమై జరిగిన విజిలెన్స్ విచారణలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు నిర్ధారణయ్యింది. నివేదిక ప్రకారం సుమారు రు. 4 వేల కోట్ల దోపిడి …
Read More »నోరుందని మాట్లాడకు రోజా..షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్
తనపై విమర్శలు చేసే వారిని ఏ మాత్రం వదలని తీరు ఏపీ పీసీసీ రథసారధి షర్మిలలో కనిపిస్తుంటుంది. తనను అనే ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా ఇచ్చుకునే ఆమె తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజాపై విరుచుకుపడ్డారు. ఆమెపై ఘాటు విమర్శలు చేసిన షర్మిల.. సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు రోజాపై ఎవరు చేయని సరికొత్త ఆరోపణలకు తెర తీశారు. ‘‘నగరి ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా. నియోజకవర్గంలో అంతా జబర్దస్త్ …
Read More »జగన్‌ను గద్దె దింపుతా.. షర్మిల శపథం..
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల తాజాగా శపథం చేశారు. ఇప్పటి వరకు వైసీపీపై విమర్శలు చేస్తూ వచ్చిన షర్మిల.. తాజాగా తన సోదరుడు, సీఎం జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేస్తానని శపథం చేశారు. రాష్ట్ర వ్యాప్త పర్యటనలలో భాగంగా షర్మిల.. తాజాగా తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం(ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా నియోజకవర్గం)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకు ఇక్కడి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా …
Read More »పవన్ అసెంబ్లీలో అడుగు పెడితే..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అసెంబ్లీలోకి అడుగు పెడతారా? ఆయన అడుగు పెడితే ఎలా ఉం టుంది? కొన్నాళ్లుగా ఏపీలో జరుగుతున్న చర్చ ఇది. ముఖ్యంగా జనసేన నాయకుల్లో ఈ చర్చ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం సినీ రంగానికి చెందిన ఒక్క బాలకృష్ణ టీడీపీ తరఫున, వైసీపీ నుంచి మంత్రి రోజాలు మాత్రమే సభలో ఉన్నారు. రోజా దాదాపు సినిమాలు మానేసిన నేపథ్యంలో ఆమె పూర్తిగా రాజకీయాలకు పరిమితమయ్యారు. ఇక, …
Read More »`మహాస్వాప్నికుడు`-చంద్రబాబుపై పుస్తకం
టీడీపీ అధినేత చంద్రబాబు జీవిత విశేషాలతోపాటు, ఆయన పాలన, దూరదృష్టి వంటి కీలక అంశాలపై సీనియర్ జర్నలిస్టు పూల విక్రమ్ రచించిన ‘మహా స్వాప్నికుడు’ పుస్తకాన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ ఆవిష్కరించారు. కువైట్‌లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్ కోడూరి ఈ పుస్తకాన్ని రూ.50 లక్షల ఖర్చుతో ప్రచురించారు. పుస్తక నేపథ్యం ఇదీ..ఈ పుస్తకంలో చంద్రబాబు జీవిత విశేషాలను, ఆయన రాజకీయంగా ఎదిగిన తీరును కళ్లకు కట్టారు. ముఖ్యంగా …
Read More »మళ్లీ అదే పంథా.. బాల్క మారలేదు బ్రో!
బీఆర్ఎస్ యువ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన పంథాను ఏమాత్రం మార్చుకోలేదు. ఇటీవల ఆయన సీఎం రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మీడియా ముందు రేవంత్‌ను ఉద్దేశించి చెప్పు చూపించిన వ్యవహారం మంటలు రేపింది. దీంతో ఆయన పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో బాల్క కొన్ని రోజులు తప్పించుకుపోయారు. తాజాగా పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కూడా …
Read More »కృష్ణా నుంచి గోదావరి వరకు.. టీడీపీ వదులుకోవాల్సిందేనా?
వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ పెట్టుకుంటున్న పొత్తులతో ఆ పార్టీ నాయకులు చాలా వరకు సీట్ల ను వదులుకోవాల్సి వస్తోంది. ఇది ఎంతగా అంటే.. కృష్నా జిల్లా నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా.. పెద్ద ఎత్తున కీలక స్థానాలను వదిలేయాల్సి వస్తోంది. గతంలో అయితే.. టీడీపీకి అటు ఇటుగా ఉన్న స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారనే అపవాదు ఉంది. కానీ, ఇప్పుడు మిత్రపక్షాలు కూడా.. తెలివిగా వ్యవహరిస్తున్నాయి. తమకు …
Read More »లోకేశ్ నోటి నుంచి ‘రెడ్ బుక్’ మాట వచ్చినంతనే..?
ఏపీలో అసెంబ్లీ.. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ‘శంఖారావం’ పేరుతో మలిదశ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్. యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించిన లోకేశ్.. ఇప్పుడు శంఖారావం పేరుతో సభల్ని నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు.. కార్యకర్తలు.. మద్దతుదారుల పై వైసీపీ ప్రభుత్వంలో దాడులు జరుగుతున్నాయని.. వేధింపులకు గురి చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన రెడ్ బుక్ ప్రస్తావన తేవటం తెలిసిందే. …
Read More »మోడీ వారి పొత్తుల.. `పరమార్థం` ఇదే!
పొత్తులు.. ఇప్పుడు దేశంలో ఎటు చూసినా.. ఎక్కడ విన్నా ఈ మాటే వినిపిస్తోంది. ఒక్క కాంగ్రెస్, ఎంఐ ఎం వంటి పార్టీలు మినహా.. ఏ పార్టీ కలిసి వచ్చినా.. చెంతకు చేర్చుకునేందుకు చంక ఎక్కించుకునేందు కు బీజేపీ తహతహలాడుతోంది. “కుటుంబ నియంత్రణ వ్యక్తులకే. సంఖ్యాబలం తగ్గించుకునేందుకే. కానీ, పార్టీలకు కుటుంబ నియంత్రణ వర్తించదు. ఎంత మంది ఉన్నా.. అంత లాభం“ అని కేంద్ర మంత్రి అమిత్‌షా వెల్లడించారు. దీంతో ఇంకేముంది.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates