గ్రీవెన్స్ స్టైల్ నే మార్చేసిన నారా లోకేశ్

గ్రీవెన్స్… అంటే ప్రజల నుంచి అందే ఫిర్యాదులను పరిశీలించడం, వాటిని పరిష్కరించడం అన్నది ప్రతి రాజకీయ నేతకూ ఓ తప్పనిసరి కార్యక్రమమే. ఆయా సమస్యలను తీర్చేది అధికారులే అయినా… వాటి పరిష్కారానికి రాజకీయ నేతల నుంచే అడుగులు పడాలి. అంతేకాకుండా ప్రజల నుంచి అందే ఫిర్యదులను స్వీకరించడం, వాటిని పరిశీలించడం, వాటి ఫరిష్కారానికి ఆదేశాలు జారీ చేయడం… ఓ రాజకీయ నేత పనితీరును ఇట్టే పట్టించేస్తాయి.

ఆయా నేతలకు గ్రీవెన్స్ సెల్ ఓ బెంచ్ మార్క్ గా నిలుస్తోంది. ఫలానా నేతకు తమ సమస్యను ఇస్తే పరిష్కారం అయిపోయినట్టేనన్న భావన కలిగితే… ఆ నేతకు ఇక తిరుగు ఉండదనే చెప్పాలి.

ఇప్పటిదాకా దాదాపుగా ఏ నేత అయినా… తన వద్దకు వస్తున్న ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వాటిని తన పీఏలు, పీఎస్ లకు అందిస్తున్నారు. వాటి పరిష్కారంపై దృష్టి సారించండి అంటూ తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటిదాకా గ్రీవెన్స్ లో జరుగుతున్నది ఇదే.

అసలు ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల్లో ఏమేం ఉంటున్నది పరిశీలిస్తున్న నేతలు దాదాపుగా లేరనే చెప్పాలి. అయితే ఆయా నేతల స్థాయి, హోదాలను బట్టి తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న భావన ప్రజల్లో కలుగుతోంది. అయితే ఈ తరహా భావనలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ పటాపంచలు చేశారు.

ప్రస్తుతం లోకేశ్ నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల స్వీకరణ ఓ మహా క్రతువుగా సాగుతోంది. మంగళగిరిలో నిత్యం ప్రజా ఫిర్యాదులను స్వీకరిస్తున్న లోకేశ్.. వాటిలో ఏఏ అంశాలు ఉంటున్నాయన్న విషయాన్ని అక్కడికక్కడే పరిశీలించి…వాటి పరిష్కారం కోసం అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేస్తున్నారు.

అంతేకాకుండా ఆయా సమస్యల పరిష్కారం ఎలా సాధ్యమన్న విషయాన్ని కూడా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న వైనం నిజగానే ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా లోకేశ్ కు అందిన ఫిర్యాదులు కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం అయిపోతున్న తీరుపైనా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఆదివారం నెల్లూరు జిల్లాలో జరిగిన మాజీ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్ కోసం వెళ్లిన లోకేశ్… తిరిగి తిరుపతికి వెళుతున్న సందర్భంగా దారి వెంట ఫిర్యాదులను పట్టుకుని పలువురు నిలుచున్న వైనాన్ని చూసి తన కాన్వాయ్ ను ఆపారు. వినతిులతో వచ్చిన వారిని దగ్గరికి పిలిచి ఒక్కొక్కరి నుంచి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా తాను నిలుచున్నది రోడ్డుపై అన్న విషయాన్ని కూడా మచిరిపోయిన లోకేశ్… ప్రతి ఫిర్యాదును అక్కడికక్కడే సమగ్రంగా పరిశీలించి… బాధితులతో మాట్లాడి.. వాటి పరిష్కారంపై తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రోడ్డుపై లోకేశ్ ఫిర్యాదులను పరిశీలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.