Political News

ఒక్కొక్క సీటుకు ముగ్గురికి మించి.. కాంగ్రెస్‌కు త‌ల తిరుగుతోందిగా!

ప్ర‌స్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో కొన్ని సీట్ల‌ను కాంగ్రెస్ పార్టీ ఖ‌రారు చేసింది. అయితే.. ఖ‌రారు చేయ‌ని సీట్లే ఇప్పుడు పార్టీకి త‌ల‌కు మించిన భారంగా మారుతున్నాయి. ఇక్కడ ఒక్కొక్క స్థానం నుంచి ముగ్గురేసి చొప్పున కొన్ని స్థానాల్లో అంత‌కు మించి నాయ‌కులు నువ్వా-నేనా అనిపోటీ ప‌డుతున్నారు. అయితే, వీరికి కీల‌క నేత‌ల అండ‌దండ‌లు ఉండ‌డం.. ఢిల్లీ స్థాయిలో సిఫార‌సులు కూడా కొన‌సాగుతుండ‌డంతో ఎవ‌రికి …

Read More »

రెడ్ల‌కు గేలం.. కేసీఆర్ వ్యూహం అద‌ర‌హో!

ఎన్నిక‌లు ఎన్నిక‌లే. రాజ‌కీయాలు రాజ‌కీయాలే! ఏ ఒక్క విష‌యాన్నీ వ‌దులుకునేందుకు అధికార పార్టీ బీఆర్ ఎస్ సిద్ధంగా లేదు. అందుకే.. అందిన ప్ర‌తి విష‌యాన్నీ త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌ను దెబ్బ‌కొట్టేందుకు కేసీఆర్ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు ఆయ‌న ముమ్మ‌రం చేసిన‌ట్టు తెలుస్తోంది. రెడ్డి ట్యాగ్ ఉన్న‌వారు ఎవ‌రు వ‌చ్చినా.. వారి …

Read More »

25.. 40.. కాదు.. 60.. ఇదీ జ‌న‌సేన లెక్క‌?

ఔను! 40 కాదు.. 60 సీట్లు కావాలి! ఇదీ.. ఇప్పుడు జ‌న‌సేన లెక్క‌. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని బ‌హిరంగంగానే ప్ర‌క‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. దీనిపై త‌న పార్టీ నాయ‌కుల‌ను ఒప్పించేందుకు ఒకింత శ్ర‌మ‌ప‌డుతున్నారు. ఒంట‌రిగానే పోటీ ఉంటుంద‌ని, ప‌వ‌నే సీఎం అవుతార‌ని, ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి చేయాల‌ని భావించిన పార్టీ కేడ‌ర్‌కు పొత్తులు పెద్ద‌గా న‌చ్చ‌లేదు. 2019 ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి …

Read More »

సైకిల్ తొక్కినా నేర‌మేనా?! : లోకేష్ ఫైర్‌

వైసీపీ ముఖ్య‌నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరులో టీడీపీ సానుభూతిప‌రుల‌పై జ‌రిగిన దౌర్జ‌న్యం.. రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి కుప్పం వ‌ర‌కు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా సైకిల్ ర్యాలీ చేప‌ట్టిన టీడీపీ సానుభూతి ప‌రుల‌పై పెద్దిరెడ్డి గ్యాంగ్ రెచ్చిపోయింది. వారిని అర్థ‌న‌గ్నంగా నిల‌బెట్టి.. నానా బూతులు తిడుతూ.. బెదిరింపుల‌కు గురి చేసింది. అంతేకాదు.. ఈ ఉదంతం మొత్తాన్నీ.. వీడియో తీయించి సోష‌ల్ మీడియాలో పెద్దిరెడ్డి ముఠా …

Read More »

ఈసారి సెంటిమెంటు పండుడు క‌ష్ట‌మే: ఆన్‌లైన్ స‌ర్వే

మేం తెలంగాణ ఇచ్చామ‌ని ఒక పార్టీ. కాదు కాదు… అహ‌ర్నిశ‌లూ కొట్లాడి తెలంగాణ తెచ్చామ‌ని మ‌రోపార్టీ.. అస‌లు మేమే లేక‌పోతే.. తెలంగాణ వ‌చ్చేదా? అని ఇంకో పార్టీ! వెర‌సి రాష్ట్రం ఏర్ప‌డి ప‌దేళ్ల‌యినా.. తెలంగాణ ఏర్పాటు విష‌యం తాజా ఎన్నిక‌ల్లో మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగానే మారిపోయింది. ఆయా పార్టీల‌కు సెంటిమెంటు అస్త్రంగానే ఉప‌యోగ‌ప‌డుతోంది. ప‌ల్లె నుంచి సిటీ గ‌ల్లీ వ‌ర‌కు…సెంటిమెంటును పండించేందుకు ఆయా పార్టీల మాట‌కారులంతా.. పోగ‌వుతున్నారు. స‌రే.. ఏ పార్టీ …

Read More »

డిసెంబ‌రు 3న తెలంగాణ‌లో కాంగ్రెస్ సునామీ: రాహుల్ గాంధీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన బ‌స్సు యాత్ర తొలి విడ‌త కార్య‌క్ర‌మం ముగిసింది. ఈ యాత్ర‌లో కాంగ్రెస్ అగ్ర నేత‌లు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. బైక్ ర్యాలీలోనూ పాల్గొన్నారు. ఇక‌, బ‌స్సు యాత్ర ముగింపు సంద‌ర్బంగా రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్(ఎక్స్)లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ సునామీ సృష్టించ‌నుంద‌ని ఆయ‌న చెప్పారు. త‌న‌కు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ …

Read More »

టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్ర‌జ‌లే కోరుతున్నారు: ప‌వ‌న్

వ‌చ్చే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో తాను తీసుకున్న నిర్ణ‌యం.. త‌న‌ది కాద‌ని, ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న‌ను అనుస‌రించి తీసుకున్న నిర్ణ‌యమ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి జ‌న‌సేన ఎన్నిక‌ల‌కు వెళ్తుంద‌ని ఆయ‌న గ‌తంలోనే వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో పార్టీలో ఏర్ప‌డిన స్తబ్ద‌త‌, కీల‌క నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న మంత‌నాల నేప‌థ్యంలో ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా …

Read More »

చంద్రబాబుకు సుప్రీం కోర్టు షాక్

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ రోజు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ పై ఈ రోజు తీర్పు వస్తుందని ఆశించిన చంద్రబాబు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు నిరాశ తప్పలేదు. క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు నవంబరు 8వ తేదీకి వాయిదా వేసింది. అక్టోబర్ 21 నుంచి 29 వరకు సుప్రీం కోర్టుకు దసరా సెలవులు. ఈ కేసులో ఇరు పక్షాలు …

Read More »

ఏపీ హేట్స్ జగన్…టీడీపీ వినూత్న ప్రచారం

ఏపీకి మరోసారి సీఎం జగన్ అవసరం ఉందని వైసీపీ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే బాయ్ బాయ్ జగన్ అంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి కౌంటర్ గా టీడీపీ నేతలు తాజాగా ఓ పుస్తకాన్ని విడుదల చేశారు ‘‘ఏపీ హేట్స్‌ జగన్‌’’ పుస్తకాన్ని …

Read More »

విజయశాంతికి మెదక్.. విశ్వేశ్వర రెడ్డికి తాండూర్!

తెలంగాణ బీజేపీలోని అసంత్రుప్త వర్గాన్ని శాంతింపజేసేందుకు హైకమాండ్ రంగంలోకి దిగిందా? ఈ నాయకులకు టికెట్లతో పాటు ప్రాధాన్యతనిస్తామని చెప్పి బుజ్జగిస్తోందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించబోయే అభ్యర్థుల తొలి జాబితాలో విజయశాంతితో పాటు కొండా విశ్వేశ్వర రెడ్డి పేరు ఉందనే ప్రచారమే అందుకు నిదర్శనమని చెప్పాలి. విజయశాంతికి మెదక్, విశ్వేశ్వర రెడ్డికి తాండూర్ టికెట్ ను బీజేపీ కేటాయించిందని …

Read More »

కేటీఆర్ ఈ లాజిక్ ఎలా మర్చిపోయారు?

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బిజీలో పడిపోయారు. పార్టీని మూడో సారి అధికారంలోకి తేవడం కోసం పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై, పార్టీపై ఎలాంటి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. ప్రత్యర్థి పార్టీల ఆరోపణలను, విమర్శలను ఎప్పటికప్పుడూ తిప్పి కొడుతున్నారు. కానీ ఒక విషయంలో మాత్రం కేటీఆర్ తడబడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాజిక్ లేకుండా వ్యహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ …

Read More »

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు దక్కని ఊరట

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను నవంబర్ 8వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం పీటీ వారెంట్ పై నవంబర్ 9వ తేదీ వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఇక, నవంబర్ …

Read More »