Political News

చంద్రబాబుకు అదిరిపోయే ఎలివేషన్

రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయిన దువ్వూరి సుబ్బారావు తాజాగా ఒక వైసీపీ ప్రో యూట్యూబ్ ఛానెల్లో చంద్రబాబు నాయుడు గురించి ప్రశ్నించినపుడు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ప్రత్యేకత ఏంటో అర్థం అవుతోంది. యాంకర్ చంద్రబాబునాయుడితో మీ అనుభవం గురించి చెప్పమంటే.. “చంద్రబాబు నాయుడి గారి దగ్గర నేను ఐదేళ్లు ఫైనాన్స్ సెక్రటరీగా పని చేశాను. చంద్రబాబుగారు నేను చూసిన రాజకీయ నాయకులతో పోలిస్తే ఆయన చాలా భిన్నం. …

Read More »

మాటల వేట‌తో.. మొదటికే మోసం గురూ!

నువ్వొక‌టంటే.. నేరెండంటా.. అనే ధోర‌ణిలో వైసీపీ నాయ‌కులు రెచ్చిపోతున్నారు. అయితే.. ఇది మొదటికే మోసం వ‌స్తుంద‌ని.. ప‌రిశీల‌కులు… వైసీపీ సానుభూతిప‌రులు కూడా హెచ్చరిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ విశ్వ‌విద్యాల‌యానికి పేరు మార్పు విష‌యం..ర‌చ్చ‌కు దారితీసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మంత్రులు మార్కులు వేయించుకునేందుకు త‌మ నోటికి ప‌ని చెప్పారు. ప‌రుషంగా కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో కొన్ని విష‌యాల‌ను వ‌క్రీక‌రిస్తున్నార‌నే వాద‌న టీడీపీ నేత‌ల నుంచి కూడా వినిపిస్తోంది. …

Read More »

కాంగ్రెస్ పరిస్ధితి ఇలాగైపోయిందా ?

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరిస్ధితి రోజురోజుకు అధ్వాన్నంగా తయారవుతోంది. రాజస్ధాన్లో నాయకత్వ మార్పు విషయంలో జరుగుతున్న గొడవే దీనికి తాజా ఉదాహరణ. రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పోటీచేయబోతున్నారు. మనిషికి ఒకటే పదవి అన్న విధాన నిర్ణయం ప్రకారం సీఎం పదవికి రాజీనామా చేయమని సోనియా చెప్పారు. అయితే ఇందుకు గెహ్లాట్ అంగీకరించటంలేదు. ఏదో తంటాలుపడి మొత్తానికి ఒప్పించారు. అయితే గెహ్లాట్ షరతు విధించారు. అదేమిటంటే …

Read More »

ఇవ్వ‌లేక వైసీపీ చెప్ప‌లేక టీడీపీ ఏపీలో ‘సంక్షేమ‌ రాజ‌కీయం’!

ఏపీలో రాజ‌కీయ పార్టీల‌కు బెంగ ప‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న పార్టీల‌ను.. ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతున్న పార్టీలను కూడా ఈ బెంగ వెంటాడుతోంది. ప్ర‌జ‌లు ఇప్ప‌టికే సంక్షేమ ప‌థ‌కాల‌కు దాదాపు అల‌వాటు ప‌డిపోయార‌ని మేధావులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం వైసీపీ అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. అమ్మ ఒడి, రైతు భ‌రోసా,నేత‌న్న నేస్తం, వైఎస్సార్ చేయూత‌ ఇలా అనేక ప‌థ‌కాల‌ను జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌జ‌ల‌కు అందిస్తోంది. దీంతో …

Read More »

అమ‌రావ‌తి పై అబ‌ద్ధాలు వెళ్లేలోపే.. నిజాలు చెప్పండి.. బ్ర‌ద‌ర్స్‌..!

ఏదేమైనా.. ఎవ‌రు ఎన్ని అన్న‌న్నా.. నిజాలు గ‌డ‌ప‌దాటే లోపే.. అబ‌ద్ధం ఊరు చుట్టివ‌స్తుంద‌నేది సామెత‌. ఇది వాస్త‌వం కూడా. మరీ ముఖ్యంగా రాజ‌కీయాల్లో ఇలాంటివి కామ‌న్‌గా కూడా మారిపోయాయి. ఇప్పుడు మూడు రాజ‌ధానుల విష‌యంపైనా.. అదే జ‌రుగుతుంద‌ని మేధావులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం అధికార పార్టీ వైసీపీ మూడు రాజ‌ధానుల కోసం ప‌ట్టుబ‌ట్టింది. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గే ప్ర‌సక్తే లేద‌ని.. చెబుతోంది. ఈ నేప‌థ్యంలో మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా ఏమైనా …

Read More »

జ‌గ‌న్ ఫ్యాక్ష‌న్ బుద్ధి మానుకోలేదు : జ‌గ్గారెడ్డి

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై తెలంగాణలోని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జగ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ అదికారంలో లేన‌ప్పుడు ఫ్యాక్ష‌న్ వ్య‌వ‌హారాలు న‌డిపిన‌ట్టు త‌న‌కు చాలా మంది చెప్పార‌ని అన్నారు. అయితే అప్పుడు ఎలా ఉన్నా అధికారంలోకి వ‌చ్చాక మాత్రం ఆయ‌న‌ ఫ్యాక్ష‌న్ బుద్ధి మానుకోవాలి క‌దా! అని హిత‌వు ప‌లికారు. కానీ, ఆయ‌న వ్య‌వ‌హారం చూస్తే అది మానుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. తాజాగా మీడియాతో …

Read More »

పేరు మార్చడం తప్పు కాదన్న లక్ష్మీ పార్వతి

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ యూనివర్సిటీ పేరు నుంచి ఎన్టీఆర్ పేరు తొలగించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరును పెట్టడంపై టీడీపీ సహా ప్రతిపక్షాలన్నీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆ యూనివర్సిటీకి తన తండ్రి వైఎస్ఆర్ పేరుని పెట్టడంపై సీఎం జగన్ సోదరి వైయస్ షర్మిల కూడా …

Read More »

మూడు రాజధానులు – మూడు బహిరంగ సభలు

రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలనే డిమాండుతో అమరావతి టు అరసవల్లికి పాదయాత్ర జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అమరావతే ఏకైక రాజధానిగా చంద్రబాబునాయుడు అండ్ కో కీలకమైన ఎజెండాగా చేసుకునే అవకాశముంది. ఇలాంటి నేపధ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మూడు రాజధానులే తమ ఎజెండాగా ఎన్నికల నినాదం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందులో భాగంగానే తొందరలో మూడు బహిరంగసభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ …

Read More »

ఇందుకే వీళ్ళిద్దరినీ నమ్మటం లేదా ?

జాతీయ స్ధాయిలో ఎన్టీయేకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాన్న ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు తూట్లు పడుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాల అధినేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావటానికి ఐఎన్ఎల్డీ పార్టీ ఒక ప్రయత్నం జరిగింది. హర్యనాలో తిరుగులేని నేతగా ఉన్న మాజీ ఉప ప్రధానమంత్రి దేవీలాల్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ, ర్యాలీ జరిగింది. జయంతి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రతిపక్షాల నేతలందరినీ ఐఎన్ఎల్డీ పిలిచింది. అయితే ఇంతటి ముఖ్యమైన కార్యక్రమానికి చాలామంది …

Read More »

అయ్య‌న్న‌ను అక్క‌డే తొక్కేస్తా: వైసీపీ ఎమ్మెల్యే

ఉత్త‌రాంధ్ర‌లోని న‌ర్సీపట్నం రాజ‌కీయాలు మ‌రింత రాజుకున్నాయి. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. అయ్య‌న్న‌కు.. ప్ర‌స్తుత ఎమ్మెల్యే వైసీపీ నాయ‌కుడు.. పెట్ల ఉమా శంక‌ర్ గ‌ణేశ్‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే.. భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఉంది. ఇరువురూ కూడా రాజ‌కీయంగా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించుకుంటారు. అయితే.. అయ్య‌న్న‌పై ఇప్పుడు.. తాజాగా పెట్ల తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో విశాఖ రాజ‌ధాని న‌గ‌రం అవుతుంద‌న్న ఆయ‌న‌.. దీనిని అడ్డుకునేందుకు …

Read More »

పీకే వ్యూహాలు ప‌నిచేయ‌డం లేదు బాస్‌..

జాతీయ స్థాయిలో ఒక‌ప్పుడు.. దూకుడుగా వెళ్లిన ప్ర‌శాంత్ కిశోర్‌.. ఉర‌ఫ్ పీకే.. త‌న వ్యూహాల‌తో పార్టీల‌ను అధికారంలోకి తెచ్చాన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకున్నారు. కానీ, వాస్త‌వానికి.. ఆయా రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు అప్ప‌టికే.. ఉన్న అధికార పార్టీల‌పై చూపిన విముఖ‌త నేప‌థ్యంలోనే ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ప‌గ్గాలు అప్ప‌గించారు త‌ప్ప‌.. పీకే వ్యూహాల‌కు కాద‌ని.. కొన్నాళ్లుగా మేధావులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు నిజ‌మ‌ని తేలిపోయింది. పీకే వ్యూహాలు చెల్లుబాటు కావ‌డంలేదేని.. ఆయ‌న …

Read More »

క‌న్నెర్ర చేస్తే.. యాత్ర‌లు ఆగిపోతాయ్‌: మంత్రి బొత్స

అదే అక్క‌సు.. అవే వ్యాఖ్య‌లు.. రైతులు చేప‌ట్టిన మ‌హాపాద‌యాత్ర‌పై.. వైసీపీ మంత్రుల వైఖ‌రి ఏమాత్రం మార‌డంలేదు. మారేలా కూడా లేదు. తాజాగా మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ రైతుల యాత్ర గురించి.. తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కన్నెర్ర చేస్తే చాలు.. 5 నిమిషాల్లో పాదయాత్రలు ఆగిపోతాయని మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే నష్టమేంటన్న బొత్స.. …

Read More »