ఏపీలోని కూటమి ప్రభుత్వం.. వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. గత వైసీపీ ప్రభుత్వం పని చేసిన తీరు.. అదేవిధంగా అమలు చేసిన పథకాలు.. తీసుకువచ్చిన నిధులు.. అప్పులు వంటివి పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు చంద్రబాబు పదేపదే.. ఈ విషయాలను చర్చించారు. ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం అయ్యేలా చేశారు. అయితే.. ఈ …
Read More »గౌరవంగా సాగనంపుతున్నారు !
వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు అన్నీ, ఇన్నీ కావు. ఎన్నికల సమయంలో ఆయన పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల కమీషన్ పలువురు అధికారుల మీద చర్యలు తీసుకున్నా వారి స్థానంలో తిరిగి వైసీపీకి అనుకూలంగా ఉన్న వారినే పోస్టింగ్ కోసం సిఫారసు చేస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి …
Read More »గన్ మెన్లు రిటర్న్ .. కూన తొందరపడ్డాడా ?!
“నాకు రక్షణగా గన్మెన్లు అవసరం లేదు. నాకు ఎవరూ శత్రువులు లేరు. నేను అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలోనే బలంగా పనిచేశాను. ప్రజలతో నిత్యం ఉన్నాను. సాధారణ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ అందించడమే నాకు మంచిది” అంటూ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ చెప్పిన మాటల వెనక అంతర్యం వేరే ఉందా ? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ఆయన గన్ మెన్లను తిప్పిపంపిన వ్యవహారం ఇప్పుడు …
Read More »బాబు-పవన్ ముచ్చట చూశాక పదేళ్లు ఖాయం అంటున్నారు!
రాజకీయంగా విభిన్న ఆలోచనల నుంచి వచ్చి.. చేతులు కలిపిన నాయకులు ఎన్నాళ్లు అలా కలిసి ఉంటారో చెప్పడం కష్టం. ఎందుకంటే.. ఎవరి భావాలు వారివి. ఎవరి ప్రాధాన్యాలు వారివి. అనేక మంది చేతులు కలుపుతారు.. అనేక మంది విడిపోతూ కూడా ఉంటారు. కానీ, పట్టుమని పదేళ్లయినా.. కలిసి ఉన్న పార్టీలు పెద్దగా మనకు కనిపించవు. కనిపిస్తే మంచిదే. కానీ, ఇప్పుడు ఏపీలో చేతులు కలిపి. అధికారంలోకి వచ్చిన టీడీపీ-జనసేన అధినేతల …
Read More »వైసీపీని టెన్షన్లో పెట్టేసిన హైకోర్టు!
ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ.. ఇప్పుడు కార్యాలయాల కూల్చివేతపై బెంగ పెట్టుకుంది. అనధికారి కంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ప్రధాన కార్యాలయాలను నిర్మిస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వాటిని కూల్చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని కక్ష పూరితంగానే కూల్చేస్తు న్నారని పేర్కొంటూ.. వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే.. కూల్చివేతలకు.. ఒక్క రోజు విరామం ఇవ్వాలంటూ.. హైకోర్టు ఆదేశించింది. దీంతో గురువారం నాడు అధికారులు దూరంగానే ఉండిపోయారు. …
Read More »అమరావతిలో రామోజీ విగ్రహం
‘నేను 2008లో తొలిసారి రామోజీరావు గారిని కలిశాను. రామోజీ రావు ఎప్పుడూ ప్రజా సంక్షేమం కోణంలోనే మాట్లాడేవారు. ఆయన మాట్లాడే విధానం నన్ను చాలా ఆకర్షించింది. రామోజీరావు మాటల్లో జర్నలిజం విలువలే తనకు కనిపించాయి. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో రామోజీ వివరించారు’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ సంస్మరణ సభకు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు …
Read More »అమరావతికి ఈనాడు విరాళం రూ.10 కోట్లు !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మీడియా మొఘల్ దివంగత రామోజీరావు సంస్మరణ కార్యక్రమం సంధర్బంగా ఆయన కుమారుడు కిరణ్ అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.10 కోట్లు విరాళం ప్రకటించారు. విజయవాడలోని అనుమోలు గార్డెన్స్ లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఈ సంధర్భంగా ఆయన ప్రసంగించారు. ‘నాన్న గారి సంస్మరణ సభ నిర్వహించిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తన తండ్రి రామోజీరావు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎప్పుడూ …
Read More »జగన్ ప్రభుత్వంపై కీరవాణి సంచలన వ్యాఖ్యలు
ఈనాడు సంస్థల మాజీ చైర్మన్ దివంగత రామోజీరావు సంస్మరణ సభ ఈరోజు విజయవాడలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఈ సంస్మరణ సభకు రాజకీయ, పాత్రికేయ, వ్యాపార, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆ వేదికపై రామోజీరావు గురించి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహోన్నతమైన వ్యక్తిత్వానికి ప్రతీక రామోజీరావు అని కీరవాణి కొనియాడారు. రామోజీరావు లాగా ఒక్కరోజు …
Read More »ఏపీకి రెండు `భారతరత్న`లు.. బాబుకు పెద్ద టాస్క్!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు తనకు తానే స్వయంగా తన ముందు అతి పెద్ద టాస్క్ పెట్టుకున్నారు. ఇద్దరు కీలక వ్యక్తులకు రెండు భారతరత్నలు సాధించేందుకు ఆయన సంకల్పం చెప్పుకొన్నారు. కొన్ని రోజుల కిందట ఒక రత్నాన్ని ఎంచుకోగా.. తాజాగా మరో రత్నాన్ని ఆయన ప్రతిపాదించారు. ఇద్దరూ కూడా.. చంద్రబాబుకు అత్యంత దగ్గరైన వారు.. అదే సమయంలో అత్యంత అవసరమైన వారు. రాజకీయంగా వారే ఆలంబనగా చంద్రబాబు సుదీర్ఘ …
Read More »ఆదర్శప్రాయంగా అన్నా క్యాంటీన్లు.. విషయం ఏంటంటే!
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అన్నా క్యాంటీన్లను ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి ఆర్థిక సహకారం అందిస్తారు. ఒక్క క్యాంటీన్ నడవడానికి రోజుకు రూ.20 వేల వరకు నిధులు అవసమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 60 శాతం నిధులు.. కార్పొరేషన్లు 35 శాతం నిధులు వెచ్చించేలా ప్లాన్చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లను …
Read More »మాట నిలబెట్టుకున్న చంద్రబాబు !
వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఏకంగా ఇల్లూ, వాకిలీ వదిలిపెట్టి వెళ్లి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాశీ పుణ్యక్షేత్రంలో తలదాచుకున్న కాకినాడ గ్రామీణ మండలం రాయుడుపాలేనికి చెందిన ఆరుద్రకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలిచారు. అనారోగ్యంతో ఆరుద్ర కూతురు వీల్ చెయిర్ కే పరిమితమయింది. ఆమెకు కలిగిన ఇబ్బందులు, ఆమె కూతురు దుస్థితి చూసి చలించిపోయిన చంద్రబాబు నాయుడు అవసరమైన సాయం అందిస్తామని ఈ నెల 14న హామీ …
Read More »బదిలీ : గబ్బర్ సింగ్ ఆఫీసులో అత్యుత్పాహం !
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉన్న సమయంలో ఆయన భద్రతా సిబ్బందితో స్థానిక మంగళగిరి సీఐ శ్రీనివాసరావు దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. పవన్ కల్యాణ్ అక్కడ ఉన్న సమయంలోనే అనుమతి లేకుండా ఆఫీసులోనికి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. 11 రోజుల వారాహి దీక్షలో ఉన్న పవన్ కల్యాణ్ అమ్మవారికి పూజలు చేస్తున్న సమయంలోనే సీఐ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates