తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం రెడీ అయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మహా క్రతువుకు.. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) తాంబూలాలిచ్చేసింది. దీంతో ఇప్పుడు ఎవరికి వారు.. తమను తాము మంత్రివర్గంలో చూసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. 2023, డిసెంబరులో ఏర్పడిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఆరు శాఖలు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన హోం శాఖ ఇప్పటికీ రేవంత్ రెడ్డి వద్దే ఉంది. ఇక, ఎస్సీలు, బీసీలు, …
Read More »అమిత్ షాతో ఎంపీ రాయలు భేటీ.. ఏం జరుగుతోంది?
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం జరిగిన ఓ భేటీ ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా ఓ ఫైల్ నిండా పేపర్లను పట్టుకెళ్లిన రాయలు.. వాటిని అమిత్ షాకు చూపిస్తూ.. వాటిలో కొన్నింటిని ఆయనకు అందజేస్తూ కనిపించారు. ఎంపీ రాయలు ఇచ్చిన …
Read More »బాబు పథకం దేశానికే ఆదర్శం అయ్యింది!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విజనరీ నేతే. ఈ విషయాన్ని వైరి వర్గాలు ఎంత విమర్శించినా.. ఆ విమర్శల్లో పస లేదనే చెప్పాలి. ఎందుకంటే… అధికారంలో ఉండగా చంద్రబాబు అమలు చేసిన పథకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయంటే… ఆయన విజనరీ కిందే లెక్క కదా. దేశానికి ముచ్చటగా మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ ఇప్పుడు చంద్రబాబు అమలు చేసిన పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. …
Read More »‘జగన్ 2.0’.. వైసీపీ లోకల్ టాక్ ఇదే.. !
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. 2.0పై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జగన్ 2.0 చాలా భి న్నంగా ఉంటుందని.. కార్యకర్తలకు అగ్రతాంబూలం ఇస్తామని ఆయన ప్రకటించారు. కార్యకర్తలు ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. దీంతో జగన్ 2.0పై వైసీపీలో చర్చ ప్రారంభమైంది. ఇది నమ్మ శక్యంగా లేదనికొందరు అప్పుడే పెదవివిరుస్తుండగా.. మరికొందరు నాయకులు మాత్రం 2.0 బాగానే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో …
Read More »జగన్‌పై నిప్పులు చెరుగుతున్న జైలు పక్షులు!
వైసీపీ తరఫున గత ప్రభుత్వంలో ఉండి.. పార్టీని, అప్పటి సీఎం జగన్‌ను కూడా హైలెట్ చేసిన వారు.. అదేసమయంలో అప్పటి విపక్ష నాయకులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఇష్టానుసారంగా దూషించిన వారు ఇప్పుడు జైల్లో మగ్గుతున్న విషయం తెలిసిందే. వీరిలో ఒక్క పోసాని కృష్ణమురళి మాత్రమే అతి కష్టంమీద బెయిల్‌పై బయటకు వచ్చారు. అది కూడా అనేక షరతులకు లోబడి కోర్టు.. ఆయనకు షరతులు ఇచ్చింది. ఇక, బెయిల్ రాకుండా.. …
Read More »జమిలి పక్కా.. రాసిపెట్టుకోవచ్చు!
దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయా? జరగవా? ఈ విషయంలో బీజేపీ అడుగులు ముందుకు పడతాయా? పడవా? అనే సందేహాలు తరచుగా తెరమీదికి వస్తూనే ఉన్నాయి. కానీ, మరోవైపు జమిలి ఎన్నికల బిల్లును తెరమీదికి తీసుకువచ్చారు. పార్లమెంటులోనూ ప్రవేశ పెట్టారు. దీనిపై ప్రత్యేకంగా ఆరు మాసాల పాటు అధ్యయనం కూడా జరిగిపోయింది. అయినా.. ఈ సందేహాలు మాత్రం కొనసాగాయి. దీనికి కారణం.. బీజేపీ పార్లమెంటు ఎన్నికల్లో తక్కువ సీట్లు తెచ్చుకున్న దరిమిలా.. …
Read More »వైఎస్ అవినాశ్ ఇరుక్కుపోయినట్టేనా..?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మంగళవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై సుప్రీంకోర్టు జరుపుతున్న విచారణలో ఏపీ ప్రభుత్వం మంగళవారం ఓ అదనపు అఫిడివిట్ ను దాఖలు చేసింది. అందలో కడప ఎంపీగా కొనసాగతున్నవైఎస్ అవినాశ్ రెడ్డి…ఈ కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించారని సదరు అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ కేసును తప్పుదోవ …
Read More »సిస్కో టీంలో వైసీపీ యాక్టివిస్ట్… ఇట్టే పట్టేసిన లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఒళ్లంతా కళ్లు చేసుకుని సాగతున్నారు. ఓ వైపు పార్టీ వ్యవహారాలు, మరోవైపు ప్రభుత్వ పాలన… నిత్యం బిజీబిజీగా సాగుతున్న లోకేశ్ ప్రతి విషయాన్ని చాలా లోతుగా పరిశీలిస్తూ సాగుతున్నారు. లోకేశ్ నిశిత పరిశీలన ఎంత లోతుగా ఉంటుందన్న విషయానికి నిదర్శనంగా మంగళవారం ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ కంపెనీ ప్రతినిధిగా వచ్చిన వైసీపీ …
Read More »చంద్రబాబు మాట్లాడితే.. టీవీలకు అతుక్కుపోయేవారు: మల్లారెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చిన ఆయన.. లాబీల్లో మీడియాతో సంభాషించారు. సభ జరుగుతుండగా బయటకు ఎందుకు వచ్చారని మీడియా మిత్రులు ప్రశ్నించారు. దీనికి మల్లారెడ్డి స్పందిస్తూ.. “ఏముంటదబ్బా.. సభలోని. బట్టలు విప్పుడు-కత్తులు దూసుడేగా” అని వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా.. గతంలో నిర్మాణాత్మకమైన చర్యలు జరిగేవన్నారు. సభలో దివంగత వైఎస్, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగిస్తుంటే.. …
Read More »“మూడేళ్ల తర్వాత.. జగన్ వచ్చేది జైలుకే.. స్వాగత ఏర్పాట్లు చేస్తా”
వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ సీనియర్ నాయకుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మూడేళ్ల తర్వాత.. వచ్చేది మన ప్రభుత్వమే. అప్పుడు మీకు న్యాయం చేస్తా” అంటూ.. పులివెందుల రైతులను ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు. అకాల వర్షంతో కుప్పకూలిన అరటి తోటలను పరిశీలించి, రైతులను పరామర్శించిన జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలను ఇమిటేట్ చేసిన బుచ్చయ్య …
Read More »‘తాళం` తీసేవారు లేరు.. వైసీపీ ఏం చేస్తుంది?
ఔను.. నిజమే! ఏపీలో వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ.. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసింది. ఊహించని పరాజయం… పార్టీ అధినేత జగన్ వేసుకున్న లెక్కలు దారి తప్పడం తెలిసిందే. అయితే..ఈ ప్రభావం.. పార్టీ నాయకులపై భారీగానే ప్రభావం చూపించింది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదంటూ.. జగన్‌పై నిప్పులు చెరిగిన నాయకులు ఉన్నారు. ఈ క్రమంలోనే …
Read More »ఇలాగైతే… 20 లక్షల కొలువులు ఓ లెక్కా?
ఏపీలోని కూటమి సర్కారు జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. సర్కారీ ఖజానాను గత ప్రభుత్వ పెద్దలు ఖాళీ చేయడంతో పాటుగా కొత్తగా అప్పులు పుట్టని పరిస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టేసి వెళ్లినా…టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో కూటమి సర్కారు అద్భుతాలనే చేసి చూపిస్తోంది. ఈ 9 నెలల కాలంలోనే ఏపీకి రూ.8 లక్షల కోట్ల పై చిలుకు పెట్టుబడులను ఆకర్షించిన కూటమి… వాటి ద్వారా ఏకంగా 6 …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates