రాబోయే ఎన్నికల్లో కొంతమంది ప్రజా ప్రతినిధులు పోటీ చేయడానికి కేసీయార్ నో చెప్పేశారట. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని కొంతమంది ఎంఎల్సీలు రెడీ అయిపోయారు. తమ నియోజకవర్గాల్లో తమకు గెలిచే అవకాశాలున్నాయి కాబట్టి టికెట్లు ఇవ్వాలని కొందరు కోరితే మరికొందరు బాగా ఒత్తిడి పెట్టారట. అయితే ఎంఎల్సీల్లో ఎవరికీ టికెట్లు ఇచ్చేది లేదని కేసీయార్ కచ్చితంగా చెప్పేశారని పార్టీ వర్గాల టాక్. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్లిచ్చినా వాళ్ళ …
Read More »పురందేశ్వరి సినిమా యుద్ధం చేస్తున్నారా ?
బీజేపీకి కొత్త అధ్యక్షురాలైన దగ్గుబాటి పురందేశ్వరి సినిమా యుద్ధం మొదలుపెట్టారు. సినిమాల్లో ఫైటింగ్ సీన్లు ఎలా తీస్తారో అందరికీ తెలిసిందే. అక్కడ కొట్టేవాడు కొట్టినట్లు నటిస్తాడు. దెబ్బలు తినేవాడు తిన్నట్లు నటిస్తాడు. కొట్టేవాడు నిజంగా కొట్టడు. తినేవాడు నిజంగా తినడు. ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పురందేశ్వరి యుద్ధం కూడా అచ్చం సినిమా యుద్ధం లాంటిదే. మీడియాతో పురందేశ్వరి మాట్లాడుతు జగన్ ప్రభుత్వం పై చాలా ఆరోపణలు, విమర్శలు చేశారు. …
Read More »ఈరోజు పార్లమెంటు- ఈసారి అన్నీ హాట్ టాపిక్సే
గురువారం నుండి మొదవ్వబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మంటలు తప్పేట్లు లేదు. ఒకవైపు ఎన్డీయే మరోవైపు కొత్తగా ఏర్పాటైన ఇండియా కూటమి మధ్య మంటలు పెట్టబోతోంది. ఈ సమరానికి పార్లమెంటు వేదిక కాబోతోంది. కొత్తగా ఏర్పాటైన కూటమి ఇండియా తమ సత్తాను చాటాలని పార్లమెంటు సమావేశాలను ఉపయోగించుకోబోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ సమావేశాల్లోనే కేంద్రప్రభుత్వం రెండు వివాదాస్పదమైన బిల్లులను ప్రవేశపెడుతోంది. అవేమిటంటే మొదటిది కామన్ సివిల్ కోడ్ బిల్లు. …
Read More »మచిలీపట్నం పాలిటిక్స్ మారుతున్నాయ్.. పేర్నికి కష్టాలేనా?
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మచిలీపట్నం. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పేర్ని నాని గెలుపు గుర్రం ఎక్కారు. తర్వాత ఆయన సీఎం జగన్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే.. గత ఏడాది రెండో సారి మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు.. పేర్నిని తప్పించారు. ఇక, ఇప్పుడు పేర్ని కూడా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు)కి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇదిలావుంటే.. మరోవైపు.. ప్రతిపక్షాలు పుంజుకుంటున్నాయి. …
Read More »టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు.. త్వరలో ముహూర్తం!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి కంచుకోటగా పేర్కొనే జిల్లా కడప. అయితే.. ఈ జిల్లాలో బలపడాలని ప్రతిపక్షం టీడీపీ ఎప్పటి నుంచో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో నాయకులను కూడా కదిలిస్తోంది. దీంతో టీడీపీని బలపరి చేందుకు కడప నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. మరోవైపు వైసీపీలో నెలకొన్న వివాదాలు, విభేదాల కారణంగా కొందరు నాయకులు బయటకు వస్తున్నారు.ఈ పరంపరలో నిన్న మొన్నటి వరకు వైసీపీకి జైకొట్టిన …
Read More »ఏపీ ప్రజలు మార్పు కోరుతున్నారు.. అమిత్ షాకు పవన్ వెల్లడి
ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా బుధవారం రాత్రి పొద్దు పోయాక కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. దాదాపు గంట సేపు సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను పవన్ కళ్యాణ్.. అమిత్ షా కు పూసగుచ్చినట్టు వివరించారని తెలిసింది. ముఖ్యంగా ఇటీవల తాను …
Read More »బీజేపీ-జనసేన పొత్తు.. జోగయ్య హాట్ కామెంట్స్
తాజాగా ఢిల్లీలో జరిగిన ఎన్డీయే మిత్రపక్షాల భేటీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కావడం, బీజేపీతో పొత్తు ఉంటుందని ఆయన చెప్పడం పట్ల మాజీ పార్లమెంటు సభ్యుడు, కాపు సంక్షేమ సంస్థ అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో బీజేపీ.. కేవలం జనసేనను వాడుకునేందుకు చూస్తోందని అన్నారు. పవన్ కు ఉన్న చరిష్మాను వాడుకుని ఎన్నికల్లో లబ్ధి …
Read More »నాకివ్వండి సర్.. కాదు.. నాకే ఇవ్వాలి సర్..
ఎన్నికల ముందు టికెట్ల వ్యవహారం టీడీపీలో వివాదాలకు దారితీస్తోంది. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు ఇలాంటి నియోజకవ ర్గాల విషయంలో ఆయన నొప్పింపక.. తానొవ్వక అనే ఫార్ములాను అనుసరిస్తున్నారు. గిరిజన నియోజకవర్గాల్లో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే.. వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయా నియోజకవర్గాల్లోనూ తాము బలపడాలని .. గెలుపు గుర్రం ఎక్కాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నియోజకవర్గాలవారీగా నాయకులను పిలిచి.. చర్చించి టికెట్లు …
Read More »కేసీఆర్… నేను నోరు విప్పితే..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్.. నేను నోరు విప్పితే నువ్వు ఈ రోజే ప్రగతి భవన్ నుంచి పారిపోతావ్ బిడ్డా!” అని అన్నారు. అంతేకాదు.. తాము ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్నామని..కానీ, బీఆర్ ఎస్ నాయకులు, మంత్రులు కొందరు రెచ్చగొడుతున్నారని కోమటిరెడ్డి చెప్పారు. తాజాగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కువ సమయం …
Read More »ఢిల్లీలో చక్రం తిప్పుతున్న పవన్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేసిన వైనం ఏపీ రాజకీయాలలో సంచలనం రేపింది. ఇక, జగన్ సర్కార్ వైఫల్యాలను జాతీయ స్థాయిలో పవన్ ఎండగట్టిన తీరు కూడా వైసీపీ నేతలకు షాకిచ్చింది. మరోవైపు, ఎన్డీఏ కూటమిలోకి దారులు మూసుకుపోయాయనుకుంటున్న టీడీపీకి పవన్ రూపంలో ఆశలు చిగురించాయి. ఈ …
Read More »రాజాం రచ్చపై చంద్రబాబు క్లారిటీ.. ప్రతిభ వారసురాలికి షాక్…!
వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆదిశగా కసరత్తును ముమ్మరం చేశారు. బలమైన నియోజకవర్గాలను, కంచుకోటలను ఎట్టి పరిస్తితిలోనూ వదులుకోకూడదే నిర్ణయానికి ఆయన వచ్చారు. ఈ విషయంలో ఆయన ఒకింత కఠినంగానే వ్యవహరిస్తున్నారని చెప్పాలి. తాజాగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ఎస్సీ నియోజకవర్గానికి దాదాపు టికెట్ కన్ఫర్మ్ చేసేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి కోండ్రు మురళి ఇంచార్జిగా …
Read More »పవన్లో సెకండ్ యాంగిల్ చూస్తున్న బీజేపీ..!
రాజకీయాల్లో చూసే కోణాలు.. వేసే అడుగులు ఎప్పుడు ఎలాగైనా మారొచ్చు. అవసరం-అవకాశం అనే రెండు పట్టాలపైనే ఏ రాజకీయ పార్టీ అయినా..అడుగులు వేస్తుంది. ముఖ్యంగా కాకలు తీరిన రాజకీయ నాయకులుగా పేరున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వంటివారు.. ఊరకరారు మహాను భావులు అన్నట్టుగా.. ఊరికేనే వారు ఏమీ చేయరు.. ఎవరినీ పిలవరు. ఆమూలాగ్రం అన్ని కోణాల్లోనూ ఆలోచించుకునే …
Read More »