మోడీకి `ప‌రువు` ప్ర‌శ్న‌.. ప్ర‌పంచ దేశాల కామెంట్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి ప్ర‌పంచ దేశాల్లో భారీ ఎత్తున ప్ర‌చారం ఉన్న విష‌యం తెలిసిందే. ఆయనను అనేక దేశాలు మెచ్చుకోవ‌డం.. అనేక దేశాలు ఫాలో అవ‌డం కూడా ఇటీవ‌ల కాలంలో తెర‌మీదికి వ‌స్తున్నాయి. అలాంటి మోడీకి ఇప్పుడు పరువు ప్ర‌శ్న‌గా మారింది. ప్ర‌పంచ దేశాల నుంచే ఈ సెగ ఉత్ప న్నం కావ‌డం గ‌మ‌నార్హం. రెండు కీల‌క విష‌యాల్లో ప్ర‌ధాని ప్ర‌ధానంగా ఇబ్బందుల పాలవుతున్నారు. అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ త‌న మిత్రుడేన‌ని మోడీ చెబుతారు.

ఇటీవ‌ల అమెరికాలోనూ ప‌ర్య‌టించి వ‌చ్చారు. ట్రంప్ ఇచ్చిన విందును కూడా తీసుకున్నారు. కానుక‌లూ అందుకున్నారు. అయితే.. ఇదేస‌మ‌యంలో భార‌త‌ అక్ర‌మ వ‌ల‌స‌దారుల విష‌యంలో అమెరికా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఏమాత్రం మార‌లేదు. తాజాగా పంపించిన రెండు, మూడో విమానాల్లోనూ భార‌తీయుల‌కు సంకెళ్లు వేసే పంపించారు. ఈ ప‌రిణామాలు.. రాజ‌కీయంగా ఇంటా బ‌య‌టా కూడా.. మోడీ కి సెగపెడుతు న్నాయి. చిన్న చిన్న దేశాలే.. త‌మ పౌరుల‌ను అవ‌మానిస్తుంటే.. చూస్తూ ఊరుకోలేక పోతున్నాయి.

ఇటీవ‌ల కెన్యా దేశం.. త‌మ పౌరుల‌ను(వీరు కూడా అక్ర‌మ వ‌ల‌స‌దారులే) అమెరికా యుద్ధ విమానంలో పంప‌డాన్ని తిర‌స్క‌రించింది. అంతేకాదు.. త‌మ గ‌గ‌నత‌లంలో అమెరికా విమానాలు ప్ర‌యాణించేందుకు అనుమ‌తి కూడా నిరాక‌రించింది. కెన్యాపౌరులు దొంగ‌లు కార‌ని స్ప‌ష్టం చేసిన ఆ దేశం.. గౌర‌వంగానే పంపించాల‌ని ట్రంక్‌కు తేల్చి చెప్పింది. ఇదిలావుంటే.. తాజాగా త‌మ‌పై సుంకాలు విధించ‌డాన్ని త‌ప్పు బ‌డుతూ.. ద‌క్షిణాఫ్రికా ఏకంగా అమెరికాతో వాణిజ్య సంబంధాన్ని క‌ట్ చేసుకుంది.