ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ కొత్త నియామకాలకు తెరదీశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు.. నిబంధనల మేరకు ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు కూడా ఆయన ఛాన్స్ ఇచ్చారు. అయితే.. త్వరలోనే ముగిసిపోనున్న అసెంబ్లీకి ఇప్పుడు కొత్తగా నియామకాలు చేపట్టడం ఏంటనేది ప్రశ్న. వాస్తవానికి మరో 8 మాసాల్లో ఏపీ అసెంబ్లీ గడువు తీరనుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మహా అయితే.. మరో మూడు …
Read More »కేసీఆర్ పై పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు
సాధారణంగా రాజకీయ నాయకులన్న తర్వాత హామీలివ్వడం సర్వ సాధారణం. ఎన్నికలకు ముందు..తర్వాత అని తేడా లేకుండా హామీలివ్వడం, నిధులు మంజూరు చేస్తామని వాగ్దానాలు చేయడం సహజం. అయితే, వాటిలో చాలా హామీలు బుట్టదాఖలు అయిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఆ హామీలకు, వాగ్దానాలను ప్రతిపక్ష నేతలు కూడా చూసీచూడనట్లు పోతుంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం హామీలిచ్చిన ముఖ్యమంత్రిపైన విమర్శలు గుప్పించి మమా అనిపిస్తారు. కానీ, ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ …
Read More »పంచకర్ల జంపింగ్ సరే.. పవన్ అమాయకుడా?
ఊరకరారు మహానుభావులు.. అనే మాట ప్రస్తుతం ఎన్నికలకు ముందు జరుగుతున్న రాజకీయ జంపింగ్ జిలానీలకు కూడా వర్తిస్తుంది. “దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలి!” అనే మాట నాయకులు తరచుగా పాటిస్తుంటారు. అందుకే.. ఎప్పుడూ కూడా ఎన్నికలకు ముందు టికెట్ల కోసం జోరుగా జంపింగులు చేస్తారు. ఎన్నికల తర్వాత.. వివిధ కేసుల నుంచి రక్షించుకునేందుకు అధికార పార్టీతో చేతులు కలుపుతారు. ఇది ఏపీలోనే కాదు.. దేశవ్యాప్తంగా దిగ్విజయంగా జరుగుతున్న జంప్ జిలానీల …
Read More »వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే నిర్వేదం..
పొలిటికల్ జంప్ జిలానీగా పేరు తెచ్చుకున్న ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్ర నిరాశలో కూరుకు పోయారా? రెడ్డి సామాజిక వర్గం నాయకుల డామినేషన్‌ను ఆయన తట్టుకోలేక పోతున్నారా? ఈ పరిణామాలతో ఆయన ఏకంగా వచ్చే ఎన్నికల నుంచి పోటీకి తప్పుకోవాలని భావిస్తున్నారా? అంటే.. స్వయంగా ఆయనే ఔనని చెప్పారు. తాజాగా గిద్దలూరు నియోజకవర్గం పరిధిలోని కంభం మండలంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. …
Read More »తిరుపతి పై పవన్ దండయాత్ర: భూమన
శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయిచేసుకున్న ఘటన పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఇప్పటికే పలుమార్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పవన్ స్వయంగా తిరుపతి వచ్చారు. సీఐ అంజూ యాదవ్ పై క్రమశిక్షణ చర్యలు …
Read More »పవన్ పర్యటన వ్యూహాత్మకమా ?
శ్రీకాళహస్తికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం చేరుకుంటున్నారు. రెండురోజుల క్రితం తమ పార్టీ లీడర్ ను సీఐ అంజూ యాదవ్ చేయిచేసుకున్నారనే కారణంతో నిరసన తెలపటానికి, ఫిర్యాదు చేయటానికి పవన్ శ్రీకాళహస్తి చేరుకుంటున్నారు. ముందు తిరుపతి ఎస్పీని కలిసి ఫిర్యాదుచేసి తర్వాత శ్రీకాళహస్తికి వెళతారని జనసేన నేతలు చెబుతున్నారు. తమ నేతపై సీఐ చేయిచేసుకోవటాన్ని పవన్ పదేపదే వారాహియాత్రలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. నిజానికి ఘటన చిన్నదే. …
Read More »జగన్‌ను మీరు ఒక కోణంలోనే చూస్తున్నారు.. చాలా తప్పు!!
ఏపీ సీఎం జగన్‌కు బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య యోగ్యతా పత్రం(సర్టిఫికెట్) ఇచ్చారు. ఇది కొంత ఆశ్చర్యంగానే ఉన్నా.. నిజమే. జగన్ నిఖార్సయిన మానవతా మూర్తి అని కృష్ణయ్య ఆకాశానికి ఎత్తేశారు. “అసలు జగన్ ను మీరు ఒక కోణంలోనే చూస్తున్నారు. ఇలా చాలా తప్పు. ఆయనలో సంఘ సంస్కర్త ఉన్నాడు. ఆయనలో బీసీల పెన్నిధి ఉన్నాడు. ఈ విషయాన్ని ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం …
Read More »విశాఖలో జనసేన బలపడేనా? పంచకర్ల చేరిక వెనుక!
ఏపీలో వచ్చే ఎన్నికలకు సంబంధించి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ సర్కారును గద్దె దింపడమే లక్ష్యమని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడుకు కొందరు నేతలు ఫిదా అవుతున్నారు. వారాహి యాత్ర 2.0 తర్వాత పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. ఒకరిద్దరే అయినా.. కీలక నేతలు.. సామాజిక వర్గాల పరంగా బలమైన నాయకులు కావడంతో వారి చేరికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నుంచి …
Read More »పురందేశ్వరిపై ఆర్ఎస్ఎస్కు కంప్లెయింట్!
బీజేపీ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన అన్నగారు ఎన్టీఆర్ గారాలపట్టి దగ్గుబాటి పురందేశ్వరి గురించి.. ఇప్పటికే అనేక చర్చలు.. అనేక విశ్లేషణలు వచ్చేశాయి. అయితే.. ఎవరూ గుర్తించని ఒక విషయాన్ని తాజాగా బీజేపీ పెద్దలు ఆర్ ఎస్ ఎస్‌కు కంప్లెయింట్ చేశాయట. అయితే.. ఈ ఫిర్యాదు ఎవరు చేశారు? అనేది మాత్రం ప్రస్తుతానికి అత్యంత గోప్యంగా ఉంచారు. కానీ, కమల నాథుల చర్చల్లో మాత్రం ఫిర్యాదుపై మాత్రం తీవ్రస్థాయిలో ఆసక్తి …
Read More »అర్బన్ ఓటుపై టీడీపీకి అంత నమ్మకం ఎందుకంటే
రోజుకో లెక్క.. రెండు రోజులకో సర్వే.. ఎన్నికలకు ముందు ఇది సర్వత్రా కామన్. అలానే ఏపీలోనూ ఇలాంటి సర్వేలే వస్తున్నాయి. వీటిలో కొన్ని వాస్తవాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలానే తాజాగా పట్టణాల్లో నిర్వహించి న మౌత్ ఒపీనియన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వచ్చే ఎన్నికల్లో పట్టణాల్లో టీడీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ పరిస్థితి ఏంటి? అనేది ఈ సర్వేల ప్రధాన సారాంశం. ఈ క్రమంలో పట్టణ వోటు …
Read More »పవన్ పై వలంటీర్‌ను నిలబెట్టి గెలిపిస్తాం…
విశ్వాసం ఉండొచ్చు.. కానీ అతి విశ్వాసం.. ఎవరికీ ఉండకూడదు. వ్యక్తులైనా.. పార్టీలైనా.. అతి విశ్వాసానికి పోయి.. చేతులు కాల్చుకున్న పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో తమదే గెలుపని బీజేపీ పెద్దలు రాసి పెట్టుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులు అందరూ కర్ణాటకలో కమలం వికసిస్తుందని లెక్కలు వేసుకున్నారు. దీంతో ఎడా పెడా.. అనేక విమర్శలు.. కామెంట్లు కూడా చేశారు. కానీ, కర్నాటకలో …
Read More »చిన్నమ్మా మజాకా.. జగన్‌పై ఓ రేంజ్లో!!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. ఉరఫ్ చిన్నమ్మ వైసీపీపైనా.. సీఎం జగన్‌పైనా ఆది నుంచి విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మళ్లీ ఓ రేంజ్లో దుమ్ముదులిపేసింది. కార్యాలయకు వైసీపీ రంగుల నుంచి ఇళ్ల నిర్మాణం వరకు.. ఉచిత హామీల నుంచి డబ్బుల పందేరం దాకా.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి ఇప్పుడు జరుగుతున్న అప్పుల వరకు కూడా చిన్నమ్మ …
Read More »