నారా లోకేష్ కొత్త ఐడియా.. వారికి చేతినిండా సొమ్ములు!

మంత్రి నారా లోకేష్ కొత్త ఐడియా వేశారు. నైపుణ్య శిక్ష‌ణ‌లో భాగంగా రాష్ట్రంలోని వైద్య వృత్తిలో ఉన్న న‌ర్సుల‌కు విదేశీ భాష‌ల‌పై శిక్షణ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఫ‌లితంగా రాష్ట్రంలో న‌ర్సింగ్ చ‌దువుతున్న యువ‌తీ యువ‌కుల‌కు.. విదేశాల్లో కూడా అవ‌కాశాలు అందిపుచ్చుకునేందుకు పెద్ద అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు అవుతుంద‌ని మంత్రి చెబుతున్నారు. త‌ద్వారా.. చేతి నిండా సొమ్ములు చేకూరుతాయ‌ని అంటున్నారు.

తాజాగా ఒప్పందం..

న‌ర్సుల‌కు విదేశీ భాష‌ల్లో శిక్ష‌ణ కోసం.. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, స్కిల్-బీ మ‌ధ్య ఎంవోయూ కుదిరింది. నారా లోకేశ్‌ సమక్షంలో ఇరుపక్షాలు ఎంఓయుపై సంతకాలు చేశాయి. త‌ద్వారా.. జ‌ర్మ‌నీ భాష ను ఏపీ న‌ర్సుల‌కు నేర్పిస్తారు. దీంతో జ‌ర్మ‌నీ వెళ్లి ఉద్యోగాలు చేసేందుకు వారికి అవ‌కాశం చిక్కు తుంది. ప్ర‌స్తుతం వైద్యానికి ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇస్తున్న జ‌ర్మ‌నీలో న‌ర్సుల కొర‌త వెంటాడుతోంది. దీనిని అందిపుచ్చుకుని ఏపీ నుంచి అధికారికంగా జ‌ర్మ‌నీ వెళ్లేందుకు వారికి అవ‌కాశం చిక్కుతుంది. త‌ద్వారా.. చేతి నిండా సొమ్ములు అంద‌డంతో పాటు.. విదేశీ ఉద్యోగాలు కూడా ల‌భించ‌నున్నాయి.

జ‌ర్మ‌నీనే కాదు!

ఏపీలోని న‌ర్సింగ్ కాలేజీల్లో వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి చేరే విద్యార్ధుల‌కు విదేశీ భాష‌ను క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించింది. వీటిలో ఇంగ్లీష్‌(ప్రామాణిక భాష‌), జ‌ర్మ‌నీ, జ‌పాన్‌, చైనా, ఉర్దూ(దుబాయ్‌), స్విస్ భాష‌ల్లో త‌ర్ఫీదు ఇవ్వ‌నున్నారు. త‌ద్వారా.. వైద్యం, ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ల‌కు అమెరికా.. స‌హా ఇత‌ర దేశాలు ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఏపీ నుంచి విద్యార్థుల‌ను అక్క‌డ‌కు పంపించే ప్ర‌య‌త్నం చేస్తారు. దీంతో భారీ సంఖ్య‌లో ఉపాధి, ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి.

ప్ర‌స్తుతం..

ప్ర‌స్తుతం వైద్య వృత్తిలో ఉన్న న‌ర్సులు, వైద్యుల‌కు కూడా.. భాషా ప‌ర‌మైన స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నా యి. 100 మందిలో కేవ‌లం 40 మందికి మాత్రం ఆంగ్ల ప్రావీణ్యం ఉంటోంది. దీంతో వీరికి ఇంగ్లీష్‌లో మ‌రింత త‌ర్ఫీదు ఇవ్వ‌నున్నారు. అదేవిధంగా వారి ఇష్టానుసారంగా న‌చ్చిన విదేశీ భాష‌ను నేర్ప‌నున్నారు. త‌ద్వారా.. వారికి దేశంలోనే కాకుండా.. విదేశాల్లోనూ న‌ర్సింగ్‌లో మంచి అవ‌కాశాలు ల‌భించేలా ప్ర‌భుత్వం ప్రోత్స‌హించ‌నుంది.