వివిధ కారణాలతో కేసీయార్ ప్రభుత్వం మీద తెలంగాణాలో చాలా వర్గాలు వ్యతిరేకంగా మారాయి. అయితే కేసీయార్ మీద మరో వర్గం ప్రత్యేకంగా మండిపోతోంది. ఈ వర్గం ఏమిటంటే గల్ఫ్ బాధిత కుటుంబాల వర్గం. తెలంగాణా నుండి గల్ఫ్ దేశాల్లో ఉపాధి, ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళ సంఖ్య సుమారు 15 లక్షలుంటుంది. అక్కడ పనిచేసి తిరిగి వచ్చేసిన వాళ్ళ సంఖ్య మరో పది లక్షలుంటుది. అంటే గల్ఫ్ దేశాలతో సంబంధాలున్న వాళ్ళు …
Read More »బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బస్సుయాత్ర
అధికార బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బస్సుయాత్ర జోరందుకుంది. ఇప్పుడు జోరందుకోవటం ఏమిటో కాంగ్రెస్ నేతలు ఎప్పటినుండో బస్సుయాత్రలు చేస్తున్నారు కదాని అనుమానం రావటం సహజమే. కానీ ఇపుడు బస్సుయాత్రలు చేస్తున్నది రాజకీయ పార్టీల నేతలు కాదు. అచ్చంగా నిరుద్యోగులు, విద్యార్ధిసంఘాల జేఏసీ నేతలు. కేసీయార్ ప్రభుత్వ వైఫల్యాలను జనాలకు వివరించే ఉద్దేశ్యంతో నిరుద్యోగులు, విద్యార్ధి సంఘాల నేతలు రెండు యాత్రలు మొదలుపెట్టారు. ఒక బస్సు ఉత్తర తెలంగాణాలో తిరుగుతుంటే, రెండో …
Read More »ఇక, మోడీ మకాం.. మార్పు వచ్చేనా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యం ఓవైపు.. ఇది సాధ్యం కాక పోతే.. కనీసం గౌరవప్రదమైన స్థానాలలో అయినా విజయం దక్కించుకోవాలనే తలంపు మరోవైపు పెట్టు కున్న బీజేపీ వ్యూహాత్మకంగానే ఎన్నికల ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి నాయకులు వస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. ఇక, ఎన్నికలకు సమయం చేరువ అవుతుండడంతో నాయకులు దూకుడు పెంచారు. ఈ నెల 30న జరగనున్న ఎన్నికలకు సంబంధించి పక్కా …
Read More »కాంగ్రెసోళ్లూ.. నన్నే సీఎంగా కోరుతున్నరు: కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీఆర్ ఎస్ అధినేత,సీఎం కేసీఆర్.. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రేవంత్ ను సీఎం అభ్యర్థిగా పేర్కొంటూ వస్తున్న వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. “ఇల్లు అలగ్గానే పండగ అయినట్టా.. మీరు చెప్పుర్రి! ఇదిగో గీడ రేవంత్ రెడ్డి సీఎం ముచ్చట కూడా …
Read More »ప్రచారం సరే… పవన్‌కు పెద్ద సంకటం ఏంటంటే!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ ఎస్‌పై నిప్పులు చెరుగుతున్న బీజేపీతో చేతులు కలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారే ఆయన ఇంటికి వెళ్లారో.. ఈయనే మనసులో ఉన్నట్టు చేశారో.. మొత్తానికి కమలంతో గ్లాసు దోస్తీ కట్టింది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఎన్నికల వేళ.. మరో ఐదారు రోజుల వరకు ప్రచార సమయం ఉంది. దీంతో సహజంగానే మిత్ర పార్టీ నుంచి ప్రచారం కోసం పవన్‌పై …
Read More »అంకెలు.. సంఖ్యలు తగ్గుతున్నాయే.. కాంగ్రెస్ గుసగుస!!
ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు 110.. నోటిఫికేషన్ వచ్చాక 100.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభ సమయానికి 90 నుంచి 100 మధ్యలో.. ప్రచారం ప్రారంభించాక.. 90.. ఇప్పుడు 80- ఇదీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్ల లెక్క!! ఇదెవరో చెప్పిన మాట కాదు.. స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్‌రెడ్డి నుంచి సీనియర్ నాయకులు తడవకోసారి చెబుతున్న అంకెలు.. సంఖ్యలు!! ఇప్పుడు ఈవిషయమే కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ చర్చగా …
Read More »ఏపీలో రౌడీల రాజ్యం.. వరంగల్ స్పూర్తితో తట్టుకుంటున్నాం: పవన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల తరఫున తొలిసారి ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మైకు పట్టారు. వరంగల్ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన విజయసంకల్ప యాత్ర బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీపైనే ఎక్కువగా ఫోకస్ చేయడం గమనార్హం. ఏపీలో రౌడీలు రాజ్యామేలుతున్నారని, గూండాల పాలన నడుస్తోందని పవన్ దుయ్యబట్టారు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడేందుకు వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమని …
Read More »కాంగ్రెస్ దే అధికారమా ? లోక్ పోల్ జోస్యం
తొందరలో జరగబోతున్న తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం ఖాయమేనా ? తాజాగా వెల్లడైన లోక్ పోల్ సర్వే ఇదే విషయాన్ని చెబుతోంది. 46 శాతం ఓటింగ్ షేరుతో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని సర్వేలో బయటపడిందట. కాంగ్రెస్ కు 69-72 సీట్లు ఖాయంగా వస్తాయని సర్వే చెప్పింది. బీఆర్ఎస్ 35-39 సీట్ల మధ్యే పరిమితమవుతుందని తేలింది. బీఆర్ఎస్ 40 సీట్లు తెచ్చుకోవటం కూడా కష్టమేనని సర్వేలో తేలినట్లు లోక్ …
Read More »ఎటుచూసినా నేరచరితులేనా ?
తెలంగాణా ఎన్నికల్లో ఇపుడొక ఆందోళనకరమైన విషయం బయటపడింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టిన వివరాల ప్రకారం వివిధ పార్టీల తరపున పోటీచేస్తున్న 360 మంది అభ్యర్ధుల్లో 226 మంది నేరచరితులేనట. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం తరపున పోటీచేస్తున్న వారిలో అత్యధికులు నేరచరితులే అన్న విషయం బయటపడింది. అంటే వీళ్ళల్లో గెలిచిన చాలామంది రేపు మన ప్రజా ప్రతినిధులుగా చట్టసభల్లో కూర్చుంటారు. చట్టసభల్లోకి నేరచరితులు ప్రవేశించకూడదన్నది మామూలు జనాల …
Read More »వారం రోజులు అగ్ని పరీక్షే..
మరో వారం రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నెల 30న పోలింగ్‌కు సర్వసిద్ధమైంది. దీంతో నాయకులు, పార్టీలు దూకుడు పెంచాయి. కానీ.. ఇన్నాళ్లయినా.. తెలంగాణ సమాజం నాడిని మాత్రం పట్టుకోలేక పోయారు. అధికార పార్టీ బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ల మధ్యే.. పోటీ తీవ్రంగా ఉంటుందని తెలిసినా.. ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారో ఇప్పటికీ స్పష్టత రాలేదు. చిట్టచివరి నిముషంలో అంచనాలు మారితే.. అప్పుడు …
Read More »ఆ వైసీపీ ఎమ్మెల్యేకు నో టిక్కెట్…!
అన్నా రాంబాబు. పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న నాయకుడు. ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే… నిత్యం ఏదో ఒక సంచలన కామెంట్‌తో మీడియా ముందుకు వచ్చే అన్నా.. ఇటీవల కాలంలో ఫుల్ సైలెంట్ అయిపోయారు. అంతేకాదు.. విమర్శల జోరు కూడా తగ్గించారు. నిజానికి స్వపక్షంలో విపక్షం అన గలిగే రేంజ్‌లో అన్నా విమర్శలు అందరికీ తెలిసిందే. ఏ పార్టీలోనూ అన్నా సంతృప్తి చెందిన …
Read More »‘పేడ’ కొంటాం.. రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీల గురించి అందరికీ తెలిసిందే. అయితే, రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఈ గ్యారెంటీల సంక్య పెరుగుతుండడం గమనార్హం. కర్ణాటకలో ఈ ఏడాది మేలోజరిగిన ఎన్నికల్లో 5 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి వీటిని 6కు పెంచింది. ఇక, ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన మిజోరాంలో అసలు ఏగ్యారెంటీ కూడా ఇవ్వలేదు. ఇక, ఛత్తీస్‌గఢ్‌లో ఎలానూ అధికారంలో ఉన్నారుకాబట్టి.. …
Read More »