తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు చల్లేశారు. ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ లేదని ఆయన శుక్రవారం తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. అందులో భాగంగా ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ను కూడా కలిశారు. ఈ భేటీలో …
Read More »ర్యాంకులపై వైసీపీ రచ్చ..చంద్రబాబు కౌంటర్
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు ఒక ఉద్దేశ్యంతో చెప్పిన విషయంలో నానార్థాలు తీసి..చిలవలు పలవలుగా చేసి ఆయన ఇమేజ్ కు డ్యామేజ్ చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని వారు ఆరోపిస్తుంటారు. ఈ కోవలోనే తాజాగా మంత్రులకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులపై కూడా వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ …
Read More »పేదల గుండెకు బాబు సర్కారు భరోసా
ఏపీలోని పేద ప్రజల గుండెకు భరోసా అందించే దిశగా కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమలులోకి రానున్న ఈ పథకం కింద… గుండె పోటు వచ్చిన పేదలకు చికిత్స అందేవరకు వారి ప్రాణాలను నిలబెట్టేలా సర్కారు చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా… గుండెపోటు వచ్చిన తోలి గంటలో రోగికి ఇవ్వాల్సిన టెనెక్టెప్లేస్ ఇంజక్షన్ ను ఉచితంగా ఇవ్వనుంది. ఈ ఇంజక్షన్ ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి …
Read More »“జగన్‌ది.. పొలిటికల్ రేప్.. నా మాట విను!”
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్.. తాజాగా వైసీపీ గూటికి చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సాకే.. వైఎస్ హయాంలో కీలక రోల్ పోషించారు. విభజిత రాష్ట్రంలో ఏపీ కాంగ్రె స్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే.. ఆయన తాజాగా వైసీపీ పంచన చేరి ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. అయితే.. సాధారణంగా ఎవరైనా పార్టీ మారితే.. సూచనలు, సలహాలు కామనే. కానీ, సాకే …
Read More »ఇంటరెస్టింగ్!.. టీడీపీ ఆఫీసులో అక్కినేని ఫామిలీ!
అక్కినేని నాగార్జున… టాలీవుడ్ లో సీనియర్ నటుడు. రాజకీయాలతో పని లేకుండా ఆయన తన పని ఎదో తాను ఆలా చేసుకుపోతూ ఉంటారు. కారణం ఏమిటో తెలియదు గానీ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తో నాగ్ చాల ఫ్రెండ్లీగా ఉంటారు. గతంలో అక్రమాస్తుల కేసులో జగన్ జైల్లో ఉండగా.. నేరుగా జైలుకి వెళ్లి మరీ నాగ్ ఆయనను పరామర్శించారు. నాడు ఆ ఫోటోలు వైరల్ …
Read More »వర్మ విచారణకు వచ్చాడండోయ్..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత కొన్నేళ్లలో సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ మద్దతుదారులను టార్గెట్ చేయడం తెలిసిన సంగతే. ఇలా ఒక పార్టీ మద్దతుదారులను టార్గెట్ చేయడం కరెక్టా.. ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ఎలా అంటూ దీన్ని తప్పుబడుతున్న వాళ్లు లేకపోలేదు. కానీ వైసీపీ అధికారంలో ఉండగా సోషల్ మీడియాలో దారుణాతి దారుణమైన పోస్టులతో ప్రత్యర్థుల …
Read More »వైసీపీలోకి శైలజానాథ్.. ఆ లారీ డ్రైవర్ కు కష్టమే
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో.. సామాన్యులకు కూడా టిక్కెట్లు ఇచ్చామంటూ వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా చెప్పుకున్న సంగతి తెలిసిందే. తాను ఓ సామాన్య లారీ డ్రైవర్ కు అసెంబ్లీ సీటు ఇచ్చానని గొప్పలు చెప్పుకున్నారు. అయితే… ఇకపై అలాంటి సామాన్యులకు వైసీపీలో టికెట్లు దక్కే పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే… సదరు లారీ డ్రైవరుకు ఇచ్చిన సీటులోకి ఇప్పుడు ఓ బడా రాజకీయ నేత …
Read More »చంద్రబాబు ‘ర్యాంకులు’.. కూటమి హ్యాపీయేనా.. ?
కూటమి సర్కారు మంత్రి వర్గ పనితీరుపై సీఎం చంద్రబాబు మార్కులు వేసేశారు. మంత్రులకు ర్యాంకు లు కూడా ప్రకటించారు. అయితే.. ఈ ర్యాంకుల వ్యవహారంకొన్నాళ్లుగా చర్చకు వచ్చినా.. ఊహించిన దానికి భిన్నంగా ఉండడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. వాస్తవానికి మంత్రి నారా లోకేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సంజీవరెడ్డిగారి సవిత, వంగలపూడి అనిత వంటివారు ప్రజల్లో దూకుడుగాఉన్నారు. …
Read More »ఎన్డీయే చైర్మన్ పదవిని చంద్రబాబు కోరారా..?
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురించి గురువారం నాటి పార్లమెంట్ సమావేశాల్లో ఓ కీలక అంశం ప్రస్తావనకు వచ్చింది. పార్లమెంట్లోని పెద్దల సభ అయిన రాజ్యసభలో బాబు అంశాన్ని మాజీ ప్రధాని, జేడీయూ అధ్యక్షుడు దేవెగౌడ ప్రస్తావించారు. బాబు గురుంచి గౌడ చేసిన ప్రస్తావనపై బీజేపీ ఘాటుగా రియాక్ట్ అయ్యింది. వాస్తవాలు తెలుసుకోకుండా సభలో కీలక అంశాలపై ప్రస్తావించడం సరి కాదని బీజేపీ హితవాబు చెప్పింది. …
Read More »జగన్ కు సాయిరెడ్డి గట్టిగా ఇచ్చేశారుగా…!
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవలే ఎంపీ పదవితో పాటుగా… వైసీపీకి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై గురువారం నాటి మీడియా సమావేశంలో జగన్ స్పందించారు. పార్టీని వీడిన వారు తమ క్యారెక్టర్ ను పోగొట్టుకున్నట్టేనని ఆయన …
Read More »ఆర్బీఐ కొత్త గవర్నర్ తొలి దెబ్బ అదిరిపోయింది!
రుణాలఫై వడ్డీ రేట్లు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. గడచిన ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కోసం ఏర్పాటు అయిన రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం తీసుకున్న ఓ కీలక నిర్ణయంతో దేశంలో వద్దే రేట్లు తగ్గడానికి మార్గం సుగమం అయ్యింది. ఆర్బీఐ నూతన గవర్నర్ గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న సంజయ్ మల్హోత్రా తన తోలి చర్యతోనే వద్దే …
Read More »వాట్సాప్ లో ఇంటర్ హాల్ టికెట్స్… ఎలాగంటే..?
ఏపీలోని కూటమి సర్కారు వాట్సాప్ గవర్నెన్స్ పేరిట నయా పాలనాజి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ కొత్త సేవలను ప్రారంభించారు. యువగళం పేరిట లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ప్రజలు… ప్రత్యేకించి విద్యార్థులు నుంచి వినిపించిన సమస్యల పరిష్కారం కోసమే ఆయన ఈసేవలను ప్రారంభించారు. ఇటీవలే లోకేష్ చేతుల మీదుగా ఏపీలో వాట్సాప్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates