తెలంగాణలో టెన్త్ క్లాస్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో అరెస్ట్ అయిన ప్రశాంత్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు బాగా కావాల్సిన మనిషి అంటూ బీఆర్ఎస్ నాయకులు ఫొటోలతో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నారు. దీంతో బీజేపీ నేతలు తొలుత డిఫెన్సులో పడిన ఆ తరువాత బీఆర్ఎస్ నేతలతో సంజయ్ ఉన్న ఫోటోలను పెద్ద ఎత్తున షేర్ చేయడం ప్రారంభించారు. దీంతో ప్రశాంత్ అసలు ఎవరి మనిషి? అనేది సోసల్ …
Read More »సంజయ్ అరెస్ట్.. మోదీ వరకు వెళ్లిన వ్యవహారం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో అర్ధరాత్రి అరెస్ట్ చేసిన విషయంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలకు చేరింది. జేపీ నడ్డా, అమిత్ షాలను దాటి ప్రధాని మోదీకి విషయం తెలిసింది. సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ హైకమాండ్ తీవ్రంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ ప్రధాని మోదీని …
Read More »పొత్తులపై బీజేపీ తేల్చకపోవడానికి రీజనేంటి?
వచ్చే ఎన్నికల్లో పొలిటికల్ పొత్తులు తేల్చాలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశం. ఎన్నికలకు ఏడాది సమయం ఉంది కాబట్టి. ఈ ఏడాదిలో పొత్తులు తేలిపోతే… ఇక, ప్రచారం చేసుకోవచ్చనేది ఆయన భావన అయి ఉంటుంది. అయితే.. ఈ విషయంలో బీజేపీ పెద్దలు మాత్రం ఉద్దేశ పూర్వంగా వెనుకంజ వేస్తున్నారనేది ఢిల్లీ వర్గాల మాట. అందుకే.. పవన్ రెండు రోజుల పాటు. ఢిల్లీలో ఉన్నప్పటికీ అటు ప్రధాని కానీ, ఇటు …
Read More »షర్మిలకు ఇచ్చి పడేసిన కామ్రేడ్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు ఏమైంది? తానేం చేసినా ఎదురు దెబ్బలే తప్పించి.. సానుకూల ఫలితాలు రావటం లేదన్న ఫస్ట్రేషన్ లో ఉన్నారా? రాజకీయాల్లో కనీసం పాటించాల్సిన గౌరవ మర్యాదల్ని ఆమె పాటించని వైనం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది. బీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు.. వారి తప్పులపై కలిసి పోరాడదామంటూ తెలంగాణ బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు పిలుపునివ్వటం.. వారు కుదరదని చెప్పటం …
Read More »సమస్యగా మారిన పేపర్ల లీకేజి
మూలిగే నక్క పై తాటిపండు పడటం అనే సామెత తెలంగాణా ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ బోర్డు నిర్వహించిన పరీక్షల పేపర్ల లీకేజీ వ్యవహారం గట్టిగా కేసీయార్ మెడకు చుట్టుకునేసింది. ఇందులో నుండి ఎలా బయటపడాలో అర్ధంకాక కేసీయార్ నానా అవస్తలు పడుతున్నారు. ఇటువంటి సమయంలోనే పదవ తరగతి పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా లీకవుతుండటంతో ఏమిచేయాలో దిక్కుతోస్తున్నట్లు లేదు. ఇప్పటికి రెండు పరీక్షలు జరిగితే రెండు ప్రశ్నపేపర్లూ …
Read More »చంద్రబాబు జోరు పెంచుతున్నారా ?
ఒకవైపు ఎన్నికల వేడి పోరిగిపోతున్న నేపధ్యంలోనే చంద్రబాబు నాయుడు మరింత జోరు పెంచుతున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోను వరుస పర్యటనలతో తమ్ముళ్ళల్లో మంచి ఉత్సాహం తీసుకురావటానికి చంద్రబాబు మూడు సమావేశాలను నిర్వహించబోతున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో విశాఖపట్నం, కడప, నెల్లూరులో చంద్రబాబు జోనల్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. పై మూడు ప్రాంతాలు కూడా మొన్నటి మూడు పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన నియోజకవర్గాలు కావటమే గమనార్హం. మొన్నటి మూడు ఎంఎల్సీ …
Read More »లోకయ్యా.. నీకు స్క్రిప్టు రాసే వాళ్లకో నమస్కారం.. !?
నారా లోకేష్ యువగళం పాదయాత్ర 61వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా దాటి ఇప్పుడు అనంతపురం జిల్లాలో ప్రభంజనంలా సాగుతోంది. ఉదయం సెల్ఫీ విత్ లోకేష్ నుంచి సాయంత్రం బహిరంగ సభ వరకు ఇసుకేస్తే రాలనంత జనం వస్తున్నారు. మార్పు కోరుకుంటున్న అశేష్ ఆంధ్ర జనావళి తమ యువ నాయకుడిని చూసేందుకు తరలి వస్తోందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. అందులో తప్పేమీ లేదు. పార్టీ నిర్వహణ ఆశావహ దృక్పథంతో …
Read More »వైసీపీ ఎమ్మెల్సీ.. రికార్డింగ్ డ్యాన్స్ చిందులు!
ఏపీ అధికార పార్టీ వైసీపీ తరఫున ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బొమ్మి ఇజ్రాయెల్ చిందేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన తొలిసారి సొంత జిల్లా అమలాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక వైసీపీ కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున సన్మానం చేశారు. అయితే.. ఈ సభలో రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఇక, ఈ డ్యాన్స్‌లోపాల్గొన్న యువతులతో ఎమ్మెల్సీ.. ఇజ్రాయెల్ చిందులేశారు. యువతుల చేతులు …
Read More »సహనం కోల్పోతున్న ధర్మాన.. మహిళలపై విసుర్లు
ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఇటీవల కాలంలో వరుసగా.. తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆసరా నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొన్ని రోజులుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయనే వాదన వినిపిస్తోంది. తాజాగా శ్రీకాకుళంలోని రాగోలులో ‘జగనన్న ఆసరా’ పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలపై విరుచుకుపడ్డారు. …
Read More »ఢిల్లీ ఎందుకు వచ్చాడో చప్పేసిన పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వరసుగా ఆయన బీజేపీ పెద్దలను అక్కడ కలుస్తున్నా రు. రెండో రోజు మంగళవారం స్వయంగా మీడియాతో మాట్లాడిన పవన్.. ఢిల్లీకి ఎందుకు వచ్చిందీ వివరించారు. ఏపీలో వైసీపీ పాలనకు విముక్తి కలిగించడమే అజెండాగా తాను డిల్లీలో పర్యటిస్తున్నట్టు చెప్పారు. వైసీపీ పాలనలో ఏపీ భ్రష్టు పట్టిపోయింద న్నారు. ఏపీలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని దుయ్యబట్టారు. రాజధాని లేదు. …
Read More »Hyderabad అభివృద్ధి పై రీల్ కాన్టెస్ట్.. ప్రైజ్ మనీ లక్ష!
అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాజధాని Hyderabad పై 60 సెకన్ల నిడివితో రీల్ తీస్తే.. చాలు.. రూ.లక్ష గెలుచుకునే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ అభివృద్ధిపై తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ‘హ్యాపెనింగ్ హైదరాబాద్ రీల్స్ కాంటెస్ట్’ నిర్వహిస్తోంది. ప్రైజ్ మనీ కింద విజేతకు రూ.50,000, ఫస్ట్ రన్నరప్ రూ.25,000, సెకండ్ రన్నరప్ రూ.10,000, ముగ్గురికి కన్సొలేషన్ ప్రైజ్ రూ.5వేలు చొప్పున.. మొత్తంగా రూ.లక్ష ఇవ్వనున్నట్టు తెలంగాణ …
Read More »కేసీఆర్ ఫ్యామిలీ మొత్తాన్ని బండకు బాదేసినట్లుగా బండి మాటలు
నోటి మాటకు ఎంత దురుసు ఉంటే.. అంత త్వరగా రాజకీయాల్లో పాపులర్ కావొచ్చు. ఎదుటోడు ఎంతటి తోపు అయితే మాత్రం.. లెక్క చేయకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడినంతనే.. అతడి మాటల్లోని మాటల కంటే కూడా సదరు నేత తెగింపునకు ముచ్చటపడే రోజులు వచ్చేశాయి. అదే ధోరణి.. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేసింది. తాను టార్గెట్ చేసినోళ్లు ఎంతటోళ్లైనా ఏ మాత్రం కనికరం లేకుండా …
Read More »