Political News

కేంద్ర బడ్జెట్ లో ఏపీకి దక్కిందేంటి…?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంటులో నూతన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్ లో కీలక రంగాలకు భారీ కేటాయింపులే జరిగాయి. అయితే తెలుగు నేల విభజన నాటి నుంచి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో పయనం సాగిస్తున్న ఏపీకి ఈ బడ్జెట్ లో అయినా ఆశించిన మేర కేటాయింపులు దక్కాయా? అన్న దిశగా ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.  బడ్జెట్ లో …

Read More »

నెలకు లక్ష జీతమా.. అయితే పన్ను కట్టక్కర్లేద్దు

అంతా అనుకున్నట్లుగా మధ్య తరగతికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. శనివారం 2025-26 వార్షిక బడ్జెట్ ను నిర్మల ప్రశేశపెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలకు భారీ కేటాయింపులు చేసిన ఆర్థిక మంత్రి… మధ్య తరగతికి భారీ ఊరట ఇచ్చేలా సంచలన ప్రకటన చేశారు. ఏ వర్గం వారికైనా రూ.4 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేని …

Read More »

రేవంత్ కు షాకా?…ప్రీ ప్లానేనా?

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర లేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం బలహీనంగా ఉండటం… ఎన్నికలు జరిగే మూడు స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధించడం దాదాపుగా ఖాయమైపోయింది. అయితే తెలంగాణలో అలా కాదు,. అధికారంలో ఉన్నది ఒకే పార్టీ అయినా కూడా ఆ పార్టీలో సీటును ఆశిస్తున్న వారి సంఖ్య వందల్లో ఉంది. అంతేకాకుండా …

Read More »

బాబుకు ఢిల్లీ లో తెలుగు వారే టార్గెట్

మాట‌ల మాంత్రికుడు.. తెలుగు వారు ఎక్క‌డున్నా వారిని త‌న‌వైపు తిప్పుకోగ‌ల నేర్పు, ఓర్పు ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.. సీఎం చంద్ర‌బాబు. ఆయ‌న ఏ విష‌యంపైనైనా అన‌ర్గ‌ళంగా మాట్లాడగలరు. ఇక‌, పాల‌న‌, ఐటీ రంగాల గురించి అయితే మ‌రీ ఎక్కువ‌. మైకు ప‌ట్టుకుంటే వ‌దిలి పెట్ట‌ర‌న్న నానుడి ని కూడా చంద్ర‌బాబు సొంతం చేసుకున్నారు. అందుకే ఆయ‌న స్టార్ క్యాంపెయిన‌ర్ అయ్యారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో …

Read More »

ఫర్ ద ఫస్ట్ టైమ్.. పెళ్లి మండపంగా రాష్ట్రపతి భవన్

రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ చోటే లేదు. దేశ రాజధాని ఢిల్లీ నడి వీధుల్లో సువిశాల విస్తీర్ణంలో వందలాది గదులతో రాజ ప్రసాదాన్ని తలపించేలా నిర్మితమైన ఈ భవన్ ను ఒక్కసారి అయినా దర్శించి తీరాలని కోరుకోని భారతీయుడు ఉండరు. అలాంటి రాష్ట్రపతి భవన్ లో ఇప్పుడు ఓ పెళ్లి వేడుక జరగనుంది. ఈ …

Read More »

వరుసబెట్టి 8 సార్లు!… రికార్డుల నిర్మలమ్మ!

మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా 8 సార్లు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డులకు ఎక్కారు. ఇప్పటిదాకా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల… తాజాగా శనివారం 8వ సారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టి రికార్డులకు ఎక్కారు.వాస్తవానికి గతేడాదే నిర్మల ఈ రికార్డును చేరుకున్నారు గానీ.. …

Read More »

ఈ ఎమ్మెల్యే నిజంగానే ‘వెండి’ కొండ

జనంపల్లి అనిరుధ్ రెడ్డి… ఈ పేరు గడచిన రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈ రెడ్డి గారు.. 2023లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రాజకీయ రంగప్రవేశం చేశారు. వచ్చీరావడంతోనే రాజకీయాల్లో కాకలు తీరిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని చిత్తు చేసి పాలిటిక్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల అసెంబ్లీ నుంచి ఆయన …

Read More »

ఒక్కొక్కటిగా కాదు… మూడింటిని ముడేసి

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిజంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై ఇప్పటిదాకా అవాకులు చెవాకులు పేలుతున్న విపక్షాలకు ఇక మాట పెగలకుండా ఉండేలా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా కాకుండా బండిల్ గానే అమలు చేసే దిశగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంచలన నిర్ణయానికి శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ …

Read More »

లోకేశ్ గారూ… సరిరారు మీకెవ్వరూ!

రాజకీయాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ నవ శకానికి నాందీ పలికారు. నిన్నటిదాకా రాజకీయం అంటే… ఎన్నికలప్పుడే జనానికి నేతలు కనిపించే వారు. ఆ తర్వాత నేతలను వెతుక్కుంటూ జనం నానా పాట్లూ పడే వారు. ఆ పరిస్థితిని లోకేశ్ మార్చేశారు. తనను నమ్మిన జనానికి ఎంత చేసినా తక్కువేనని ఆయన భావించారు. వారి బతుకులను అందలం ఎక్కించేందుకు ప్లాన్ రెడీ చేశారు. అధికారంలో …

Read More »

పెద్దిరెడ్డి ఇలాకాలోకి జనసేన ఎంట్రీ!

ఏపీలో రాజకీయం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో అందరి అంచనాలు తలకిందులు కాగా… ఆ విస్తుగొలిపే ఫలితాలకు అనుగుణంగానే రాజకీయంగానూ పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరులో కూటమి భాగస్వామ్య పార్టీ జనసేన రేపు ఓ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. పుంగనూరు పరిధిలోని సోమలలో ఈ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. పెద్దిరెడ్డికి …

Read More »

జగన్ గడపలో టీడీపీ మహానాడు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మహానాడు పేరిట ఏటా నిర్వహిస్తున్న వేడుకలను ఈ ఏడాది వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో నిర్విహించాలని తీర్మానించారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై …

Read More »

‘ఫామ్‌హౌస్ సోది మాకొద్దు.. ద‌మ్ముంటే అసెంబ్లీకి రా!’

తెలంగాణ‌లో మ‌రోసారి రాజ‌కీయాలు హీటెక్కాయి. తాజాగా రేవంత్‌రెడ్డి స‌ర్కారుపై బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్రాజెక్టుల‌పై యుద్ధం ప్ర‌క‌టిస్తున్నాన‌ని.. ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని కేసీఆర్ చెప్పిన నేప‌థ్యంలో తాజాగా సీఎం రేవంత్ మాట‌కు మాట అన్న‌ట్టుగా స్పందించారు. ఫామ్ హౌస్‌లో కూర్చుని సోది చెప్ప‌ద్దంటూ చుర‌క‌లు అంటించారు. అస‌లు కేసీఆర్ హ‌యాంలో జ‌రిగిందేంటో లెక్క‌ల‌తో స‌హా వివ‌రించేందుకు తాము సిద్ధంగా …

Read More »