జనసేన అధినేత, ఓ వైపు రాజకీయాలు మరోపైవు సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్ అప్పుల్లో ఉన్నారని.. ఆయనకు వచ్చే ఆదాయం కన్నా.. చేసే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని.. ఆయన సోదరుడు, జనసేన కీలక నాయకుడు నాగబాబు వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో కౌలు రైతు భరోసా యాత్ర సహా.. వివిధ రూపాల్లో పవన్ తన పార్టీ తరఫున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఎంతో మందికి సాయం …
Read More »తెలుగు రాష్ట్రలకు ఒట్టి చేతులేనా..
వార్షిక బడ్జెట్ వచ్చేస్తోంది. మధ్య తరగతి వర్గాలకు కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు అంటున్నాయి. బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే పద్దుల్లో ఆదాయపన్ను పరిమితిని గతంలోలాగే రెండున్నర లక్షలుగా కొనసాగిస్తూ, శ్లాబులను మాత్రం మార్చనున్నారని విశ్వసిస్తున్నారు.స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి మరో 15 నుంచి 25 వేల వరకు పెంచే వీలుందని చెబుతున్నారు. సెక్షన్ 80సీ కింద ఇచ్చే రాయితీని …
Read More »ఆనం, మాగుంట, కోటంరెడ్డి.. ఇంకా ఎవరెవరు?
పాలక వైసీపీ లో రోజురోజుకూ అసమ్మతి పెరుగుతోంది. పార్టీ అధిష్ఠానం తీరుపై సీనియర్ నేతల్లో అసంతృప్తి ఎక్కువవుతోంది. ఈ క్రమంలో సీనియర్ నేతలు పార్టీని వీడడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండడంతో వైసీపీ పెద్దలలో కలవరం మొదలైంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, వెంకటగిరి శాసన సభ్యుడు ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల ప్రభుత్వం తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. …
Read More »జగన్ వ్యూహం అదిరిందిగా
వైసీపీ అధినేత సీఎం జగన్.. తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలపై విశ్లేషకులు తమ మెదళ్లకు పదును పెంచారు. విశాఖపట్నం రాజధాని త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని.. త్వరలోనే తాను కూడా విశాఖ పట్నానికి వెళ్లిపోతున్నానని.. ఇదంతా కూడా రెండు మూడు రోజుల్లోనే జరిగిపోతుందని పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇంత సడెన్‌గా సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? ఎందుకు? అనేది ప్రశ్న. ఢిల్లీలో ఉన్న …
Read More »ప్రపంచం భారత్ వైపు చూస్తోంది: ప్రధాని మోడీ
ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని.. దేశ ప్రవేశ పెట్టబోయే తాజా బడ్డెట్ వైపు ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ప్రపంచ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత బడ్జెట్ సామాన్య పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. …
Read More »త్వరలోనే విశాఖ రాజధాని: సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఏపీకి పాలనా రాజధాని అవుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. త్వరలోనే తాను విశాఖ పట్నానికి మకాం మారుస్తున్నట్టు కూడా చెప్పేశారు. విశాఖకు పెట్టుబడుల వరద పారాలని తాము కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీనేనని ఆయన తెలిపారు. ప్రపంచ వేదికలపై ఏపీని నిలబెట్టడానికి శతథా కృషి చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …
Read More »కేటీఆర్ కూడా ప్రజలకు దూరమవుతున్నారా?
నాయకులుగా ఎదిగే క్రమంలో జనంలోనే ఉండేవాళ్లు కూడా క్రమేపీ ఆ జనానికి దూరమవుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఆ లిస్టులో చేరుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ జిల్లాలకు వెళ్తుంటే ఎవరూ నిరసనలు తెలపకుండా ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. విపక్ష నేతలను అరెస్టు చేస్తున్నట్లు చెప్తున్నప్పటికీ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ హనుమకొండ, కరీంనగర్ జిల్లాల పర్యటన సందర్భంగానూ అరెస్టులు జరుగుతున్నాయి. …
Read More »వివేకా హత్య కేసులో వైఎస్ భారతిని ప్రశ్నిస్తారా ?
మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడేళ్లు దాటింది. ఆయన్ను ఎవరు చంపారో ఇంతవరకు దర్యాప్తు సంస్థలు కనిపెట్టలేకపోయాయి. తొలుత స్టేట్ పోలీసులు, తర్వాత సిట్,ఇప్పుడు సీబీఐ అహర్నిశలు శ్రమ పడుతున్నా కేసు ఒక కొలిక్కిరాలేదు. సీబీఐ కూడా తొలి నాళ్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఇప్పుడు కాస్త స్పీడు పెంచింది. మొట్ట మొదటిసారిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ప్రశ్నించి కొంత మేర …
Read More »నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ గా ఆనం విజయ్ కుమార్ రెడ్డి ?
ఉమ్మడి నెల్లుూరు జిల్లా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సింహపురిలో నాయకత్వాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఎంత బుజ్జగించినా మాట వినని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఝలక్ ఇవ్వాలని జగన్ డిసైడైనట్లు సమాచారం. వైసీపీ అధినాయకత్వంపై కోటంరెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని అనుచరుల వద్ద ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మూడు నెలలుగా తన ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని, అందుకే 12 …
Read More »సీన్ రివర్స్.. దిగొచ్చిన కేసీఆర్.. గవర్నర్ స్పీచ్‌కు ఓకే!
తెలంగాణలో సంచలనం రేపిన గవర్నర్ వర్సెస్ బీఆర్ఎస్ ప్రభుత్వ వివాదం.. దాదాపు సమసిపోయింది. అనూహ్యంగా గవర్నర్‌పై హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం.. తనంతట తనే వెనక్కి తగ్గింది. 2023-24 వార్షిక బడ్జెట్‌ను గవర్నర్ తమిళి సై ఇప్పటి వరకు ఆమోదించలేదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కేసీఆర్ ప్రభుత్వం సదరు పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి సైతం అంగీకరించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. దీంతో …
Read More »ముసలాయనకే అనుభవం ఉందని ప్రజలు భావిస్తే..
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఓ ముసలాయన ఉన్నాడు అని వ్యాఖ్యానించారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా కూడా ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి కామెంట్లు చేయలేదు. అయితే.. వ్యూహాత్మకంగా ఇప్పటికే అనేక రూపాల్లో టీడీపీపై మాటలదాడి చేసిన జగన్.. అండ్ కోలు.. అవేవీ పెద్దగా ఫలించకపోవడంతో ఏజ్ ఫ్యాక్టర్ రాజకీయాలను తెరమీదికి తెచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే …
Read More »జోడో యాత్ర ముగిసింది.. ఖర్చు మిగిలింది..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడోయాత్ర ముగిసింది. కేరళలోని వయనాడ్ నియోజవర్గం ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ దేశ ప్రజలనుకలపాలనే ఉద్దేశంతో చేపట్టిన యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నిర్విఘ్నంగా ముందుకు సాగింది. అయితే.. యాత్ర ముగిసిన నేపథ్యంలో అసలు ఫలితం ఎంత? దీని నుంచి కాంగ్రెస్ ఆశించింది.. ఆశిస్తోంది.. ఎంత అనే చర్చ తెరమీదికి వచ్చింది. వాస్తవానికి ఒక నాయకుడు కానీ, ఒక పార్టీ కానీ …
Read More »