టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య…రాజకీయాల్లో ఇప్పటికే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. తనను వరుసబెట్టి గెలిపిస్తూ వస్తున్న హిందూపురం ప్రజల అభివృద్ధే లక్ష్యంగా బాలయ్య సాగుతున్నారు. ఇలాంటి క్రమంలో హిందూపురం మునిసాలిటీపైనా టీడీపీ జెండాను ఎగురవేసి బాలయ్య తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. వాస్తవానికి హిందూపురం మునిసిపాలిటీకి వైసీపీ …
Read More »నాడు-నేడు…. కూటమికే కాపీ రైట్.. !
వైసీపీ అధినేత జగన్ పాలనా కాలంలో తీసుకువచ్చిన నాడు-నేడు అనే మాట ఇప్పుడు కూటమి సర్కారు చక్కగా వినియోగించుకుంటోందా? ఈ విషయంలో జగన్‌ను వెనక్కి నెట్టేసిందా? ఇక, నుంచి ప్రతి విషయంలోనూ నాడు-నేడుతోనే జగన్‌కు కౌంటర్ ఇవ్వనుందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. వైసీపీ హయాంలో నాడు-నేడు అనే నినాదం భారీగా మార్మోగింది. పాఠశాలలను గత చంద్రబాబు(2014-19) హయాం కన్నా ఎక్కువగా మెరుగు పరిచామని.. గతంలో ఏం చేయలేదో..ఇ ప్పుడు …
Read More »ఢిల్లీలోనూ చంద్రబాబు ‘విజన్’ మంత్రం
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 5న ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమి తరఫున చంద్రబాబు బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. విజన్ మంత్రాన్ని జపించారు. 1995లో విజన్-2020 పేరు తో తీసుకున్న ఆర్థిక ఫలాలు.. హైదరాబాద్‌ను ఇప్పుడు అగ్ర ఆదాయ నగరంగా …
Read More »బడ్జెట్ విషయంలో జగన్ మౌనం.. రీజనేంటి..!
తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పై అన్ని వర్గాలు స్పందించాయి. రాజకీయ వర్గాల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు అందరూ స్పందించారు. ఎవరి నచ్చిన అభిప్రాయం వారు వెల్లడించారు. దీనిలో తప్పులేదు. బడ్జెట్ అనేది.. అన్ని వర్గాలను సంతృప్తి పరచాలని ఏమీ లేదు. ఉన్నంతలో దేశానికి, ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ కూర్పు ఉంటుంది. దీంతో ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయంలో …
Read More »జగన్ ఎంట్రీ.. వైసీపీలో మిస్సింగ్స్.. !
వైసీపీ అధినేత జగన్ తన బ్రిటన్ పర్యటన ముగించుకుని చాలా రోజుల తర్వాత ఏపీకి వస్తున్నారు. వాస్తవానికి ఆయన నాలుగు రోజుల కిందటే బ్రిటన్ పర్యటన ముగించుకున్నారు. అక్కడ నుంచి నేరుగా బెంగళూరు ప్యాలస్‌కు చేరుకున్నారు. విశ్రాంతి అనంతరం.. తాజాగా సోమవారం తాడేపల్లికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో వైసీపీలో భారీ ఎత్తున జోష్ కనిపిస్తుందని అందరూ అనుకుంటారు. మా నాయకుడొచ్చాడంటూ.. పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారని కూడా భావిస్తారు. కానీ, …
Read More »చంద్రబాబు భూమికే ఎసరు పెట్టేశారే!
వైసీపీ పాలనలో ఏపీలో భూముల అన్యాక్రాంతం యథేచ్చగా సాగిందన్న ఆరోపణలు ఒకింత గట్టిగానే వినిపించాయి. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన మొదలయ్యాక సదరు అక్రమాలన్నీ ఒక్కొక్కటిగానే బయటకు వస్తున్నాయి. ఫలితంగా ఏపీలో తమది కాని భూమి వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది. అలాంటిది టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పేరిట ఉన్న భూమినే కొట్టేసేందుకే కొందరు యత్నించిన ఘటన ఆశ్చర్యానికి గురి …
Read More »సలహాదారులు వచ్చేస్తున్నారు.. బాబు తాంబూలం వారికే.. !
రాష్ట్రంలోని కూటమి సర్కారు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులను మాత్రమే భర్తీ చేస్తోంది. అయితే.. ఈ క్రమంలో సీఎం విచక్షణ మేరకు జరిగే సలహాదారుల నియామకం విషయంలో ఒకటి రెండు మాత్రమే ఇప్పటి వరకు జరిగాయి. కన్నయ్య నాయుడును జలవనరుల సలహాదారుగా గత ఏడాదే నియమించారు. ఇక.. ఆ తర్వాత.. పెద్దగా ఈ సలహాదారుల జోలికి పోలేదు. కానీ, ఇప్పుడు ఈ దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ …
Read More »విజయ వారధి రెడ్డి.. విజయమ్మ ఎంట్రీ..?
“రాజకీయాలు కుళ్లిపోయాయి. ఆయన మా తండ్రి అని చెప్పుకొనేందుకు సిగ్గుపడుతున్నా” ఓ 15 ఏళ్ల కిందట కర్ణాటకలో జరిగిన రాజకీయం ఇది! కీలక నేత ఒకరు తన కుర్చీని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో చివరకు తండ్రితోనే విభేదించారు. సో.. విషయం ఏంటంటే రాజకీయాల్లో ఇలా జరుగుతుందని కానీ, ఇలానే జరగాలని కానీ ఎవరూ చెప్పరు. ‘రాజకీయాలకు ఊసరవెల్లికి మధ్య అవినాభావ సంబంధం ఉంది’ అంటాడు మార్క్స్. ఎవరి అవసరం-ఎవరి అవకాశం …
Read More »మోదీకి నిర్మలనే ‘ఛాయిస్’ ఎందుకయ్యారంటే..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చుట్టూ బీజేపీకి చెందిన హేమాహేమీలు ఉంటారు. దాదాపుగా వారంతా ఉత్తరాదికి చెందిన వారే. దక్షిణాదికి చెందిన నేతలు మోదీ నీడలో ఎదగడం అంటే… నూటికో, కోటికో ఒక్కరు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు రాజకీయాల నుంచి తప్పుకున్నాక.. దక్షిణాదికి చెందిన బడా నేత ఢిల్లీలోనే లేరనే చెప్పాలి. అందులోనే మోదీ కోటరీ సౌత్ నేతలను అంతగా దగ్గరకు కూడా రానివ్వట్లేదు. అయితేనేం… …
Read More »పెద్దిరెడ్ది అయినా!… పిచ్చిరెడ్డి అయినా!
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. పుంగనూరు పరిధిలోని సోమల మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ సభకు జన సైనికులు భారీ సంఖ్యలోనే తరలివచ్చారు. జనసైనికుల నినాదాలతో సోమల మారుమోగిపోయింది. ఈ సభతో పుంగనూరులోనే కాకుండా ఆ పరిసర నియోజకవర్గాల జనసైనికులకు కూడా మంచి జోష్ ను …
Read More »కోటి తీసుకుంటే.. సూటుతోనే రావాలా?
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడ్డాయి. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అయితే నవ్వినవ్వి చస్తే బాధ్యత మాది కాదు అంటూ మరింతగా పేట్రేగిపోయారు. ఆ ట్రోలింగ్ కు రాయచోటికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ యువరాజు యాదవ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా ఆయన తనదైన సమాధానంతో …
Read More »‘తిరుగుబాటు’ సూత్రధారి ‘వెండి’ కొండేనట
తెలంగాణలోని అదికార కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగిరిందని, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారన్న వార్తలు శనివారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ భేటీ జరిగిన మాట వాస్తవమేనని శనివారానికే తేలిపోయింది. ఈ బేటీకి వెండి కొండ అని జనమంతా చెప్పుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేతృత్వం వహించారట. ఈ మాటను అనిరుధ్ రెడ్డి మాటలే చెప్పేశాయి. ఈ భేటీపై …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates