భాగ్యనగరం హైదరాబాద్‌లో తీవ్ర గడబిడ చోటు చేసుకుంది. ఇక్కడి ఘోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు రాజాసింగ్‌కు బెదిరింపు ఫోన్లువచ్చాయి అవి కూడా.. లోకల్ నుంచి కాకుండా.. పాకిస్థాన్ ఫోన్ నెంబర్ల నుంచి ఆయనను లేపేస్తా మంటూ .. ఫోన్లు రావడంతో ఒక్కసారిగా ఆయన హడలి పోయారు. అయితే.. తొలుత ఈ విషయాన్ని పోలీసులు లైట్ తీసుకున్నారు. ఎందుకంటే గతంలోనూ రాజా సింగ్‌కు అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే.. అవన్నీ నకిలీ ఫోన్లు కావడంతో పోలీసులు ఇప్పుడు కూడా అలానే జరిగి ఉంటుందని అనుకున్నారు.
అయితే.. రాజా సింగ్‌కు నిజంగానే బెదిరింపు ఫోన్లు రావడం.. పోలీసులు పట్టించుకోక పోవడంతో ఆయన నేరుగా డీజీపిని కలిసి విన్నవించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని రక్షణ కల్పించాలని కోరారు. అదేసమయంలో తనకు వచ్చిన ఫోన్ కాల్స్ లిస్టును కూడా ఆయన అందించారు. ఆ తర్వాత.. నేరుగా కేంద్ర హోం శాఖకు, మంత్రి అమిత్ షాకు కూడా విడివిడిగా ఫిర్యాదు చేశారు. దీనిపై డీజీపీ స్పందించాల్సి ఉంది. ఇక, కేంద్ర హోం శాఖ కూడా.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
వ్యూహాత్మకమా? నిజమా?
అయితే.. ప్రస్తుతం తనకు వచ్చిన పాకిస్థాన్ బెదిరింపుల విషయంలో రాజాసింగ్‌ను ఎంత వరకు నమ్మొచ్చనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఆయనకు పాకిస్థాన్ నుంచి బెదిరింపులు వచ్చేంత స్థాయి లేదు. వచ్చినా.. కారణాలు కూడా కనిపించడం లేదు. దీంతో రాజా సింగ్ వ్యూహాత్మకంగా ఈ ఆరోపణలు చేస్తున్నారా? అనే చర్చ కాంగ్రెస్‌లో జరుగుతోంది. ఎందుకంటే.. తనకు ఉన్న భద్రతను మరింత పెంచాలంటూ.. ఆయన కొన్నాళ్లుగా కోరుతున్నారు. తనకు ఇచ్చిన సెక్యూరిటీని కూడా మార్చాలని చెబుతున్నారు.
కానీ, ఆ పని చేయడం లేదు.దీంతో రాజా సింగ్ ఇప్పుడు ఈ వ్యూహం పన్నారా? అనేది సందేహమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే.. నేరుగా డీజీపీ, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇది నిజమే అయి ఉంటుందని కూడా కొందరు అంటున్నారు. ఏదేమైనా.. ఇప్పుడు… రాజా సింగ్ వ్యవహారం.. భాగ్యనగరంలో హాట్ టాపిక్‌గా మారింది.