ఈనెల 30వ తేదీన ఉస్మానియా యూనివర్సిటిలో విజయోత్సవ సభ జరగబోతోంది. యూనివర్సిటిలోని ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియంలో నిరుద్యోగుల జేఏసీ విజయోత్సవ సభ జరపబోతున్నట్లు జేఏసీ ఛైర్మన్ భీమ్ రావు నాయక్ ప్రకటించారు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ ఎందుకు జరుగుతోందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా. బీఆర్ఎస్ ఓడిపోయినందుకు నిరుద్యోగ విజయోత్సవ సభ జరగటంలో తప్పేమీలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటమిలో నిరుద్యోగుల జేఏసీ పాత్ర …
Read More »గులాబీ నేతల్లో రివ్యూల గుబులు?
రోజురోజుకు గులాబీ నేతల్లో గుబులు జరిగిపోతున్నట్లు ఉంది. కారణం ఏమిటంటే రేవంత్ రెడ్డి సమీక్షల తీరు చూస్తుంటే తొందరలోనే తాము కచ్చితంగా టార్గెట్ అవుతామని కొందరు గులాబీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోందట. గడచిన మూడు రోజులుగా రేవంత్ సమీక్షలు నిర్వహించిన శాఖల్లో విద్యుత్ శాఖ చాలా కీలకమైనది. అలాగే తొందరలోనే ధరణి పోర్టల్ పనితీరుపైన కూడా సమీక్ష జరపబోతున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు …
Read More »తమ్ముళ్ళలో టెన్షన్ పెరిగిపోతోందా?
చంద్రబాబునాయుడు చేస్తున్న వ్యాఖ్యలతో తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. ఇంతకీ చంద్రబాబు ఏమంటున్నారంటే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తానని. తాను చేయించుకుంటున్న సర్వేల్లో పాజిటివ్ రిజల్టు వచ్చిన వారికి మాత్రమే టికెట్లిస్తానని కచ్చితంగా చెబుతున్నారు. రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి కాబట్టి టికెట్ల విషయంలో తాను జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మొహమాటాలకు పోయి ఎవరికి పడితే వాళ్ళని అభ్యర్ధులుగా ఎంపికచేసేది లేదని స్పష్టంగా చెప్పేశారు. మామూలుగా అయితే చంద్రబాబు నోటివెంట ఇలాంటి …
Read More »నెక్స్ట్ టార్గెట్ ధరణేనా?
బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు అర్ధమవుతోంది. ముందు విద్యుత్ శాఖ వ్యవహారాలపై సమీక్ష మొదలుపెట్టగానే అందులోను అవకతవకలు బయటపడ్డాయి. సమీక్షలో ఉన్నతాధికారులు బయటపెట్టిన వివరాల ప్రకారం విద్యుత్ శాఖ రు. 85 వేల కోట్ల అప్పుల్లో ఉందని తేలింది. అలాగే జెన్ కో, ట్రాన్స్ కో లో జరిగిన అనేక అక్రమాలు కూడా మెల్లిగా బయటపడుతున్నాయి. విద్యుత్ శాఖ సమీక్ష తాలూకు వేడి …
Read More »రేవంత్ ప్రమాణ స్వీకార సభలో తళుక్కుమన్న ఆమె ఎవరు?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసే వేళలో.. అతిరథ మహారధులు ఉన్న వేదిక మీద.. రాహుల్ గాంధీ.. ప్రియాంక వాద్రా వెనుక కూర్చున్న ఒక మహిళ మీదకు కెమేరా కళ్లు చాలాసార్లు ఫోకస్ అయ్యాయి. తెలుగుప్రాంతంలో ఎప్పుడూ కనిపించని ఆమె ఎవరు? చూసినంతనే ఆకర్షణీయంగా ఉన్న ఆ వీవీఐపీ ఎవరు? అన్న మాట రాజకీయ వర్గాల్లో ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం వెతికినప్పుడు ఆసక్తికర సమాధానం బయటకు …
Read More »రేవంత్ దెబ్బ.. మెట్రో రైళ్లు బోసి పోయాయి
తెలంగాణలో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీ రావడంతోనే మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వయసుతో నిమిత్తం లేకుండా.. అందరికీ ఉచిత ప్రయాణం చేరువైంది. ఇది ఒకరకంగా.. అసలే కష్టాల్లో ఉన్న ఆర్టీసికి పెను భారమే అయినా.. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్కు మాత్రం మైలేజీని పెంచేసింది. ఇక, కాంగ్రెస్ తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఫ్రీ రవాణా సదుపాయం అందుబాటు లోకి …
Read More »మంత్రిగా ఉన్నప్పుడు.. లంచాలు తీసుకున్నా: బాలినేని
వైసీపీ కీలక నాయకుడు, ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు తాను ఏదైనా పనిమీద వచ్చిన వారు డబ్బులు ఇస్తే(లంచాలు) తీసుకు న్నానని చెప్పారు. అంతేకాదు.. తాను తీసుకున్న సొమ్ము వెయ్యి కోట్లు ఉంటుందని చెబుతున్నారని.. అంత లేదని.. కావాలంటే లెక్కేసుకోవచ్చవని వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడు తూ… సీఎం జగన్పై నా విమర్శలు గుప్పించారు. 30 ఏళ్లనుంచి రాజకీయాల్లో …
Read More »జనసేన-టీడీపీ పొత్తును ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే
వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తామని.. ఈ విషయంలో ఎలాంటి తర్జన భర్జనలకు తావులేదని.. టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తేల్చి చెప్పారు. ఈ విషయంలో మరోసారి తాను చెప్పేదేమీ ఉండదన్నారు. జనసేన-టీడీపీ పొత్తును ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు పార్టీ అవసరం ఎంతో ఉందన్నారు. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా …
Read More »కేసీఆర్ను నమ్మి.. నట్టేట మునిగారే..
సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయనకు వీర విధేయులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు అడుగడుగునా మడుగులు ఒత్తారు. ఆయన కనుసన్నల్లో పడేందుకు.. ఆయన ప్రాపు కోసం పరితపించారు. ఆయనను చూసుకుని.. తమకు తిరుగులేదని భావించారు. అయితే.. ఇప్పుడు వీరి పరిస్తితి అడకత్తెరలో పడిపోయింది. వారేమీ రాజకీయ నాయకులు కారు.. రాజకీయ వాసనలు కూడా లేవు. వారే.. ఉన్నతస్థాయి ఐఏఎస్ అధికారులు. వీరిలో ఒకరు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ …
Read More »టికెట్ కోసం పోటీ పెరిగిపోతోందా ?
రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం తెలుగుదేశంపార్టీలో పోటీ పెరిగిపోతోంది. ఇంతకీ పెరిగిపోతున్న పోటీ ఎక్కడంటారా ? కడప జిలా రాయచోటి నియోజకవర్గంలో. ఇప్పటికి ముగ్గురు నేతలు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వైసీపీ తరపున గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎంఎల్ఏగా ఉన్నారు. శ్రీకాంత్ గడచిన నాలుగు ఎన్నికల్లో గెలుస్తునే ఉన్నారు. నిజం చెప్పాలంటే శ్రీకాంత్ చాలా బలమైన నేతనే చెప్పాలి. వైసీపీ ఎంఎల్ఏని ఎదుర్కోవటం మామూలు …
Read More »ప్రొటెం స్పీకర్ గా ఒవైసీ: బీజేపీ ఎమ్మెల్యేలు బాయ్కాట్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి శాసన సభ సమావేశాలు మొదలయ్యాయి. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ చేతుల మీదుగా అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సీఎం రేవంత్ రెడ్డి మొదట ప్రమాణం చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. తొలిసారిగా సభలో 51 మంది ఎమ్మెల్యేలు అడుగుపెట్టగా..ఈ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు …
Read More »అసెంబ్లీలో ‘కరెంట్ వార్’ తప్పదా ?
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోయే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే కరెంటు వార్ తప్పేట్లు లేదు. ఎందుకంటే ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినా ముఖ్యమైనది మాత్రం కరెంటు సరఫరా అంశమే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు ఉండదని, వ్యవసాయ కరెంటు కూడా ఉండదని కేసీయార్, కేటీయార్, హరీష్ రావులు గొంతుచించుకున్నారు. ఇదే సమయంలో కేసీయార్ ప్రభుత్వం కూడా 24 గంటల కరెంటు …
Read More »