పార్టీ పరంగా చూసుకుంటే.. కాంగ్రెస్ అతి పెద్ద జాతీయ పార్టీ. పైగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికా రంలోకి రావాలని భావిస్తున్న పార్టీ కూడా. మరీ ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్ర విభజనతో.. ఏపీలో తీవ్రంగా నష్టపోయిన పార్టీ. అయితే.. ఇప్పుడు ఇచ్చామని చెబుతున్న తెలంగాణలో పదేళ్ల తర్వాత.. పార్టీ అధికా రంలోకి వచ్చింది. ఇక్కడ రేవంత్‌ను సీఎంను కూడా చేయనుంది. అయితే.. ఈ సమయంలోనే ఏపీలోనూ విస్తరించాలనేది పార్టీ ప్రణాళిక. …
Read More »మీతో వేగలేను.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు!
ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులను ఆయన లైన్లోకి తీసుకున్నారు. “చెప్పం డి.. మీ మీ ప్రాంతాల్లో తుఫాను నష్టం ఎంత జరిగింది? మీమీ ప్రాంతాల్లో ఎంతమందిని శిబిరాలకు తరలించారు. వైద్య ఆరోగ్య సేవలు ఎలా ఉన్నాయి. శిబిరాల్లో ఉన్నవారికి సహాయక చర్యలు అందుతున్నా యా? ” అని ఆరా …
Read More »చంద్రబాబు 2.0
మళ్ళీ చంద్రబాబునాయుడు దూకుడు పెంచుతున్నట్లే ఉన్నారు. మిచౌంగ్ తుపాను బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం ఫెయిలైందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తుపాను సహాయక చర్యలు తీసుకునే విధానాన్ని ప్రభుత్వానికి గుర్తుచేశారు. హుద్ హుద్ తుపాను, తిత్లీ తుపాను సందర్భంగా తాను వ్యవహరించిన విధానాన్ని ప్రస్తావించారు. సరే ఈ విషయాన్ని వదిలేస్తే ఈనెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. అధికార వైసీపీ దొంగఓట్లను చేర్పిస్తోందని పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆధారాలతో …
Read More »కాంగ్రెస్ ముందుంది ఇంకో పరీక్ష
తొందరలోనే కాంగ్రెస్ పార్టీ మరో పెద్ద పరీక్షను ఎదుర్కోబోతోంది. అదేమిటంటే లోక్ సభ ఎన్నికలు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్-మే నెలలో పార్లమెంటు ఎన్నికలు జరగాల్సుంది. అయితే తాజాగా ఐదు రాష్ట్రల్లో మూడింటిలో విజయంసాధించిన బీజేపీ మంచి ఊపుమీదుంది. కాబట్టి షెడ్యూల్ కన్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగినా ఇంక మిగిలున్నది పట్టుమరి ఐదు నెలలు మాత్రమే. తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడి …
Read More »‘చలో ఢిల్లీ’.. కాంగ్రెస్‌పై కేటీఆర్ వ్యాఖ్యలు
తెలంగాణలో పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం.. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. ఫలితం వెల్లడైన వెంటనే ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించేస్తారని, దీంతో కాంగ్రెస్‌పై ఉన్న ముఖ్యమంత్రి ఎంపికలో తర్జన భర్జన అనే అపవాదు తొలుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే.. తెలంగాణలోనూ అది సాధ్యం కాలేదు. క్షేత్రస్థాయిలో తెలంగాణ నేతలను కూర్చోబెట్టి చర్చించినా.. ఫలితం కనిపించలేదు. దీంతో ఎట్టకేలకు ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకున్నారు. ఢిల్లీ స్థాయిలోనే …
Read More »రేవంత్ రెడ్డి సీఎం…అఫీషియల్
2 రోజుల ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెరదించింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హై కమాండ్ ఎన్నుకుందని కాంగ్రెస్ నేత కేసీ వేణు గోపాల్ అధికారికంగా ప్రకటించారు. సీఎల్పీ నేతగా ఎంపికైన రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీ ఉదయం 10.28 నిమిషాలకు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన తెలిపారు. కేబినెట్ కూర్పుతో పాటు పోర్ట్ ఫోలియోల కేటాయింపుల కోసం …
Read More »తిరుమలలో నాసిరకం భోజనం వివాదం
సీఎం జగన్ పాలనలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట దెబ్బతింటోందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. తిరుమలలో అన్యమత ప్రచారం ఆరోపణలు, ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం, టీటీడీ భూముల వేలంపాటకు ప్రభుత్వం పూనుకోవడం, సప్తగిరి మాసపత్రిక వ్యవహారం, ఎస్వీబీసీ మాజీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ ఆడియో టేపు దుమారం..వంటి అంశాలతో కలియుగ దైవం వెంకన్న ప్రతిష్టను జగన్ సర్కార్ మసకబారుస్తోందని …
Read More »గతంలో జగన్.. ఇప్పుడు రేవంత్.. రేపు బాబు?
అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఓ చిత్రం .. ఈ విషయాన్ని ఆసక్తిగా మార్చింది. కీలక నాయకులు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత.. సహజంగానే వారిపై సింపతీ వస్తుంది. ఇది ఏకంగా వారిని అధికారం వరకు నడిపించడం ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. సదరు నాయకులు ఏ కేసులో జైలుకు వెళ్లారన్నది ఇక్కడ ప్రధానం కాదు.. తమ నాయకుడిని జైలు పాలు చేశారు!అనేదే …
Read More »ఆరు ఎంఎల్సీలు ఖాళీయా ?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఏర్పడగానే ఆరు ఎంఎల్సీ ఖాళీలను భర్తీ చేయబోతోంది. రెండు స్ధానాలు ఇప్పటికే ఖాళీగా ఉండగా దీనికి అదనంగా మరో నాలుగు స్ధానాలు ఖాళీలు కాబోతున్నాయి. కారణం ఏమిటంటే ఎంఎల్సీలుగా ఉన్న నలుగురు నేతలు ఎంఎల్ఏలుగా పోటీచేసి గెలవటమే. ఈ నలుగురిలో ముగ్గురు బీఆర్ఎస్ నుండి ఒకరు కాంగ్రెస్ నుండి గెలిచారు. అంతకుముందే రెండు స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. సో మొత్తం మీద ఆరు స్ధానాలను భర్తీ …
Read More »కేసీయార్ సభకు వస్తారా ?
ఇపుడీ అంశంమీదే చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాగూ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. మహాయితే సమావేశాలు ఓ ఐదురోజులు జరిగితే ఎక్కువ. సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్నది ముఖ్యంకాదు. జరిగే సమావేశాలకు కేసీయార్ హాజరవుతారా లేదా అన్నదే కీలకం. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పాటించాల్సిన కనీసపాటి ప్రోటోకాల్ ను కూడా పాటించలేదు. మామూలుగా ఓడిపోయిన తర్వాత రాజ్ భవన్ కు వెళ్ళి గవర్నర్ ను కలవటం …
Read More »తెలంగాణ ఎన్నికలకే ఇంత.. ఏపీ ఎన్నికలైతే ఇంకెంత?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంరంభం ముగిసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు.. మూడు ప్రధాన పార్టీలు.. వెరసి.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఘట్టం పూర్తయిపోయింది. కానీ, ఎన్నికల వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. ఈ ఎన్నికల వ్యవహారం.. ఇంకా చర్చకు వస్తూనే ఉంది. దీనికి కారణం.. నాయకులు, పార్టీల మధ్య చెలరేగిన మాటల మంటలు.. జంపింగుల యుద్ధాలు.. ట్విస్టులు, కౌంటర్లు.. ఒక్కటేమిటి.. అన్నీ ఇన్నీకావు. ఏకంగా ఎన్నికల సంఘంతో మొట్టికాయలు …
Read More »ఎంపీల లెక్క సరిపోయిందా ?
తాజాగా జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ తరపున పోటీచేసిన ఆరుగురు ఎంపీల లెక్క సరిపోయింది. లెక్కసరిపోవటం అంటే ముగ్గురు ఎంపీలు ఓడిపోయి మరో ముగ్గురు ఎంపీలు గెలిచారు. కాంగ్రెస్ తరపున ఎంపీలుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంఎల్ఏలుగా పోటీచేసి గెలిచారు. అలాగే బీజేపీ తరపున పోటీచేసిన ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ఓడిపోయారు. రేవంత్ …
Read More »