అధికారం చేతిలో ఉంది కాదా అని వైసీపీ నేతలు అక్రమాలు, అన్యాయాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. భూ కబ్జాలు మొదలు అక్రమ మైనింగ్ వరకు…వైసీపీ నేతల అక్రమాలకు అడ్డుకట్ట లేదని ఆరోపణలు వచ్చాయి.
ఆఖరికి ఇంట్లో పనిచేసే వారిపై లైంగిక వేధింపులకు కూడా వైసీపీ నేతలు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్.తన ఇంట్లో పనిచేసే బాలికపై కొద్ది రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడిన వైనం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన సుధాకర్ పై గతంలో కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఇవాళ కర్నూలులోని ఆయన నివాసంలో పోలీసులు సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సుధాకర్‌ను వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు రావడం, అందుకు సంబంధించిన ఓ వీడియో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తెలిసిందే. ఈ క్రమంలోనే సుధాకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి తాజాగా అరెస్ట్ చేశారు.
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి గెలిచిన సుధాకర్ కు 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. సుధాకర్ కు బదులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్‌కు టికెట్ దక్కింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates