Political News

బండి సంజ‌య్‌కు ఊర‌ట‌.. బెయిల్ మంజూరు!

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్‌కు భారీ ఊర‌ట ల‌భించింది. 10వ తరగతి హిందీ పేపర్ లీక్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బండి సంజయ్‌కు హ‌నుమ‌కొండ కోర్టు బుధ‌వారం 14 రోజుల రిమాండ్ విధించిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా గురువారం అదే కోర్టులో బండి సంజ‌య్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు.. బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిని విచారించిన కోర్టు.. బెయిల్ మంజూరు చేసింది. అయితే.. దీనికి …

Read More »

41 సీట్లలో జనసేన అభ్యర్థుల లిస్ట్?

జనసేన 41 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్ సభ సీట్లలో గెలిచే చాన్స్ ఉందని సీఎం జగన్ చేయించిన సర్వేలోనే తేలిందని జనసేన నేతలు చెప్తున్నారు. అయితే… జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆ మాట చెప్పగానే వైసీపీ నుంచి భయంకరమైన అటాక్ మొదలవుతోంది. ‘పట్టుమని 10 మంది అభ్యర్థుల పేర్లు చెప్పండి చూద్దాం.. అప్పుడు మీకు 41 సీట్లు వస్తాయని నమ్ముతాం’ అంటూ ఎగతాళి చేస్తున్నారు వైసీపీ …

Read More »

వైసీపీకి కౌంట‌ర్‌.. ‘జగనే మన దరిద్రం’ : చంద్ర‌బాబు దిశానిర్దేశం

త్వ‌ర‌లోనే తాను ఉత్త‌రాంధ్ర‌లో 25 రోజుల పాటు ప‌ర్య‌టిస్తాన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెప్పారు. అదేస‌మ‌యంలో పార్టీ ఉత్త‌రాంధ్ర నాయ‌కుల‌కు.. కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు. ప్ర‌భుత్వంపై పోరాడేందుకు టైం లేదంటే.. కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు. తాను చెబుతున్న విష‌యాల‌ను నోట్ చేసుకుని వాటిపై యుద్ధం చేయాల‌ని.. ప్ర‌జ‌లు ఎందుకు చేరువ కారో.. నాయ‌కులు ఎందుకు ఎలివేట్ కారో నేను చూస్తాన‌ని చంద్ర‌బాబు ధీమా వ్య‌క్తం చేశారు. విశాఖ‌లో నిర్వ‌హించిన …

Read More »

వైసీపీ స‌ర్కారుకు కాక‌.. ఉద్య‌మానికి ఉద్యోగులు సిద్ధం!

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంపై ఉద్యోగులు.. మ‌రోసారి క‌న్నెర్ర చేశారు. త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం.. గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా ప్ర‌భుత్వంతో చ‌ర్చిస్తున్న ఉద్యోగులు.. ఇప్పుడు.. తీవ్ర‌స్థాయిలో ఉద్య‌మానికి రెడీ అయ్యారు. ఇప్ప‌టికే అనేక సార్లు ఉద్య‌మించి.. ప్ర‌భుత్వానికి అల్టిమేటం ఇచ్చినా.. స‌ర్కారు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌లేద‌ని.. ఉద్యోగులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఉద్యోగ సంఘాల నాయ‌కులు ఏక‌తాటిపైకి వ‌చ్చి.. జేఏసీగా ఏర్ప‌డ్డారు. ఈ నెల 8వ తేదీ నుంచి 29 …

Read More »

ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టు భారీ షాక్ ?

కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలోని 14 ప్రతిపక్షాలు ఉమ్మడిగా వేసిన ఒక పిటీషన్ను సుప్రింకోర్టు ఒకే దెబ్బతో కొట్టి అవతల పడేసింది. అసలు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న సమస్య ఏమిటి ? ప్రతిపక్షాలన్నీ ఎందుకు ఏకమయ్యాయి ? వాటి బాధేమిటి ? అని తెలుసుకోవాలని కూడా సుప్రింకోర్టు అనుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్ధలతో ప్రతిపక్ష నేతలను కేంద్రప్రభుత్వం వేధిస్తోందని, తప్పుడు కేసులు పెడుతోందని ప్రతిపక్షాలు చాలాకాలంగా గోలచేస్తున్నాయి. …

Read More »

మ‌న‌ది వైసీపీ కాదు.. టీడీపీ: చంద్ర‌బాబు వార్నింగ్

టీడీపీ అధినేత చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌పై క‌న్నెర్ర చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ విధానాల‌ను మాత్ర‌మే విమ‌ర్శిస్తూ..వ‌చ్చిన చంద్ర‌బాబు ఇప్పుడు పార్టీపైనా దృష్టి పెట్టారు. ప్ర‌స్తుతం ఆయ‌న మూడు జిల్లాల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఏపీలోనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఒక‌వైపు ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూనే.. మ‌రోవైపు పార్టీలోక‌ట్టుత‌ప్పుతున్న నేత‌ల‌కు గ‌ట్టివార్నింగే ఇచ్చారు. ఎవరైనా తిరుగుబాటు చేస్తే కాళ్లబేరానికి వ‌స్తామ‌ని అనుకుంటున్నారేమో.. మ‌న‌ది వైసీపీ కాదు.. అని హెచ్చ‌రించారు. వచ్చే ఏడాది జరిగే …

Read More »

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్‌.. ఏం జ‌రిగింది?

నెల్లూరు జిల్లా రూర‌ల్ ఎమ్మెల్యే.. వైసీపీ రెబ‌ల్ నాయ‌కుడు.. కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డిని గురువారం తెల్ల‌వారు జామునే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెల్ల‌వారు జామున 4 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న ఇంటికి చేరుకున్న సుమారు 50 మంది పోలీసులు.. ఆయ‌న‌కు నోటీసులు ఇచ్చారు. ఇంటి నుంచి బ‌య‌ట‌కు రారాద‌ని అందులో పేర్కొన్నారు. అయితే.. ఈ విష‌యం ఉద‌యం 6 గంట‌ల‌కు కానీ,… బ‌య‌ట‌కు రాలేదు. దీంతో విష‌యం తెలిసిన వెంట‌నే …

Read More »

వై నాట్ పులివెందుల : చంద్ర‌బాబు

ఏపీ అధికార పార్టీ వైసీపీపైనా.. ఆ పార్టీ అధినేత, సీఎం జ‌గ‌న్‌పైనా చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా.. వైసీపీ 175 స్థానాల్లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోతుంద‌ని తేల్చి చెప్పారు. పులివెందుల‌లోనూ జ‌గ‌న్‌ను ఓడిస్తామ‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఆగ్ర‌హావేశాల‌తోఉన్నార‌ని.. ఎన్నిక‌ల కోసం ఎదురు చూస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. “ఇప్పుడు వ‌చ్చినా.. ఎప్పుడు వ‌చ్చినా.. ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ర‌ణ మృదంగ‌మే.” అని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. మూడు జిల్లాల ప‌ర్య‌ట‌నను …

Read More »

డీజీపీపై నోరు చేసుకున్న ర‌ఘునంద‌న్‌!

తెలంగాణ బీజేపీ నాయ‌కులు వ్య‌క్తిగ‌త వివాదాల్లో ఇరుక్కుపోతున్నారు. ఇప్ప‌టికే బండి సంజ‌య్ ప‌దో త‌ర‌గ‌తి పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారంలో అరెస్ట‌య్యారు. ఇక, ఇప్పుడు మ‌రో కీల‌క నాయ‌కుడు, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే.. సుప్రీంకోర్టు లాయ‌ర్ కూడా అయిన‌.. ర‌ఘునంద‌న్‌రావు.. మ‌రో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా.. తెలంగాణ డీజీపీ అంజ‌నీకుమార్ యాద‌వ్‌పై ఆయ‌న ప‌రుష వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ డీజీపి అంజనీకుమార్ యాదవ్ ను ‘బీహార్ గూండా’ అని ఎమ్మెల్యే …

Read More »

పిలుస్తున్న జగనన్న పలక్కున్న ధర్మాన

సీఎం జగన్‌తో సమావేశమంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా తప్పకుండా హాజరవుతారు. అధినేత ఏం చెప్తారో వినాలని కొందరు.. అధినేత దృష్టిలో పడాలని ఇంకొందరు.. అధినేతను కలిసే అవకాశం దొరికిందని మరికొందరు.. ఇలా జగన్‌తో సమావేశం అంటే తప్పనిసరి పరిస్థితులుంటే తప్ప డుమ్మా కొట్టరు. కానీ, జగన్ కేబినెట్లోని సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాత్రం వరుసగా మూడు పర్యాయాలుగా జగన్ నిర్వహిస్తున్న కీలక సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. ఏదో …

Read More »

కవిత, సంజయ్ ఇద్దరికీ ఫోనే కీలకం

లిక్కర్ స్కాంలో విచారణను ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవిత నాలుగు సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ముందు లేదు.. లేదంటూనే ఆమె తన పది సెల్ ఫోన్స్ తీసుకెళ్లి ఈడీ కార్యాలయంలో అప్పగించారు. కట్ చేసి చూస్తే.. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయన విషయంలోనూ ఫోనే కీలకమని చెబుతున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో …

Read More »

వసంత మళ్లీ ఏసేశాడు..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే, మంత్రి మధ్య అవినీతి పోరు తారా స్థాయికి చేరింది. తన మైలవరం నియోజకవర్గంలో గ్రావెల్, వీటీపీఎస్ బూడిద అక్రమ మైనింగ్ జరుగుతోందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి ఆరోపించారు. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఆ పని చేసే వారిలో తమ పార్టీ వారు కూడా ఉన్నారని వసంత ప్రకటించారు. డబ్బు దగ్గర అందరూ ఒకటయ్యారని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ కు స్వయంగా …

Read More »