జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన వరుసగా రెండో రోజు కూడా కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో కేంద్రలోని కీలక నేతలు, కేంద్ర మంత్రులతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మురళీధరన్‌తో సమావేశమైన ఆయన.. మంగళవారం మరికొందరితో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వరుస భేటీలు రాష్ట్రంలో ఉత్కంఠను రేకెతిస్తున్నాయి. పవన్ కల్యాణ్.. రాజస్థాన్‌లోని …
Read More »ఇక్కడ ప్రత్యర్ధులు ఫైనలైపోయారా ?
చంద్రగిరిలో ప్రత్యర్ధులు ఫైనల్ అయిపోయారు. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుండి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేయడం ఖాయమైపోయింది. తనకు బదులు కొడుకు మోహిత్ రెడ్డి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి చాలాకాలంగా కోరుతున్నారు. ఇంతకాలం ఏమీ చెప్పని జగన్మోహన్ రెడ్డి మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఎంఎల్ఏనే ప్రకటించారు. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఎంఎల్ఏ …
Read More »బాపట్ల ఎమ్మెల్యేకు కష్టకాలం
కోన రఘుపతి. ఒకప్పటి కాంగ్రెస్ స్ట్రాంగ్ మేన్, మాజీ గవర్నర్ కోన ప్రభాకర్ రావు కుమారుడు. జగన్ వైసీపీని పెట్టినప్పటి నుంచి ఆయనతోనే ఉన్నారు. వరుసగా రెండో సారి బాపట్ల నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. ఇంకొకరు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుగా చెప్పుకోవాలి. ఇప్పుడు కోన రఘుపతికి కష్టకాలం వచ్చిందంటున్నారు. బాపట్ల గడ్డ, కోన రఘుపతి …
Read More »ధర్మానతో డ్యామేజీ జరుగుతోందా ?
ధర్మాన ప్రసాదరావు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని సీనియర్ రాజకీయ నేత. ఏ అంశంమీద అయినా అనర్ఘళంగా మాట్లాడగలిగిన కెపాసిటి ఉంది. మాటలు కూడా జాగ్రత్తగా బ్యాలెన్సుడుగానే ఉంటాయి. అయితే ఈ మధ్య మాట్లాడుతున్న తీరే కాస్త వివాదాస్పదంగా ఉంటోంది. తాను ఏమి మాట్లాడుతున్నారో తనకు అర్ధమవుతోందా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా వైఎస్సార్ ఆసరా పథకం లబ్దిదారులతో మాట్లాడారు. ఈ సమయంలో ధర్మాన మాట్లాడుతూ తమ ప్రభుత్వం …
Read More »జగన్ లో మార్పు… ఎమ్మెల్యేలు హ్యాపీ
గతానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. నాలుగు ఎంఎల్సీ ఎన్నికల ఓటమితో జగన్ దూకుడు తగ్గిందనే అనుకోవాలి. ఇంతకుముందు వర్క్ షాపులు ఎప్పుడు నిర్వహించినా గడపగడపకు వైసీపీ ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ రిజల్టును చదివి వినిపించేవారు. కార్యక్రమంలో పాల్గొనని మంత్రులు, ఎంఎల్ఏల పేర్లు చదవి గట్టిగా మందలించేవారు. టికెట్ల విషయంలో సీరియస్ వార్నింగులిచ్చేవారు. కానీ తాజా మీటింగులో అలాంటి వార్నింగులేవీ లేవు. బుజ్జగింపులు, కర్తవ్యబోధ, టార్గెట్ చేరుకోవటానికి అవసరమైన మార్గనిర్దేశకత్వంతోనే …
Read More »విజయవాడ కాదు వైజాగ్.. ప్లాన్ వర్కవుట్ అవుతుందా…
2022 డిసెంబరు 9న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చినప్పటి నుంచి కేసీఆర్ పొరుగు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే విషయమై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్రలో పాతుకుపోయే ప్రయత్నంలో ఉన్నారు. అక్కడ 12 జెడ్పీటీసీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పై కేసీఆర్ ఆశలు వదులుకున్నారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి. జనవరి 2న కొందరు …
Read More »ఎన్నికలొచ్చాయి.. స్వామీజీ మళ్లీ యాక్టివ్
భారత దేశంలో పౌరుల జీవితానికి మతానికి విడదీయరాని సంబంధం ఉంది. రోజూవారీ కార్యక్రమాల్లో కూడా మతాచారాలను పాటిస్తూనే ఉంటారు.మతం కోసం యుద్ధాలకు కూడా సిద్ధపడే వారున్నారు. అందుకే స్వామీజీలకు మంచి డిమాండ్ ఉంటుంది.నిజానికి జనంలో మంచిని బోధించే స్వామీజీలు చాలా మంది ఉన్నారు. కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద కూడా జనంలో సత్ ప్రవర్తన ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు కాకపోతే ఆయన తర్వాతి కాలంలోనే కొంత రాజకీయం …
Read More »ఏపీలో ముందస్తు ఫలించేనా… గతం ఏం చెబుతోంది…?
ప్రస్తుతం జరుగుతున్న చర్చ ముందస్తు ఎన్నికలు. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని.. ఈ ఏడాది అక్టోబరులో జగన్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని తెలంగాణతో సమానంగా ఎన్నికలకు వెళ్లిపోతారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అంతేకాదు.. నవంబరులో నే నోటిఫికేషన్ వస్తుందని.. డిసెంబరు నాటికి ఎన్నికలు కూడా పూర్తయి.. అదే నెలలో ప్రభుత్వం కూడా ఏర్పడుతుందని.. సోషల్ మీడియాలో డేట్ల వారీగా ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమని …
Read More »నిడదవోలు నీకా..నాకా…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయాయి. టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. వైసీపీ అరాచకాలతో జనం ఇప్పుడు ఫుల్లుగా టీడీపీ వైపే చేస్తూన్నారు. ఈ సంగతి ఆ పార్టీ నేతలకు బాగానే అర్థమైంది. దానితో వారిలో కొత్త జోష్ కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు ఖాయమని నిర్ణయానికి వచ్చిన టీడీపీ నేతలు ఇప్పుడు పార్టీ టికెట్ కోసం కర్చీఫ్ వేస్తున్నారు. అలా ప్రతీ నియోజవర్గానికి ఇద్దరు ముగ్గురు బలమైన నేతలు, …
Read More »కన్నా ఇంత యాక్టివ్ అయ్యారేందబ్బా…?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్నారు. కన్నా టీడీపీలో చేరిన తర్వాత జిల్లా రాజకీయాలే మారిపోయాయి. ఆయనకు చంద్రబాబు ఎంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు.. కన్నాను ఎక్కడ నుంచి పోటీ చేయించబోతున్నారు.. కన్నా గెలిస్తే మంత్రి పదవి ఇస్తారా.. లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కన్నా మాత్రం అవేమీ పట్టించుకోకుండా జిల్లాలో తన పూర్వ వైభవాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. …
Read More »వైరల్ పిక్: బెడ్ పై రామోజీ!
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య వైరం పతాక స్థాయికి చేరినట్లే కనిపిస్తోంది. కొంత కాలంగా ఈనాడు జగన్ అండ్ కోను తీవ్ర స్థాయిలోనే టార్గెట్ చేస్తుండగా.. అట్నుంచి కూడా స్పందన అదే స్థాయిలో కనిపిస్తోంది. రామోజీని ఇరుకున పెట్టడానికి అప్పట్లో వైఎస్, ఇప్పుడు జగన్‌కు ఉన్న ఆయుధం మార్గదర్శి చిట్‌ఫండ్ కేసు ఒక్కటే అన్న సంగతి తెలిసిందే. మార్గదర్శిలో …
Read More »బీజేపీ చేతిలో ‘కాంగ్రెస్ ఫైల్స్’
ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ రెండు ప్రధాన కూటములు ఎన్డీయే-యూపీఏ మధ్య యుద్ధ వాతావరణం పెరిగిపోతోంది. నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, ప్రతిపక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. వీళ్ళని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా అంతే ధీటుగా అస్త్రాలను సిద్దం చేసుకున్నది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో ఆదివారం ఒక వీడియోను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ ఫైల్స్ అంటే ఏమిటంటే యూపీఏ పదేళ్ళ పాలనలో జరిగిన అవినీతిని ఒక్కోదాన్ని …
Read More »