ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రానికి పోయిన పేరును తీసుకువచ్చేందుకు.. గత ప్రాభవం నిలబెట్టేందుకు కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. వీటిలో టీడీపీ దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రినారా లోకేస్‌లు పెట్టుబడుల కోసం ప్రయత్నించారు. ఒప్పందాలు చేసుకోలేదు కానీ.. పారిశ్రామిక వేత్తలను ఒప్పించారు. దీనికి సంబంధించిన ఫలాలు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయి. ఇక, బీజేపీ విషయానికి వస్తే.. …
Read More »పరిటాల శ్రీరామ్ వెనక్కు తగ్గక తప్పలేదు!
పరిటాల…ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. అటు రాజకీయంగా అయినా… ఇటు ఆయా ప్రాంతాలపై పట్టు విషయంలో అయినా ఈ ఫ్యామిలీ చెప్పిందే దాదాపుగా జరిగి తీరుతుంది. ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లా కేంద్రంగా రాజకీయాలు సాగిస్తున్న ఈ కుటుంబంలో ప్రస్తుతం మూడో తరం యమా యాక్టివ్ గా ఉంది. దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల …
Read More »ఒక వ్యక్తికి మూడు టర్మ్ లే..లోకేశ్ ప్రతిపాదన
వారసత్వ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అవకాశాలు అందిపుచ్చుకున్నవారే ఏ రంగంలోనైనా రాణిస్తారని, వ్యాపారం, సినిమా, రాజకీయం, కుటుంబం.. ఏ రంగమైనా వారసత్వం అనేది మిథ్య అని చంద్రబాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. లోకేశ్‌కు వ్యాపారం అయితే తేలికని, ప్రజా సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా లోకేశ్ అదే తరహాలో పదవులపై కీలక వ్యాఖ్యలు …
Read More »ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు
ఏపీలోని కూటమి సర్కారు రాష్ట్ర ప్రజలకు సోమవారం శుభ వార్త చెప్పింది. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న భూముల ధరలు, వాటి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో భూముల ధరలతో పాటుగా రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం ఓ కీలక ప్రకటన చేశారు. …
Read More »నారా లోకేశ్ వెరీ వెరీ స్పెషల్.. !!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ నిజంగానే ప్రతి విషయంలోనూ వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు. ఏం చేసినా.. తనదైన శైలిలో చేసుకుపోతున్న లోకేశ్ పై జనం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సొమ్మును అనవసరంగా ఖర్చు చేసేందుకు ససేమిరా అంటున్న లోకేశ్… తనదైన శైలి ప్రత్యేక మార్గంలో పయనిస్తూ ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ విషయంలో లోకేశ్ …
Read More »బరాబర్ గద్దర్ కు పద్మ అవార్డు ఇవ్వం: బండి సంజయ్
భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణలో రచ్చ మొదలైంది. ఈ అవార్డుల్లో భాగంగా తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యుడు నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు పద్మ శ్రీ పురస్కారం దక్కింది. వీరిద్దరీ అవార్డులు రావడం పట్ల తెలంగాణలో హర్షం వ్యక్తం అవుతున్నా.. ఎందుకనో గానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తీవ్ర అసంతృప్తి …
Read More »రెండేళ్ల యువగళం!… లోకేశ్ విభిన్న లక్ష్యం సాకారం!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ గతంలో చేపట్టిన ప్రతిష్ఠాత్మక యువగళం పాదయాత్రకు నేటితో సరిగ్గా రెండేళ్లు నిండాయి. ఓ విభిన్న లక్ష్యంతో చేపట్టిన ఈ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా లోకేశ్ సఫలం అయ్యారు కూడా. లోకేశ్ యాత్ర ఫలితంగా ఏపీలో తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ దఫా గతంలో కంటే రికార్డు మెజారిటీతో టీడీపీ అధికారం చేపట్టడం గమనార్హం. ఈ పాదయాత్ర …
Read More »జగన్ కు భారీ ఉపశమనం లభించినట్టే!
వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోమవారం పొద్దుపొద్దునే భారీ ఉపశమనం లభించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించాలన్న వాదనకు ససేమిరా అన్నది. అంతేకాకుండా జగన్ బెయిల్ ను రద్దు చేయాలన్న పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహంతో స్వయంగా పిటిషనరే ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఈ కేసుల్లో ఎప్పుడెం జరుగుతుందోనన్న ఆందోళనతో సాగుతున్న జగన్ శిబిరం ఈ …
Read More »బాబును చూసి అయినా నేర్చుకోండబ్బా!
నారా చంద్రబాబునాయుడు.. దేశంలోనే సీనియర్ మోస్ట్ నేతగానే కాదు.. ఏ విషయంలో ఎంతదాకా స్పందించాలో తెలిసిన నేత. ఏ విషయంలో విరుచుకుపడాలో… ఏ విషయంలో నిగ్రహంతో మెలగాలో తెలిసిన నేత. తనలోని భావాలను అణచుకునే శక్తి కలిగిన నేత. ఇతరుల విషయాల్లో అసలు వేలు పెట్టేందుకు ససేమిరా అనే నిబద్ధత కలిగిన నేత. ఇక వ్యూహాలను అమలు చేయడంలో చతురత కలిగిన నేతగా చంద్రబాబుకు మంచి రికార్డులే ఉన్నాయి. దాదాపుగా …
Read More »ఏడాది పాలనపై రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇవే
కాంగ్రెస్ పాలనలో కేవలం ఏడాది కాలంలో తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఆదివారం సాయంత్రం ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం పోస్టు చేశారు. దీనిలో అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకే రోజు 4 కీలక పథకాలను ప్రారంభించామన్నారు. ఈ పథకాలు తెలంగాణ పేదలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. తాజాగా …
Read More »జనసైనికులకు సేనాని కొత్త కట్టుబాట్లు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భారత గణతంత్ర దినోత్సవాన తన పార్టీ శ్రేణులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. టీడీపీ, బీజేపీతో కలిసి పొత్తులో ఉన్న నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన ఆవశ్యకతను పదే పదే ప్రస్తావించిన పవన్… పార్టీ శ్రేణులు పాటించి తీరాల్సిన అంశాలను విస్పష్టంగా వెల్లడించారు. అనవసరం అన్న పదానికి ఆమడ దూరంలో ఉండాలన్న భావన వచ్చేలా పవన్ పేరిట జనసేన జారీ …
Read More »‘ట్రయల్’ కు లోకేశ్ రెడీ!.. సాక్షికి ‘పరువు’ దక్కేనా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇప్పుడు ఓ పెద్ద పోరాటమే చేస్తున్నారు. తన పరువుకు భంగం కలిగేలా కథనాలు రాసిందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఆధ్వర్యంలోని సాక్షి మీడియాను ఆయన ఏకంగా కోర్టుకు లాగిన సంగతి తెలిసిందే. సాక్షిపై లోకేశ్ దాఖలు చేసిన పరువు నష్టం దావా విశాఖలోని ’12వ అదనపు జిల్లా కోర్టులో విచారణ సాగుతోంది. ఇప్పటికే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates