Political News

తమిళిసైని ఏమీ అనలేదట…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. కోర్టు జోక్యంతో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. సినిమాటిక్ గా గవర్నర్ రావడం, కేసీఆర్ నమస్కారం చేయడం, తనకు ఇచ్చిన స్క్రిప్టును ఆమె చదివి వెళ్లిపోవడం జరిగిపోయాయి. గవర్నర్ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా తాము ఇచ్చిన ప్రసంగాన్ని పూర్తి స్థాయిలో చదవడంతో బీఆర్ఎస్ నేతలు ఖుషీ అవుతున్నారు.ఈ క్రమంలో అసెంబ్లీ మొదటి రోజున మసాలా వార్తలు లేక మీడియా …

Read More »

పెద్దారెడ్ల రూట్లో పేట ఎంపీ ?

నెల్లూరు పెద్ద రెడ్ల అలక అధికార వైసీపీకి అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మరికొందరు నడుస్తున్న మాట కూడా నిజం. ఆ జాబితాలో పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు లావు శ్రీకృష్ణదేవరాయులు, విజ్ణాన్ విద్యా సంస్థల ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. గత …

Read More »

బీఆర్ఎస్ వైపు కోటం రెడ్డి చూపు

కేసీఆర్ ప్రారంభించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ విస్తరణ పనులు వేగం పుంజుకున్నాయ్. తన ప్రతినిధులను వేర్వేరు ప్రాంతాలకు పంపుతూ అక్కడి నాయకులను చేర్చుుకునేందుకు రాయబారాలు చేస్తున్నారు. మహారాష్ట్రలో పార్టీ టేకాఫ్ దిశగా నాందేడ్ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడం కోసం ఎంతమంది వచ్చినా చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వైజాగ్ వెళ్లి గంటా శ్రీనివాసరావు, జేడీ లక్ష్మీ నారాయణను కలిశారు. …

Read More »

చ‌చ్చే వ‌ర‌కు జ‌గ‌న్‌తోనే-పోసాని

పోసాని గ‌తంలో జ‌న‌సేన‌, తెలుగుదేశం పార్టీల కోసం ప‌ని చేసి 2019 ఎన్నిక‌ల‌కు కొన్నేళ్ల‌ ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జ‌గ‌న్‌కు గ‌ట్టి మ‌ద్ద‌తుదారుగా మారారు. వైకాపా కోసం ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా చేసిన పోసాని.. ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక మూడేళ్ల‌కు పైగా ప‌ద‌వేమీ రాక‌పోయినా మౌనంగానే ఉన్నారు. ఐతే ఆలీకి ఓ ప‌ద‌వి ఇచ్చిన‌ట్లే ఇప్పుడు పోసానికి కూడా ఓ ప‌ద‌వి కేటాయించేశారు జ‌గ‌న్. ఏపీ …

Read More »

నంద్యాల సెంటర్లో ఫిబ్రవరి 4 డెడ్ లైన్

భూమా, శిల్పా కుటంబాల మధ్య మళ్లీ పొలిటికల్ వార్ మొదలైంది. నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం అన్నట్లుగా మాటల యుద్ధం ఊపందుకుంది. నువ్వెంత ఎంత నువ్వెంత అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే శిల్పా రవి కిషోర్ రెడ్డి మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. నంద్యాల యువ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్, త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే తమ ఆధిపత్యం తగ్గిపోతుందని …

Read More »

చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఫోన్‌ల‌ను కూడా ట్యాప్ చేస్తున్నారా?

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై వైసీపీ రెబ‌ల్ ఎంపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తున్నారా? అనే సందేహం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తున్నారా? అని ప్ర‌శ్నించారు. వ‌చ్చేది ఎన్నిక‌ల సీజ‌న్‌ కాబ‌ట్టి.. జ‌గ‌న్ ఈ త‌ర‌హా ప‌నులు చేయొచ్చ‌ని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే సొంత పార్టీ ఎమ్మెల్యేలు రోడ్డున ప‌డ్డార‌ని.. ర‌ఘురామ చెప్పారు. ఇక‌, …

Read More »

అబ్బే పెళ్లిలో కలిశామంతే…

ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తోట చంద్రశేఖర్ నాయకత్వంలో పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న కొందరు మాజీ అధికారులు వచ్చి కేసీఆర్ ను కలిసి వెళ్లారు. అందులో తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ రావు కుడా ఉన్నారు. త్వరలో విశాఖలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ …

Read More »

కొత్త సెక్రటేరియట్ లో ఫైర్ యాక్సిడెంట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల సౌథంగా అభివర్ణించే కొత్త సచివాలయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారీ ఎత్తున నిర్మించిన ఈ భవనం.. ఈ నెల 17న ఘనంగా ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇలాంటి వేళ.. అనూహ్యంగా ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. కొత్త సచివాలయంమొదటి అంతస్తులో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంతో.. భారీ ఎత్తున …

Read More »

‘నెల్లూరు చల్లార లేదు.. గన్నవరం గరంగరం’

వైసీపీలో నేతల మధ్య కొట్లాటలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు అల్లకల్లోలంగా ఉండగా ఇప్పుడు గన్నవరం గరంగరంగా మారింది. గతంలోనూ గన్నవరం పంచాయతీ జగన్ వద్దకు చేరిన తరువాత నివురుగప్పినట్లుగా ఉన్నప్పటికీ తాజాగా మరోసారి గన్నవరం వైసీపీలో గ్రూపుల గొడవ రచ్చకెక్కింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేక గ్రూపుగా ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగట్ట వెంకటరావులు ఇద్దరూ కొడాలి నాని, వల్లభనేని వంశీ గురించి మాట్లాడిన మాటలు బయటకు …

Read More »

ఈ టెన్నిస్ ప్లేయర్ కు పొలిటికల్ కోర్టు దొరకట్లే…

ఆయన చిన్నప్పుడు నేషనల్ ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్. జాతీయ స్థాయిలో అనేక టోర్నమెంట్లు ఆడారు. 1986 జాతీయ క్రీడల్లో కాంస్య పతకం దక్కించుకున్నారు. దేశంలోని అన్ని ప్రధాన టెన్నిస్ కోర్టులను దున్నేశారు. ఈ సారి మాత్రం పొలిటికల్ కోర్టు కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ నలుదిక్కులా చూస్తున్నారు.. నాదేండ్ల మనోహర్ ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు. విభజనతో తర్వాత ఏపీలో కాంగ్రెస్ దెబ్బతినడంతో …

Read More »

బాలినేనికి ఈ సారి క‌ష్ట‌లేనా…!

Balineni

వైసీపీలో కీల‌క నాయ‌కుడిగా.. ముఖ్యంగా షార్ప్ షూట‌ర్‌గా ఇటీవ‌ల కాలంలో గుర్తింపు పొందిన నాయ‌కుడు బాలినేని శ్రీనివా స‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల‌లో ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసిన ఆయ‌న విజ‌యంద‌క్కించుకున్నారు. సీఎం జ‌గ‌న్‌కు కూడా ద‌గ్గ‌ర బంధువుగా పేర్కొంటారు. దీంతో తొలి కేబినెట్‌లోనే బాలినేని మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. ఇక‌, రెండోసారి ఛాన్స్ ద‌క్క‌క పోయే స‌రికి.. తీవ్ర ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఆయ‌న …

Read More »

ఢిల్లీలో రివ‌ర్స్ గేర్‌.. ఒక్క‌రోజులోనే జ‌గ‌న్‌ రిట‌ర్న్‌..!

ఏపీపై కేంద్రం వైఖ‌రి మారుతోంది. రాజ‌కీయంగా ఏదో తేడా వ‌స్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ స‌ర్కారు కు అండ‌గా ఉన్న కేంద్రం అనూహ్యంగా రూటు మార్చిన‌ట్టు క‌నిపిస్తోందని అంటున్నారు పరిశీల‌కులు. మ‌రి ఈ మార్పున‌కు రీజనేంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. 2019లో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం అండ‌గానే ఉంది. అదేవిధంగా జ‌గ‌న్ కూడా కేంద్రానికి ద‌న్నుగా ఉన్నారు. ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం క‌లిసి వ‌చ్చింది. …

Read More »