ఏదో సినిమాలో ఆ ఒక్కటి అడక్కు! అన్నట్టుగా ఏపీకి కీలకమైన విశాఖ రైల్వే జోన్ మినహా.. మిగిలిన వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా వరాల జల్లు కురిపించింది. రైల్వే నుంచి రోడ్డు వరకు.. పలు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించి వీడియో కాన్ఫరెన్స్‌లో పలు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడంతోపాటు.. వాటికి మాస్టర్ ప్లాన్ కూడా మంజూరు చేయడం …
Read More »చెల్లిని కోర్టుకు లాగడం సామాన్యం కాదు జగన్ సార్: షర్మిల
ఏపీ మాజీ సీఎం జగన్, ఏపీ పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి పంపకాల వ్యవహారం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ప్రతి ఇంట్లో చిన్న చిన్న వివాదాలు ఉంటాయని, వాటిని రాజకీయం చేయడం సరికాదని ఏపీ మాజీ సీఎం జగన్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. తన సోదరి షర్మిల తనకు రాజకీయంగా వ్యతిరేకంగా వెళ్తున్న నేపథ్యంలోనే ఆస్తుల విషయంలో తేడా వచ్చిందని జగన్ చెప్పిన వైనం రాష్ట్రవ్యాప్తంగా …
Read More »మీ గొడవలోకి టీడీపీకి లాగొద్దు..జగన్ కు బాబు వార్నింగ్
వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి వివాదం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అన్నాచెల్లెళ్లు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తమ కుటుంబ వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని టీడీపీపై జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు కౌంటర్ …
Read More »షర్మిల లెటర్ పై స్పందించిన జగన్
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి వివాదం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై టీడీపీ సోషల్ మీడియా విభాగం ట్వీట్ చేయడం, ఆరోపణలు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోని తాజాగా ఈ విషయంలో టీడీపీ నేతల విమర్శలపై జగన్ స్పందించారు. తమ కుటుంబ సమస్యను రాజకీయం చేయడం ఏంటని జగన్ మండిపడ్డారు. ఎన్నికల …
Read More »జగన్ వెర్సస్ షర్మిళ.. చర్చలోకి వైఎస్ అవినీతి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిళ మధ్య నెలకొన్న విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ షర్మిళ జగన్‌ను ఘాటుగా విమర్శించడం.. జగన్ తన పార్టీ వాళ్లతో ఆమె మీద మాటల దాడి చేయించడమే చూశాం. కానీ ఇప్పుడు పరస్పరం కేసులు పెట్టుకునే స్థాయికి విభేదాలు ముదిరిపోయాయి. జగన్, షర్మిళ పరస్పరం ఘాటుగా రాసుకున్న లేఖలు కూడా మీడియాలోకి వచ్చేశాయి. …
Read More »టీడీపీలోకి పవన్‌ను ఓడించిన వైసీపీ నేత!!
వైసీపీకి మరో పెను గండం పొంచి ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. కీలకమైన కాపు నాయకుడు.. 2019 లో పవన్‌ను ఓడించిన నాయకుడు.. ఇప్పుడు జగన్ కు బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. 2019 ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో జనసేన తరఫున పవన్ కల్యాణ్.. పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో రెండు స్థానాలనుంచి పవన్ పోటీ చేశారు. భీమవరంలో వైసీపీ తరఫున కాపు నాయకుడు గ్రంధి శ్రీనివాస్ …
Read More »విజయసాయిరెడ్డి ఆమరణ దీక్ష.. జోక్ కాదు.. నిజమే!
వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి ఆమరన నిరాహార దీక్షకు రెడీ అవుతున్నారు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరలవుతోంది. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అంటే.. విశాఖపట్నంలోని ఆంధ్రుల హక్కుగా ఉన్న స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేయకుండా.. అడ్డుకునేందుకేనని చెబుతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం ఇంకా రెడీ కాలేదని.. అయ్యాక వివరాలు తెలుస్తాయని అంటున్నారు. అయితే.. అసలు కేంద్రంలోని పెద్దలతో …
Read More »తెలంగాణలోనూ పొలిటికల్ బాంబులు పేలతాయట
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాజకీయాలలో పొలిటికల్ బాంబుల ట్రెండ్ నడుస్తోంది. ఓ మీడియా ఛానల్ అధినేతపై పరోక్షంగా వైసీపీ చేసిన ట్వీట్ పెను దుమారం రేపుతోంది. ఇక వైసీపీకి దీటుగా ఈరోజు టీడీపీ కూడా సంచలన ట్వీట్ చేయబోతోంది. ఈ క్రమంలోనే ఈ ట్రూత్ బాంబుల కల్చర్ తెలంగాణకు పాకినట్లు కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపే పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ …
Read More »వైసీపీ పేల్చిన ట్రూత్ బాంబ్ ఇదే
ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య కొద్దిరోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. అక్టోబర్ 24 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు పెద్ద బాంబు పేలుతుందంటూ ఇటు టీడీపీ, అటు వైసీపీ నిన్న పోస్టులు పెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ సోషల్ మీడియా ఖాతా నుండి ఓ పోస్ట్ వెలువడడం సంచలనం …
Read More »అవమానం తొలగించుకొని… ఆల్ రైట్ స్థాయికి చేరిన రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా తనపై వస్తున్న విమర్శలకు అనుకోకుండానే కలిసి వచ్చిన అవకాశంతో చెక్ పెట్టారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తనపై జరుగుతున్న దుష్ప్రచారం, ఒకింత అవమాన పర్వానికి ఆయన పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ యువనేత ప్రియాంక గాంధీ నామినేషన్ పర్వం సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఊహించని రీతిలో రేవంత్ రెడ్డి పై చర్చ …
Read More »వాసిరెడ్డి పద్మ.. దారెటు?
వాసిరెడ్డి పద్మ.. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా పనిచేసి, వైసీపీలో మౌత్ పీస్‌గా కూడా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీ నుంచి ప్రస్తుతం వరకు కూడా వైసీపీకి బలమైన నాయకురాలిగా పద్మ గుర్తింపు పొందారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు.. ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారు. కొన్నాళ్లు అక్కడ ఉన్నారు. ఇక, ఆ తర్వాత వైఎస్ మరణంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నిత్యం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీకి జోష్ పెంచారు. …
Read More »మంత్రుల పై చంద్రబాబు సీరియస్..రీజనిదే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ క్రమంలోనే కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. మంత్రులు స్పీడ్ పెంచాలని, సమర్థవంతంగా పనిచేయాలని చంద్రబాబు సున్నితంగా క్లాస్ పీకారని తెలుస్తోంది. ఇక నుంచి ప్రతిరోజు ఎంతో ముఖ్యమైందని, మంత్రులు కూడా తనతో సమానంగా పనిచేయగలరని చంద్రబాబు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates