ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర ప్రయాగ్‌రాజ్ జిల్లాలో సోమవారం(జనవరి 13) నుంచి 45 రోజుల పాటు జరగను న్న మహా కుంభమేళాకు సర్వం సిద్ధమయ్యాయి. ఈ క్రతువు.. 114 ఏళ్లకు ఒకసారి వస్తుందని పండితులు చెబుతున్నారు. అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నది- గంగ, యమునలతో జతకలిసే చోటు ప్రయాగ్ రాజ్‌లో ఉంది. అక్కడే ఈ మహా కుంభమేళాను నిర్వహిస్తున్నారు. దీనికి దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా.. ప్రజలు హాజరవుతున్నారు. ఈ క్రతువును …
Read More »తిరుపతి తొక్కిసలాట: బాధితులకు పరిహారం అందించిన చైర్మన్
వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు టోకెన్ తీసుకోవాలని వచ్చి.. తిరుపతిలో జరిగిన తొక్కిస లాటలో ప్రాణాలు కోల్పోయిన వారిని దేవస్థానం పాలకమండలి ఆదుకుంది. ఈ ఘటనకు సంబంధించి అన్ని వైపుల నుంచి బోర్డుపై ఒత్తిళ్లు వచ్చిన విషయం తెలిసిందే. సర్కారు తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా క్షమాపణలు చెప్పాలని పలు మార్లు డిమాండ్ చేశారు. ఇక, సీఎం చంద్రబాబు కూడా.. ఈ విషయాన్ని సీరియస్‌గా …
Read More »గడ్కరీ సాబ్… మరో మారు ఆలోచించండి…!
నితిన్ గడ్కరీ… కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిగా పదేళ్లకుపైగా కొనసాగుతున్నారు. మోదీ కేబినెట్ లో ఆ శాఖను గడ్కరీ తప్పించి ఇతర నేత చేపట్టనే లేదు. బీజేపీలో ఓ సీనియర్ మోస్ట్ నేతగానే కాకుండా… దేశ అభివృద్ధి విషయంలో ప్రత్యేకించి రోడ్డు రవాణా అభివృద్ధి విషయంలో గడ్కరీకి ఉన్నంత విజన్ మరే నేతకు లేదనే చెప్పాలి. ఫలితంగానే గడ్కరీ హయాంలో దేశంలో జాతీయ రహదారుల వృద్ధి పరుగులు …
Read More »పవన్ ను టచ్ చేయడం అసాధ్యం!
నటుడిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే విజయాలను ఎన్నింటినో సాధించారు. ఇప్పుడు అటు సినిమాలతో పాటుగా ఇటు రాజకీయాల్లోనూ ఆయన తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఏ రాజకీయ నేతకు అయినా… తన పరిధిలో, తన హయాంలో జరిగే అభివృద్ధే సదరు నేత పనితీరుకు కొలమానం. అది ఎమ్మెల్యేగా కావచ్చు, ఎంపీగా కావచ్చు…లేదంటే మంత్రిగానో, ముఖ్యమంత్రిగానో ఉప ముఖ్యమంత్రిగానో కావచ్చు… పరిధి మారుతుందే గానీ.. వారి పరిధిలో, …
Read More »సంక్రాంతి కైనా సొంత ఊర్లకు వెళ్ళమంటున్న సీఎం
సంక్రాంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు తెలుగు వారికి శుభాకాంక్షలు చెప్పారు. దేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తం గా తెలుగు వారు ఎక్కడ ఉన్నా.. ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకోవాలన్నారు. ఇదేసమయంలో ఆయన సంక్రాంతికి-మానవ సంబంధాలకు కూడా లింకు పెట్టారు. నేటి కంప్యూటర్ యుగంలో పరుగులు పెడుతున్న జీవన శైలికి.. పండుగలు బ్రేకులు వేస్తాయని.. తద్వారా మనం ఏంటో తెలుసుకునేందుకు మనకు ఈ పండుగలు గొప్ప అవకాశం ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. …
Read More »కష్టాల్లోనూ… కానుకలను ఆపని బాబు గారు!
ఏపీ అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రం. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్ తో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన ఏపీకి… కొత్తగా ఆదాయ మార్గాలు అంతగా లేవనే చెప్పాలి. అప్పటిదాకా ఉన్న ఆదాయాల్లో క్రమానుగత పెరుగుదల తప్పించి… కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదు. ఫలితంగా నిత్యం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల బాట పట్టాల్సి వస్తోంది. ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే బాండ్ల వేలంలో పాలుపంచుకుంటూ అప్పులను సమకూర్చుకుంటూ… కష్టాల …
Read More »పుస్తకాల కోసం 10 లక్షలు ఖర్చు పెట్టిన పవన్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పుస్తకాలంటే మహా ఇష్టమన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే పలు మార్లు చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు చాలా పుస్తకాలు చదివానని.. దానివల్ల తనకు అన్ని విషయాల్లోనూ అవగాహ న ఉందని తెలిపారు. అయితే.. ఈ వ్యవహారం ట్రోల్స్‌కు కూడా దారితీసింది. అయినా.. పవన్ తగ్గలేదు. తాను చదివిన విషయాన్ని తనకు పుస్తకాల పట్ల ఉన్న ప్రేమను ఎక్కడ అవకాశం వచ్చినా …
Read More »లోకేష్ మనసులో మాట.. ఆటోమేటిక్‌గానే…!
ఒక వ్యూహం కొన్ని దారులు ఏర్పాటు చేస్తుంది. ఒక ప్రణాళిక వందల అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. మంత్రి నారా లోకేష్ మనసులోని మాట కూడా ఇదే. ఎన్నికలకు ముందు ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఆయన.. తాజాగా ఇదే విషయంపై అంతర్మథనం చెందుతున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారు. ఇదేసమయంలో వచ్చే మూడు మాసాల్లోనే స్పష్టమైన హామీ …
Read More »వాహ్: పండుగ రద్దీ నియంత్రణకు డ్రోన్లు!
సంక్రాంతి పండుగ వచ్చేసింది. అప్పుడే సెలవులు కూడా మొదలైపోయాయి. ఇంకేముంది… పట్టణాల్లోని జనం అంతా తమ సొంతూళ్లకు బయలుదేరి పోతున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి ఏపీకి వెళుతున్న వారు లక్షల్లో ఉన్నారు. వీరంతా ఒకేసారి తమ ఊళ్లకు బయలుదేరిన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి దారి తీస్తున్న రదహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. అందులోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే కోస్తాంధ్రకు అత్యధిక సంఖ్యలో జనం తరలివెళుతన్నారు. సొంతూళ్లకు వెళ్లేవారు కొందరైతే… కోస్తాంధ్రలో …
Read More »ఫాలోయింగే కాదు… ఆర్జనలోనూ మోదీనే టాప్
నరేంద్ర మోదీ… భారత ప్రధాన మంత్రి మాత్రమే కాదు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వరల్డ్ మోస్ట్ పవర్ ఫుల్ నేత కూడా. దాదాపుగా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో అత్యథిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగిన నేతగా ఇప్పటికే మోదీ రికార్డులకెక్కారు. తాజాగా ఆ సోషల్ మీడియా ఖాతాల ద్వారా… ప్రత్యేకించి యూట్యూబ్ ద్వారా అత్యథిక ఆదాయాన్ని పొందుతూ కూడా మోదీ సరికొత్త రికార్డులను నెలకొల్పారు. వ్యక్తిగత ఖాతా …
Read More »పిఠాపురం టీడీపీ వర్మ హ్యాపీ… అంత సంతోషానికి రీజనేంటి..!
పిఠాపురం వర్మగా పేరొందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఖుషీ అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఆయన ఆ తర్వాత.. ఒకింత ముభావంగానే ఉన్నారు. ఇస్తామన్న పదవిని ఇవ్వకపోగా.. కనీసం ప్రాధాన్యం దక్కడంలేదని వర్మ వగస్తున్న విషయం తెలిసిందే. పైగా జనసేన నాయకుల నుంచి కూడా ఆయనకు పలుమార్లు అవమానాలు ఎదురయ్యాయనీ వార్తలు వినిపించాయి. దీంతో వర్మ గత …
Read More »మోదీ ఊరికి చైనా అధ్యక్షుడితో అనుబంధం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో పాడ్‌కాస్ట్‌లో పాల్గొని అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. గుజరాత్‌లోని తన స్వగ్రామం వాద్‌నగర్‌కు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు మధ్య ఉన్న చారిత్రక సంబంధాన్ని గుర్తుచేశారు. ఈ అనుబంధం వెనుక బౌద్ధ యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ పాత్ర ఉందని చెప్పారు. మోదీ వివరించిన ప్రకారం, 2014లో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ప్రపంచ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates