నిన్నటి ‘జెండా’ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. అనేక మంచి విషయాలు చెప్పాడు. జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. వాటన్నింటినీ దాటి సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్న కామెంట్.. జగన్‌ను తన నాలుగో పెళ్లాం అనడం. జనసేనాని మీద విమర్శలు గుప్పించడానికి జగన్ సహ వైసీపీ వాళ్లందరూ ఎప్పుడూ వాడే అస్త్రం.. ఆయన పెళ్లిళ్ల వ్యవహారమే. అంటే ప్యాకేజ్ స్టార్ అంటారు. …
Read More »పవన్ కంఠ శోష.. అర్ధం కావడం లేదా?
కాపులు ఐక్యంగా ఉండాలి.. కాపు నేతలు కలిసి రావాలి.. అప్పుడే వైసీపీని గద్దెదించగలం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. పిల్ల పుట్టగానే పరుగులు పెట్టదన్నట్టుగా.. జనసేన కూడా.. పరుగులు పెట్టేందుకు సమయం పడుతుందని.. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను పరిశీలనలోకి తీసుకుంటే ఈ విషయం అవగతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. “బలం ఉందో లేదో చూసుకోకుండా.. ఎగిరితే మనమే నష్టపోతాం” అని చెప్పుకొచ్చారు. …
Read More »సెంటిమెంటునే ఫాలో అవుతున్నారా ?
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ సెంటిమెంటునే ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారట. ఎలాగంటే మార్చి 10వ తేదీన కరీంనగర్లో పార్లమెంటు ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనటం ద్వారా. కేసీయార్ కు సెంటిమెంట్లు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. పూజలు, యాగాలు, హోమాలు చేయిస్తునే ఉంటారు. ఇపుడు విషయం ఏమిటంటే ఎన్నికలు ఏవైనా సరే కరీంనగర్ జిల్లా నుండే బహిరంగ సభలు నిర్వహించడం సెంటిమెంటు. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ బహిరంగసభతోనే …
Read More »బీకాంలో ఫిజిక్స్‌కు కెమిస్ట్రీ కుదిరింది.. ఎమ్మెల్సీ + పదవి!
టీడీపీ నేత, మైనారిటీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మెత్తబడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఆయనకు మిత్రపక్షం కారణంగా ఈ దఫా టికెట్ దక్కలేదు. అయితే.. ఇలా టికెట్ దక్కనివారిని వైసీపీ గాలికి వదిలేసినట్టుగా టీడీపీ వదిలేయలేదు. వారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరీ బుజ్జగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నారా లోకేష్ .. జలీల్ ఖాన్‌ను బుజ్జగించారు. ఆయన …
Read More »పేర్నివారి పురాణాలు.. పవన్ గురించి ఏమన్నారంటే..
వైసీపీ కీలక నేత, కాపు నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. తాజాగా పవన్‌పై విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత బుధవారం నిర్వహించిన జెండా సభలో చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చిన.. నాని.. పురాణాలతో పవన్‌పై విరుచుకుపడ్డారు. పవన్ శల్యుడు, శిఖండి అని వ్యాఖ్యానించారు. “చంద్రబాబుకు సరైన జోడీ దొరికింది. శల్య సారథ్యంలో ఆయన ముందుకు సాగుతున్నాడు. తమ్ముళ్లే ఇక, తేల్చుకోవాలి” అని నాని అన్నారు. …
Read More »నాగబాబు.. ఒక పంచ్.. ఒక క్లారిటీ
పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాగబాబు సోషల్ మీడియాలో వేసే పంచ్‌ల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన వ్యంగ్యంగా స్పందించే తీరు, వేసే పంచ్‌లు జనసైనికులకు బాగా నచ్చుతుంటాయి. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం ఎమ్మెల్యే అయిన నటుడు నందమూరి బాలకృష్ణను ఆయన టార్గెట్ చేసుకున్న తీరు చర్చనీయాంశం అయింది. ఐతే ఇప్పుడు జనసేన.. తెలుగుదేశంతో పొత్తుతో సాగుతోంది. …
Read More »ఇంతియాజ్ ఎంట్రీ.. కర్నూలు అసెంబ్లీ నుంచే పోటీ!
రాజకీయాల్లో నాయకులు అనుకుంటే కానిదేముంది? ముఖ్యంగా అధినేతలు తలుచుకుంటే జరగనిది ఏముంటుంది. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి పరిణామమే జరిగింది. బుధవారం ఉదయం తన పదవికి రాజీనామా చేయడం.. సాయంత్రానికి గ్రీన్ సిగ్నల్ రావడం.. సీనియర్ ఐఏఎస్ ఇంతియాజ్ విషయంలో చకచకా జరిగిపోయాయి. అంతేకాదు.. ఆయన గురువారం ఉదయం సీఎం జగన్‌ను కలుసుకోవడం.. ఆయన ఆశీర్వాదంతో వైసీపీలోకి చేరిపోవడం కూడా అయిపోయాయి. తాజాగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తాజా మాజీ …
Read More »కాంగ్రెస్‌లో ఇంటర్వ్యూలు.. షర్మిల ఫార్ములా!
ఏపీలో ఎన్నికల సందడి పెరిగింది. దీంతో టికెట్ల కేటాయింపు కూడా దాదాపు కొలిక్కి వస్తోంది. ఈ క్రమంలో అటు వైసీపీ, ఇటు టీడీపీలు.. సర్వేలు, అభ్యర్థుల గుణ గణాలు, ఆర్థిక పరిస్థితి వంటివాటిని బేరీజు వేసుకుని టికెట్లు కేటాయిస్తున్నాయి. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. ఈ పార్టీ కూడా.. అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించింది. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ ఇంటర్వూ చేసేందుకు రెడీ అయింది. …
Read More »కేసుల్లో పూర్తిగా ఇరుక్కున్నట్లేనా ?
తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ కేసుల్లో పూర్తిగా ఇరుక్కున్నట్లే అనుమానంగా ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో రు. 55 కోట్ల దుర్వినియోగం విచారణను ఎదుర్కొంటున్నారు. దీనిపైన రెరా బాలకృష్ణ కేసులో తగులుకున్నారు. రెరా డైరెక్టర్ గా ఉన్న బాలకృష్ణపై ఒత్తిడి తెచ్చి తనకు కావాల్సిన నిర్మాణ సంస్ధల నుండి కోట్లరూపాయలు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలను అర్వింద్ ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ చేయడానికి ఏసీబీ రెడీ …
Read More »పవన్‌కు ముద్రగడ సంచలన లేఖ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన లేఖ సంధించారు. బుధవారం జరిగిన జెండా సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ లేఖ సంధించడం గమనార్హం. వాస్తవానికి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతారని అనుకున్నారు. కానీ, కారణాలు తెలియక పోయినా.. ఆయన దూరంగానే ఉన్నారు. మరోవైపు తాడేపల్లి గూడెం సభలో పవన్ మాట్లాడుతూ.. తనతో వచ్చే వాళ్లంతా పోరాడే …
Read More »100 పార్లమెంట్ స్థానాలు : ఫస్ట్ లిస్ట్ ఖాయమేనా ?
తెలంగాణా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఈరోజు మొదటి జాబితాను విడుదల చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలోని 100 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈvమధ్యనే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకనే ఈరోజు తెలంగాణా మొదటిజాబితా ప్రకటనపైన అందరిలోను ఉత్కంఠ పెరిగిపోతోంది. తెలంగాణాలోని 17 స్ధానాల్లో మొదటి జాబితాలో ఎన్నిvసీట్లలో అభ్యర్ధులను ప్రకటించబోతున్నారన్న విషయమై చర్చలు జరుగుతున్నాయి. పార్టీvవర్గాల …
Read More »నారా లోకేష్ బలహీనతలు కాదు బలం చూడు!
రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ప్రజల ఆశీస్సులు.. ఎన్నికల మూడ్ వంటివి నాయకుల గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఎవరూ ఎప్పుడూ విఫలం కావాలని కూడా ఉండదు. ఇదే ఫార్ములాను.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ యువ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫాలో అవుతున్నారు. 2019లో తొలిసారి ఆయన మంగళగిరి నుంచి పోటీ చేశారు. అప్పటి అంచనాల మేరకు.. ఆయన విజయం `పక్కా` అని టీడీపీ నాయకులు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates