మంత్రి సోదరి అయ్యుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి ఒక ఉద్యోగిని రంగం సిద్ధం చేసుకోవటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. విషయం ఏమిటంటే వేముల రాధికారెడ్డి ప్రభుత్వ ఉద్యోగి. వరంగల్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా సాధనలో ఉద్యోగ సంఘాల ఆందోళనల్లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణా రాగానే ఆమె కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని అనుకున్నా ఎందుకనో అలా జరగలేదు. అయితే …
Read More »బీజేపీతో పొత్తుపై చర్చిస్తా: పవన్
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో 9 నెలలు మాత్రమే గడువుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టాయి. అయితే, వైసీపీ మినహా టిడిపి, బిజెపి, జనసేనలు పొత్తులపై మల్లగుల్లాలు పడుతున్నాయి. టిడిపి, బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కొద్ది రోజుల క్రితం బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ ఈక్వేషన్ నుండి టిడిపిని వేరు చేశాయి. దీంతో, జనసేన-టీడీపీ లేదా …
Read More »దివికేగిన రాజకీయ దిగ్గజం.. ఊమెన్ చాందీ కన్నుమూత..!
కేరళ పూర్వ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కన్నుమూశారు. 79 ఏళ్ళ ఊమెన్ చాందీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతంలో ఉదర, గొంతు సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నా రు. కాగా.. కేరళలోని కొట్టాయం జిల్లాలో ఉన్న …
Read More »వైసీపీ మైనస్‌లు.. టీడీపీకి ప్లస్‌లు అవ్వట్లేదే…!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో మైనస్‌లు కోకొల్లలు. దాదాపు 40 నియోజకవర్గాల్లో నాయకులు కీచులాడుకుం టున్నారు. కొన్నిచోట్ల అయితే.. పొలిటికల్ కబడ్డీ స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాల్లోని విశాఖ, కృష్ణా, కడప, నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు వంటి ప్రాంతాల్లో మంత్రులకు, నాయకులకు పడడం లేదు. ఎమ్మె ల్యేలకు ఎమ్మెల్యేలకు పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక, తమ నియోజకవర్గాలతో సంబంధం లేకపోయినా.. ఆధిపత్య ధోరణి కనిపిస్తున్న జిల్లాలు ఉన్నాయి. …
Read More »పరుచూరులో పాగా వేయలేం.. తేల్చేసిన నేతలు
టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలపై కన్నేసిన వైసీపీ.. ఆయా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని తమ జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే కుప్పం, టెక్కలి, హిందూపురం, పాలకొల్లు, కొండపి వంటి బలమైన టీడీపీ వర్గం ఉన్న నియోజకవర్గాలపైనా వైసీపీ వ్యూహా త్మకంగా పావులు కదుపుతోంది. ఇక,ఇవన్నీ.. కూడా టీడీపీ ఫైర్‌బ్రాండ్స్ చేతిలో ఉన్న నియోజకవర్గాలే కావడం గమనార్హం. ఈ జాబితాలో ఉన్న మరో నియోజకవర్గం పరుచూరు. …
Read More »పవన్ నాలుక 1000 సార్లు కోస్తా: సుధాకర్ బాబు
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ పై వైసీపీ నేత, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ నాలుకను 1000 సార్లు …
Read More »ఆ.. ఎనిమిది వేల కోట్లు ఏమైనట్టు..? రేవంత్ పవర్ లెక్కలు!!
తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్కు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు మధ్య పవర్(విద్యుత్) పాలిటిక్స్ జోరుగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పవర్ లెక్కలతో అధికార పార్టీపై విరుచు కుపడ్డారు. ఈ క్రమంలో ఆయన కొన్ని లాజిక్కులను కూడా ప్రశ్నించారు. అసలు ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెప్పిన విద్యుత్ ఎంత? గంటలు ఎన్ని? ఎంత విద్యుత్ సరఫరా చేస్తోంది? …
Read More »అసెంబ్లీలో కొత్త నియామకాలు.. దీని అర్థమేమి జగనన్నా?
ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ కొత్త నియామకాలకు తెరదీశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు.. నిబంధనల మేరకు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు కూడా ఆయన ఛాన్స్ ఇచ్చారు. అయితే.. త్వరలోనే ముగిసిపోనున్న అసెంబ్లీకి ఇప్పుడు కొత్తగా నియామకాలు చేపట్టడం ఏంటనేది ప్రశ్న. వాస్తవానికి మరో 8 మాసాల్లో ఏపీ అసెంబ్లీ గడువు తీరనుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మహా అయితే.. మరో మూడు …
Read More »కేసీఆర్ పై పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు
సాధారణంగా రాజకీయ నాయకులన్న తర్వాత హామీలివ్వడం సర్వ సాధారణం. ఎన్నికలకు ముందు..తర్వాత అని తేడా లేకుండా హామీలివ్వడం, నిధులు మంజూరు చేస్తామని వాగ్దానాలు చేయడం సహజం. అయితే, వాటిలో చాలా హామీలు బుట్టదాఖలు అయిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఆ హామీలకు, వాగ్దానాలను ప్రతిపక్ష నేతలు కూడా చూసీచూడనట్లు పోతుంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం హామీలిచ్చిన ముఖ్యమంత్రిపైన విమర్శలు గుప్పించి మమా అనిపిస్తారు. కానీ, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ …
Read More »పంచకర్ల జంపింగ్ సరే.. పవన్ అమాయకుడా?
ఊరకరారు మహానుభావులు.. అనే మాట ప్రస్తుతం ఎన్నికలకు ముందు జరుగుతున్న రాజకీయ జంపింగ్ జిలానీలకు కూడా వర్తిస్తుంది. “దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి!” అనే మాట నాయకులు తరచుగా పాటిస్తుంటారు. అందుకే.. ఎప్పుడూ కూడా ఎన్నికలకు ముందు టికెట్ల కోసం జోరుగా జంపింగులు చేస్తారు. ఎన్నికల తర్వాత.. వివిధ కేసుల నుంచి రక్షించుకునేందుకు అధికార పార్టీతో చేతులు కలుపుతారు. ఇది ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా దిగ్విజయంగా జరుగుతున్న జంప్ జిలానీల …
Read More »వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే నిర్వేదం..
పొలిటికల్ జంప్ జిలానీగా పేరు తెచ్చుకున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్ర నిరాశలో కూరుకు పోయారా? రెడ్డి సామాజిక వర్గం నాయకుల డామినేషన్‌ను ఆయన తట్టుకోలేక పోతున్నారా? ఈ పరిణామాలతో ఆయన ఏకంగా వచ్చే ఎన్నికల నుంచి పోటీకి తప్పుకోవాలని భావిస్తున్నారా? అంటే.. స్వయంగా ఆయనే ఔనని చెప్పారు. తాజాగా గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని కంభం మండలంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. …
Read More »తిరుపతి పై పవన్ దండయాత్ర: భూమన
శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయిచేసుకున్న ఘటన పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఇప్పటికే పలుమార్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పవన్ స్వయంగా తిరుపతి వచ్చారు. సీఐ అంజూ యాదవ్ పై క్రమశిక్షణ చర్యలు …
Read More »