మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వచ్చి వారం గడుస్తున్నా సీఎం పీఠంపై పీటముడి విప్పడంపై బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తూనే ఉన్నారు. సీఎం రేసులో ఫడ్నవీస్, షిండేలు ప్రధానంగా ఉండగా…ఏదైనా అవకాశం వస్తుందేమోనని అజిత్ పవార్ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అని ఖరారైంది. ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. డిసెంబరు 2వ తేదీన లేదంటే …
Read More »వక్ఫ్ బోర్డు రద్దుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ!!
ఏపీలో వక్ఫ్ బోర్డును సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రద్దు చేసింది…కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురాబోతోన్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపే క్రమంలోనే ఏపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డును రద్దు చేసింది…ముస్లింలకు ఈ ప్రభుత్వం ద్రోహం చేసింది..ప్రస్తుతం మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇది. కానీ, వాస్తవం అది కాదు. నిబంధనలు తుంగలో తొక్కి వైసీపీ ప్రభుత్వ హయాంలో వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసేందుకు …
Read More »ఇండియా కూటమి దెబ్బతినేలా కేజ్రీవాల్ నిర్ణయం?
దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ స్టాండ్‌ను స్పష్టంగా తెలియజేశారు. ఇండియా కూటమితో కలిసి పోటీ చేయడం అనే ఆలోచననే తమ పార్టీకి లేదని, అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులే బరిలో ఉంటారని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. రాజకీయంగా ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆదివారం మీడియాతో మాట్లాడిన …
Read More »పెద్దారెడ్డి – పెద్దిరెడ్డి.. సేమ్ టు సేమ్!
కేతిరెడ్డి పెద్దారెడ్డి 70+, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 70+.. ఇద్దరూ సీనియర్ రాజకీయ నేతలే. పైగా తమ తమ నియోజకవర్గాల్లో తాముచెప్పిందే శాసనం అన్నట్టు వ్యవహరించారు. ఈ విషయంలో పెద్దిరెడ్డి సైలెంట్ అయితే.. పెద్దారెడ్డి ‘పుష్ప’ టైపు! కానీ, ఇద్దరూ కూడా చాపకింద నీరులా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన వారే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి.. మంత్రి కూడా. దీంతో ఆయనకు చిత్తూరు వ్యాప్తంగా …
Read More »వైసీపీ ఫైర్ తగ్గుతోందా… రీజనేంటి …!
మన లోపాలను మనం గుర్తించుకోవడం విజ్ఞత. మన గొప్పలను ఇతరులు గుర్తించడం గొప్ప. కానీ, వైసీపీ అధినేత.. తనకు తానే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ.. తనకు తానే సన్మానాలు చేయాలని కోరడం ద్వారా.. వైసీపీ నాలుగు కాదు.. నలభై మెట్లు దిగజారిపోయిందన్న చర్చ సాగుతోంది. ఒకవైపు విద్యుత్ విషయంలో లంచాల వ్యవహారం తెరమీదికి వచ్చింది. దీనికి జగన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ, ఆయన ఈ విషయాన్ని వదిలేసి.. తనకు సన్మానాలు …
Read More »ఏపీ వక్ఫ్ బోర్డ్ క్యాన్సిల్… కూటమి సర్కార్ షాకింగ్ ట్విస్ట్…!
రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ వర్గాలకు కీలకమైన వక్ఫ్ బోర్డును తాజాగా కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత.. ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అప్పట్లో ఏర్పాటు చేయలేదు. దీంతో జగన్ అదికారంలోకి వచ్చిన తర్వాత.. దానిని ఏర్పాటు చేసి.. బోర్డును కూడా నియమించారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అజీజ్‌ను వక్ఫ్‌బోర్డుకు …
Read More »ఏపీలో బలమైన మీడియాతో.. బలహీన విపక్షం
ఏమాటకు ఆమాట చెప్పాల్సి వస్తే.. ఏపీలో బలమైన మీడియా ఏదంటే ఓ రెండు పత్రికలు, ఓ మూడు చానెళ్లు మాత్రమే కనిపిస్తాయి వినిపిస్తాయి. ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా.. ఈ బలమైన మీడియా బాధితుడే. ఆయనే పదే పదే ఈ విషయాన్ని చెప్పుకొనేవారు. బలమైన మీడియా కారణంగా తాము నెగ్గలేకపోతున్నామని.. అబద్ధాలు ప్రచారం చేయడంలో గోబెల్స్‌ను మించి పోతున్నారని కూడా.. వైఎస్ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే …
Read More »టీటీడీలో మరిన్ని పదవులు.. జాబితా కూడా పెద్దదే!
ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కీలకమైన పదవుల భర్తీలో కూటమి సర్కారుకు ఆపశోపాలు తప్పడం లేదు. ఇటీవలే.. టీటీడీ పాలక మండలిని సీఎం చంద్రబాబు నియమించారు. ఈ పదవుల కోసం చాంతాడంత జాబితా వచ్చింది. దీంతో తాను ముందుగానే నిర్ణయించుకున్న విధంగా చంద్రబాబు అడుగులు వేశారు. వాస్తవానికి పాలకమండలి చైర్మన్ పదవి కోసం.. పెద్ద ఎత్తున నాయకులు క్యూ కట్టారు. అయినప్పటికీ.. చంద్రబాబు ఆచి తూచి నిర్ణయం …
Read More »మోదీ, కేసీఆర్ లకు రేవంత్ సవాల్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లగచర్ల రైతుల ఆందోళన, ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రుణ మాఫీ అంటూ రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. …
Read More »పథకాలపై ఫీడ్ బ్యాక్..దటీజ్ చంద్రబాబు
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పథకాలు అందడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిని వెంటనే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ క్రమంలోనే పథకాల అమలు, సుపరిపాలన కోసం చంద్రబాబు మరో సరికొత్త విధానానికి నాంది పలికారు. పథకాలు, సేవల అమలుపై ప్రజల నుంచి అభిప్రాయాలను ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు. …
Read More »రేషన్ మాఫియాకు బాబు మాస్ వార్నింగ్
అనంతపురం జిల్లా నేమకల్లులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు రేపు ఆదివారం కావడంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. రేషన్ బియ్యం కొని విదేశాలకు అమ్ముతున్నారని, ఈ రేషన్ బియ్యం మాఫియాను వదిలిపెట్టబోమని చంద్రబాబు హెచ్చరించారు. ఎక్కడ చూసినా మాఫియా, దోపిడీ ఉందని అంతా ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు …
Read More »వెంకటరెడ్డికి జైల్లో రాజభోగం..చంద్రబాబు ఫైర్
గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక అంటూ భారీగా అక్రమాలు, దోపిడీకి వైసీపీ నేతలు పాల్పడ్డారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి వల్ల రాష్ట్ర ఖజానాకి దాదాపు 160 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో, విచారణ జరిపిన అధికారులు వెంకట రెడ్డిపై కేసు నమోదు చేశారు. దీంతో, వెంకటరెడ్డిని సెప్టెంబరులో అరెస్టు చేయగా ఆయన ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates