అయిపోయింది.. అంతా అయిపోయింది.! ఔను, ‘తెలంగాణ జాతి పిత’ అన్న ట్యాగ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందర ఇకపై వుండకపోవచ్చు.! తెలంగాణ రాజకీయ తెరపైనుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఏనాడో కనుమరుగైపోయింది. ఇప్పుడున్నది భారత్ రాష్ట్ర సమితి. ఎప్పుడైతే, పార్టీ పేరు నుంచి ‘తెలంగాణ’ని తొలగించేశారో, అప్పుడే ఖేల్ ఖతం అయిపోయింది.! ఒకరొకరుగా భారత్ రాష్ట్ర సమితిని వీడుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి టిక్కెట్లు దక్కించుకున్న అభ్యర్థులూ పార్టీని …
Read More »గడబిడలో జనసేన.. 3 సీట్లకు అభ్యర్థులను ప్రకటించని పవన్!
జనసేన పార్టీ గడబిడలో ఉందా? కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీల నుంచి తీసుకున్న సీట్లు తక్కువే(21) అయినా..ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదా? అంటే.. ఔననే అంటున్నారు జనసేన నాయకులు. ఇంకా మరో ముగ్గురు అభ్యర్థులను జనసేన ప్రకటించాల్సి ఉంది. దీంతో జనసేన నాయకులు ఏదో కిరికిరి జరుగుతోందనే వాదన వినిపిస్తున్నారు. అంతేకాదు.. తేడా వస్తే.. పార్టీకి రాజీనామా తప్పదని కీలక నేతలు వ్యాఖ్యానించడం గమనార్హం. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి …
Read More »ఆర్థిక దిగ్బంధనంలో కాంగ్రెస్.. 1700 కోట్లు కట్టాలని నోటీసులు
దేశవ్యాప్తంగా తిరిగి పుంజుకుని.. అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న జాతీయ పార్టీ కాంగ్రెస్.. ఆత్మరక్షణలో పడిపోయింది. కీలకమైన ఎన్నికల వేళ.. ఆ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయి. ఒకవైపు నేతలు పోతున్నారు. మరో వైపు కేసుల ఉచ్చు బిగుసు కుంటోంది. తాజాగా ఆదాయపు పన్నుకు సంబంధించి కాంగ్రెస్‌కు మరోసారి ఐటీ నుంచి నోటీసులు అందాయి. 2017-18 నుంచి 2020-21 అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీతో సహా దాదాపు రూ.1700 కోట్ల నోటీసును …
Read More »బాలయ్యపై ఒంటిరి పోరుకు సాములోరు రెడీ!
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం హిందూపురం అసెంబ్లీ స్థానం. ఇక్కడ నుంచి వరుసగా ఇప్పటి వరకు నందమూరి బాలకృష్ణ విజయం దక్కించుకున్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా ఇక్కడ నుంచి గెలిచారు. ఇక, 2014, 2019లో బాలయ్య గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఈ సారి ఆయనపై స్వాములోరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి రెడీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ప్రకటన కూడా చేశారు. వాస్తవానికి మూడో సారి …
Read More »టాలీవుడ్ నుంచి తొలి ఎంట్రీ.. టీడీపీలోకి హీరో నిఖిల్
ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వేళ టాలీవుడ్ ఎటు వైపు ఉంటుందనేది ఆసక్తిగా మారింది. దీనిపై ఇప్పటికీ ఎవరూ మాట్లాడడం లేదు. అందరూ గుంభనంగానే ఉంటున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా.. యువ హీరో నిఖిల్ టీడీపీ బాట పట్టారు. టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో నిఖిల్ టీడీపీ కండువా కప్పుకొన్నారు. నిఖిల్ కు పసుపు కండువా …
Read More »మాజీ మంత్రి గంటాకే భీమిలి.. టీడీపీ మరో జాబితా విడుదల
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి టీడీపీ మరో జాబితాను విడుదల చేసింది. దీనిలో మాజీ మంత్రి, కాపు నాయకు డు, గంటా శ్రీనివాసరావుకు భీమిలి టికెట్ను కేటాయించారు. ఆయన ఎప్పటి నుంచో దీనినే కొరుతున్న విషయం తెలిసిందే. దీంతో అనేక తర్జన భర్జన అనంతరం భీమిలి టికెట్‌ను చంద్రబాబు ఆయనకే ఇచ్చారు. తొలుత చీపురుపల్లి(విజయనగరం, మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గం) వెళ్లాలని కోరినా, ఆయన వెళ్లకపోవడంతో ఈ సీటు పెండింగులో …
Read More »పవన్‌పై కసి తీర్చేసుకున్న ముద్రగడ.. ఏ రేంజలో అంటే!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పీకల లోతు ఆవేదన, ఆక్రందన వ్యక్తం చేస్తున్న కాపు ఉద్యమ నాయకుడు, మాజీ ఎంపీ ముద్ర గడ పద్మనాభం.. ఆ కసినంతా తీర్చేసుకున్నారు. అది కూడా ఓ రేంజ్‌లో ఆయన రెచ్చిపోయారు. జనసేన అధినేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజానికి వైసీపీలోకి చేరిన తర్వాతే ఆయన పవన్‌పై తొలిసారి “నువ్వు సినిమాల్లో హీరో మాత్రమే. మేం రాజకీయంగా హీరోలం” అంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తాము …
Read More »ఎన్నికలకు ముందే మేం ఒక ఎంపీ సీటు గెలిచేశాం
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి.. ప్రస్తుతం షెడ్యూల్ మాత్రమే వచ్చింది. ఇంకా, నోటిఫికేషన్ వచ్చేందుకు 20 రోజుల సమయం ఉంది. ఇక, ఆ తర్వాత.. ఎన్నికలు జరిగేందుకు మరో 20 రోజులకు పైగానే సమయం ఉంది. మరి ఇంత సమయం ఉన్నా.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం.. సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఎన్నికలకు మేంద మేం ఒక పార్లమెంటు సీటును గెలిచేశాం” అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీలో …
Read More »వైసీపీలోకి.. జనసేన కీలక నేత.. తూర్పులో ఇబ్బదేనా?
కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ.. జనసేన పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఒక వైపు పార్టీకి సెగ పెడుతోంది. మరోవైపు..పొరు గు పార్టీల నుంచి తీసుకున్న నాయకులకు టికెట్లు ఇవ్వడం మరింతగా ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి సమయంలో కీలకపరిణామం చోటు చేసుకుంది. అది కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ఎన్నో ఆశలు పెట్టుకున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాయకుడు పితాని బాలకృష్ణ పార్టీ మారిపోతున్నారు. ఆయన …
Read More »ఎంత కష్టమొచ్చింది సాయిరెడ్డీ!
నాయకులు ఎంత బలవంతులైనా.. ప్రజాబలం లేకపోతే.. ప్రజలు సమర్థించకపోతే.. ఒట్టిపోతారు. అభాసు పాలవుతారు. నలుగురు నవ్వేలా కూడా అయిపోతారు. ఇప్పుడు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్‌పై బరిలో ఉన్న రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి వేణుంబాకం విజయసాయిరెడ్డి పరిస్థితి ఇలానే ఏర్పడింది. తాజాగా ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో నెల్లూరులోని ఉదయగిరి నియోజకవర్గంలో ఆయన ప్రచార రథం ఎక్కి.. తనకు ఓట్లు వేయాలని …
Read More »సెంటి మెంటు + కూటమి ఎఫెక్ట్ : ఆ సీటు టీడీపీదే!
కాలం కలిసి రావడమంటే ఇలానే ఉంటుంది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. ఇప్పుడు ఆ యువ నేతకు పట్టం కట్టేందుకు నియోజకవర్గం ప్రజలు రెడీగా ఉన్నారు. అదే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ నేతృత్వంలోని కూటమి పార్టీల అభ్యర్థిగా గంటి మోహన చంద్ర బాలయోగి (జీఎంసీ బాలయోగి) కుమారుడు హరీష్ మాధుర్ పోటీ చేస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. అయితే..అ ప్పట్లో వైసీపీ హవా, …
Read More »కొత్త నాయకులను తయారుచేసుకుంటాం – కేటీఆర్
తెలంగాణలో నిన్న మొన్నటి వరకు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్ ఎస్ పార్టికి ప్రస్తుతం కష్ట కాలం నడుస్తోంది. ఒక్కొక్కరుగా కాదు.. మందలు మందలుగా నాయకులు పారిపోతున్నారు. పార్టీ నుంచి జారిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఎవరికైనా.. ఏ పార్టీ అధినేతకైనా.. ఒకింత బాధగానే ఉంటుంది. ఇదే బాధను బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా వ్యక్తం చేశారు. అయితే.. ఆయన కొంత పదునైన వ్యాఖ్యలే వాడారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates