మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేతగా చెప్పబడే ముద్రగడ పద్మనాభం, ఎట్టకేలకు వైసీపీలో చేరిపోయారు. భారీ జన సందోహం నడుమ, వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని ముద్రగడ ప్లాన్ చేసుకున్నా, కాపు సామాజిక వర్గం ఆయన్ని లైట్ తీసుకుంది. దాంతో, ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది. ముద్రగడకి వైసీపీ ఎలాంటి ‘ఆఫర్’ ఇచ్చింది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, చాలాకాలంగా ఆయన …
Read More »మళ్లీ మేమే.. దేశం కూడా ఇదే చెబుతోంది: మోడీ
ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కొంత సమయం మాత్రమే ఉంది. కానీ, ఫలితం మాత్రం ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. మళ్లీ మేమేనని ఈ దేశం మొత్తం చాటి చెబుతోంది. ఈ దేశ ప్రజలు మోడీని మరోసారి ప్రధానిని చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆ సయమంలో మరెంతో దూరంలో లేదు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. నాగర్ కర్నూలు …
Read More »మరోసారి గెలిపించండి: మోడీ
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజలను తన కుటుంబంగా పేర్కొన్న ఆయన వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వివరించారు. తన నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేసిన తీరును, సాధించిన కీలక …
Read More »కీలక నేతలు చేతులు కలపందే సైకిల్ పుంజుకుంటుందా?
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. 34 మందితో రెండో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. దీనిలో కీలక నేతలకు చాలా మందికి టికెట్ ఇవ్వలేదు. అయితే.. వీరంతా ఏమీ ఆషామాషీ నాయకులు కాదు. టికెట్ దక్కించుకోని వారిలో చాలా మంది బలమైన నాయకులు, సామాజిక వర్గం పరంగా కూడా.. పేరున్న నేతలు కావడం విశేషం. మరి మార్పులు అయితే చేశారు. కొత్త ముఖాలకు చోటైతే ఇచ్చారు. కానీ, పాత …
Read More »గెలిచే సీటును వదిలేసుకున్న కేసీఆర్..
పొత్తు ధర్మం మంచిదే. అయితే.. ఈ పొత్తులోనూ అవతలి పక్షం ఏమాత్రం కష్టపడకుండానే గెలిచేలా చేస్తే.. అది పొత్తు ధర్మం కింద రాదని అంటున్నారు బీఆర్ ఎస్ నాయకులు. కానీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇలానే చేశారు. బీఎస్పీతో చేతులుకలిపిన కేసీఆర్.. రెండు పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయించారు. వీటిలో ఒకటి నాగర్ కర్నూల్. రెండోది హైదరాబాద్. సరే.. హైదరాబాద్ అంటే.. ఎంఐఎంకే హవా ఉంటుంది కాబట్టి.. ఇక్కడ …
Read More »ముగ్గురు మొనగాళ్ళు `ప్రజాగళం`: పోస్టర్ విడుదల
ఏపీలో త్వరలో జరగనున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకుని పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీలు సంయుక్తంగా తొలి సభకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ ఉమ్మడి సభను అదిరిపోయేలా నిర్వహించా లని ప్లాన్ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఈ నెల 17న సాయంత్రం 4 గంటలకు ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబంధించి.. …
Read More »కవితకు లీగల్ అడ్వైజర్‌గా జేడీ లక్ష్మీనారాయణ!
అన్ని దారులు మూసుకుపోయిన సమయంలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే.. ఆమెను అక్రమంగా అరెస్టు చేశారని బీఆర్ ఎస్ అగ్రనాయకులు ఆరోపిస్తున్నారు. కాదు, సక్రమంగానే అరెస్టు చేశామని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ వాద ప్రతివాదాల మధ్య సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్(జేడీ), జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు లక్ష్మీనారాయణ ఎంట్రీ ఇచ్చారు. కవితకు ఏకంగా ఆయన …
Read More »ఈడీ అధికారులపై కేటీఆర్ ఫైర్..
తన సోదరి, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఎలా అరెస్టు చేస్తారంటూ వారిని ప్రశ్నించారు. ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీష్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. చాలా సేపు వారిని అధికారులు ఇంట్లోకి అనుమతించలేదు. విచారణ ముగిసిన …
Read More »టార్గెట్ రోజా.. తెల్లవారితే టికెట్ ప్రకటిస్తారనగా..
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజాకు తన సొంత నియోజకవర్గం నగరిలో తీవ్ర సెగ తగులుతున్న విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ.. ఐదు మండలాల్లోని ఒకప్పటి ఆమె అనుచరులు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. తాజాగా వీరు మరోసారి ఎలుగెత్తారు. తెల్లవారితే టికెట్ ప్రకటిస్తారని అనగా వారు మరింత రెచ్చిపోయారు. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల నేతలు రోజాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. …
Read More »ఒకవైపు మోడీ రోడ్ షో.. మరోవైపు.. కవిత అరెస్టు.. ఏంటి సందేశం!
యాదృచ్ఛికమా.. కావాలని చేశారా? అనేది పక్కన పెడితే.. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో అడుగు పెట్టిన సమయంలో ఇటు ఆయనను తీవ్రంగా వ్యతిరేకించిన(ఇప్పుడు కాదు) కేసీఆర్ తనయ, బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారు లు అరెస్టు చేయడం సరికొత్త చర్చకు దారితీసింది. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణానికి సంబంధించి.. ఆమెను నిందితు రాలిగా పేర్కొన్న అధికారులు.. అనేక సందర్భాల్లో విచారించారు. మూడు సార్లు ఆమెను …
Read More »ఉరుములు లేని పిడుగు.. కవిత అరెస్టు
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె నిందితురాలిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఈడీ అధికారులు శుక్ర వారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత వేగం పెంచారు. అప్పటి వరకు ఎలాంటి చూచాయ కూడా లేకుండానే.. కవిత ఇంటికి వచ్చిన 12 మంది ఈడీ అధికారులు(వీరిలో ఢిల్లీ నుంచి …
Read More »కమ్మ ఓట్లు గుండుగుత్తగా కాంగ్రెస్‌కే.. ఇదీ ఎఫెక్ట్!
పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లను గుండుగుత్తగా తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో బలమైన అడుగు వేసింది. వాస్తవానికి ఇప్పటి వరకు కమ్మ ఓటు బ్యాంకు తటస్థంగా ఉంది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ కు అనుకూలంగా కమ్మ ఓటు బ్యాంకు పనిచేస్తోంది. అందుకే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో కమ్మ ఓట్టు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates