ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడో సారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏపీ పర్యటనకు వచ్చారు. బుధవారం విశాఖ వచ్చిన ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజా వేదిక పేరిట ఆంధ్రా వర్సిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ వేదిక మీద ఏపీలో చేపట్టిన, చేపట్టనున్న పలు అభివృద్ధి పథకాలకు మోదీ …
Read More »తిరుపతి క్యూలైన్లో తోపులాట.. ఎంత మంది చనిపోయారు
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని గురువారం తెల్లవారుజాము నుంచి ప్రారంభించనుంది. అయితే.. వివిధ ప్రాంతాల నుంచి బుధవారం మధ్యాహ్నమే తిరుపతి చేరుకున్న భక్తులు లక్షల సంఖ్యలో గుమిగూడారు. ఇక, క్యూలైన్లలోకి వారిని బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఒకేసారి అనుమతించడంతో తోపులాట, తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో …
Read More »నమో-నమో-నమో.. నారా లోకేష్ 21 సార్లు!
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని పలకడం అందరినీ ఆశ్చ ర్యానికి గురి చేసింది. ప్రతి వాక్యంలోనూ ఆయన నమో అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పేరును ప్రస్తావించారు. తాజాగా విశాఖలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత సభలో నారా లోకేష్ ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన నరేంద్ర మోడీ …
Read More »మోదీ, పవన్ పై చంద్రబాబు ప్రశంసలు
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోదీ అని కొనియాడారు. సరైన సమయంలో సరైన ప్రధాని ఉన్నారని, సమస్యలను సత్వరం అర్థం చేసుకోగల సత్తా మోదీకి ఉందని చంద్రబాబు కొనియాడారు. పనులు చకచకా జరిగేలా మోదీ చొరవ చూపిస్తారని, మరే ప్రధానికి ఇది సాధ్యం కాలేదని ప్రశంసించారు. రాష్ట్రాభివృద్ధి గురించే జనసేన అధినేత …
Read More »మోడీ రాకతో 7.5 లక్షల మందికి ఉపాధి: పవన్ కల్యాణ్
ఏపీ ప్రజలు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేను నమ్మారని.. అందుకే కనీ వినీ ఎరుగని రీతిలో ఘన విజయం అందించారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బీజేపీ-జనసేన-టీడీపీకి ఘన విజయం అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు. విశాఖలో ప్రధాని మోడీ పాల్గొన్న సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. అయితే.. ఆయన ప్రసంగం క్లుప్తంగానే సాగింది. కేవలం 10 నిమిషాల్లోనే పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని …
Read More »“మా బంధం ద్రుఢమైంది..” బీజేపీతో పొత్తుపై చంద్రబాబు
బీజేపీతో తమ బంధం ద్రుఢమైందని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ తాము బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. విశాఖలో నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ దేశ ప్రతిష్ఠను ప్రపంచ స్థాయికి చేర్చారని చెప్పారు. ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రపంచ దేశాలు …
Read More »వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి మోడీ ఆక్సిజన్ ఇచ్చారు: లోకేశ్
విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రోడ్ షోకు జనం భారీగా హాజరయ్యారు. రోడ్డుకు ఇరువైపులా ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సీటీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో …
Read More »తెలుగులో మోదీ స్పీచ్ కు ఫిదా!
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు మోదీ. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు చెప్పే, అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు లభించింది అంటూ మోదీ తెలుగులో ప్రసంగించగానే చంద్రబాబు, పవన్, లోకేశ్ సహా సభికులంతా చప్పట్లు కొట్టారు. తెలుగులో మోదీ మాటలు విని …
Read More »ఏపీకి ప్రధాని ఇచ్చిన వరాల ప్రాజక్టులు ఇవీ..
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆయన లక్ష్యాలు తమవిగా భావిస్తామని చెప్పారు. విశాఖ పర్యటనలో భాగంగా 2.3 లక్షల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడా రు. తొలుత తెలుగులోనే ఆయన ప్రసంగం ప్రారంభించారు. అనంతరం హిందీలో కొనసాగించారు. హిందీ …
Read More »మోడీ రోడ్ షో.. ‘చిత్రాలు’ ఇవే!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఏపీ, ఒడిశాలో పర్యటించనున్నారు. తొలుత విశాఖకు వచ్చిన ఆయన బుధవారం రాత్రి ఇక్కడే ఉండి.. గురువారం ఉదయం ఒడిశాకు వెళ్లనున్నారు. కాగా, ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..తొలిసారి విశాఖకు వచ్చిన ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా.. పలువురి నుంచి ఘన …
Read More »లాయర్లు దూరాన కూర్చుంటే ఓకే… కేటీఆర్ కు హైకోర్టు షాక్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు హైకోర్టులో గట్టి షాకే తగిలింది. ఏసీబీ విచారణకు హాజరయ్యే సమయంలో తన వెంట తన న్యాయవాదులను తీసుకెళతానని, అందుకు అనుతించాలంటూ కేటీఆర్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏసీబీ విచారణకు లాయర్ల అవసరం ఏముందని ఈ సందర్భంగా కోర్టు కేటీఆర్ ను ప్రశ్నంచింది. ఏసీబీ విచారణలో కేటీఆర్ తో పాటు …
Read More »రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం సంపూర్ణ భరోసా
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సంపూర్ణ భరోసా ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులకు నగదు రహిత వైద్యం (క్యాష్ లెస్ ట్రీట్ మెంట్) ఇచ్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ పథకం అమలులోకి వస్తే… రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడంతో పాటుగా బాధితులకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates