ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్.. గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఎన్ని కల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇరువురి ఓటు హక్కు మంగళగిరి పరిధిలో ఉండడంతో వారుఇక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కువ మంది ఓటర్లు వచ్చి తమ హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్‌లు ఓటు వేయాల్సిన బూతులోనూ ఎక్కువ మంది క్యూలో ఉన్నారు.
దీనిని గమనించిన చంద్రబాబు.. తాను కూడా.. తొలి నుంచి క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించు కున్నారు. నారా లోకేష్, చంద్రబాబు ఇద్దరూ తాడేపల్లిలో ఏర్పాటు చేసిన బూత్‌లో ఓటు వేశారు. ఇదిలా వుంటే.. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీమాజీ మంత్రి, సీనియ ర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు బరిలో ఉన్నారు.
వాస్తవానికి 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ఆలపాటి, కేఎస్‌ల మధ్యే తీవ్రమైన పోటీ నెలకొంది. వైసీ పీ కేఎస్‌కు పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా మద్దతిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పోరు తీవ్రంగా మారిం ది. మరోవైపు.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఓటు వేయలేకపోయారు. ఆయన ఓటు హక్కు.. కడపలోనే ఉండిపోయింది. వాస్తవానికి.. గతంలో చంద్రబాబు ఓటు కూడా కుప్పంలో ఉండేది. కానీ, ఆయన గత ఎన్నికల్లో మంగళగిరికి మార్చుకున్నారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం చిక్కింది.