తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. ఫార్ములా ఈ-కారు రేసు వివాదం కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై చర్చ జరపాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ప్రభుత్వం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పినా, విపక్షాలు మాత్రం కరపడుతుండటంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. సభలో ఆందోళన చేసిన బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా విమర్శించారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరగడంతో వాతావరణం మరింత వేడెక్కింది. …
Read More »హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఫార్ములా ఈ-కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం, కేటీఆర్ పై ఎఫ్ ఐఆర్ నమోదు కావడం సంచలనం రేపింది. అయితే, సభలో ఆ వ్యవహారంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేసిన కేటీఆర్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటే కేటీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ …
Read More »తిరుమల వ్యాఖ్యలపై శ్రీనివాస్ గౌడ్పై టీటీడీ చర్యలు
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలపై టీటీడీ కఠినంగా స్పందించింది. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని బీఆర్ నాయుడు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తిరుమల పవిత్ర క్షేత్రం కావడంతో ఇలాంటి వ్యాఖ్యలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ చైర్మన్ …
Read More »ఆ కేసుపై రేవంత్ కు కేటీఆర్ సవాల్
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏకు చెందిన రూ.45 కోట్ల నిధులను విదేశీ కంపెనీలకు మళ్లించడం వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ తోపాటు కొందరు అధికారులపై ఏసీబీ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసింది. తనపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగిస్తున్న …
Read More »ఆచితూచి మాట్లాడండి..మంత్రులకు చంద్రబాబు సూచన
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్ ఫేక్ వంటి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని సద్వినియోగం చేసేవారికన్నా దుర్వినియోగం చేసేవారే ఎక్కువ. ఇక, ఒక ఉద్దేశ్యంతో నేతలు మాట్లాడిన మాటలను తమకు అనుకూలంగా ప్రచారం చేసే ప్రత్యర్థి మీడియాల సంగతి సరేసరి. ఈ క్రమంలోనే ఏపీలోని ఎన్డీఏ కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు …
Read More »కేటీఆర్ పై కేసు..అరెస్టు తప్పదా?
బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ అనుమతి లేకుండానే హెచ్ఎండీఏకు చెందిన రూ.55 కోట్ల నిధులను విదేశీ కంపెనీలకు మళ్లించారని ఆరోపిస్తున్నారు. ఆనాటి మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగిందని ఆరోపణలు రావడంతో తాజాగా కేటీఆర్ పై కేసు నమోదైంది. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ పై ఏసీబీ అధికారులు …
Read More »వైసీపీకి ప్రమోటర్స్ కావలెను… !
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల అవసరం ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుత రాజకీయాల్లో చేయాల్సింది చెప్పుకొంటున్నారు. ఇదేసమయంలో చేసింది చెప్పుకోవడం తప్పుకాదు. నిజానికి ప్రమోటర్ల విషయంలో సీఎం చంద్రబాబు అతిపెద్ద పొలిటికల్ ప్రమోటర్. ఆయన ఇప్పటికీ తన 1995ల నాటి పాలనను ప్రమోట్ చేసుకుంటూనే ఉన్నారు. ఎక్కడ అవకాశం వచ్చినా.. కాదు, …
Read More »వైసీపీ హయాంలో వ్యూహం సినిమాకు 2.15 కోట్లు
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ తరపున 2.15 కోట్ల రూపాయలు చెల్లించారని వెల్లడించారు. ఇక ఈ డబ్బులు వ్యూస్ ప్రకారం చెల్లించాలన్న ఒప్పందం మేరకు చెల్లింపులు జరిగాయని చెప్పారు. అయితే, ఆ సినిమాకు …
Read More »పోలీస్ స్టేషన్ లో రచ్చ..అంబటిపై కేసు
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అయితే, కొన్నిసార్లు తన దూకుడుకు కళ్లెం వేయలేక అంబటి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా ఇదే దూకుడు చూపించిన అంబటిపై గుంటూరు పోలీసులు కేసు పెట్టారు. తాము ఇచ్చిన కంప్లయింట్ లపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పాలంటూ పట్టాభిపురం పోలీసులతో అంబటి వాగ్వాదానికి దిగడంతో ఆయనపై కేసు నమోదైంది. ప్రతిపక్ష …
Read More »రాహుల్తో తోపులాట: బీజేపీ ఎంపీకి గాయం
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడటంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గురువారం పార్లమెంట్ ఆవరణలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో సారంగి కిందపడి తలకు గాయమైంది. సిబ్బంది వెంటనే ఆయనను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. సారంగి మీడియాతో మాట్లాడుతూ, “రాహుల్ …
Read More »అమిత్ షాకు షర్మిల కౌంటర్
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. అంబేద్కర్ పేరు పదే పదే ప్రస్తావించడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయిందని, దాని బదులు ఏదైనా భగవంతుడి పేరు స్మరిస్తే మోక్షం లభిస్తుందని షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే షా వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అంబేద్కర్ అమిత్ …
Read More »పార్లమెంటు ముందే అధికార-ప్రతిపక్షాల నిరసన
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన.. అందరూ విచారించాల్సిన ఘటన చోటు చేసుకుంది. భారత పార్లమెంటు ముందు.. భవనం పైకి కూడా ఎక్కి అధికార-ప్రతిపక్షాల సభ్యులు పోటా పోటీగా నిరసనకు, ఆందోళనకు దిగారు. ఇలా జరగడం 75 సంవత్సరాల పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారి. సాధారణంగా ప్రభుత్వ పక్షాన్ని విమర్శిస్తూ.. ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతాయి. కానీ, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates