ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు ఎంతో సన్నిహితుడిగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు అయ్యిందా ? అంటే కూటమి వర్గాల్లో అవును అన్న చర్చలు చాపకింద నీరులా నడుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే విజయసాయి మూడు సంవత్సరాలకు పైగా ఉన్న తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులు కోవడంతో పాటు వైసీపీకి రాజీనామా చేసేశారు. విజయసాయి రాజీనామా చేయడంతో పాటు తాను ఇకపై రాజకీయాల్లో కొనసాగను అని.. వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు.
అసలు జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయసాయి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.. నిజంగానే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తారా ? అన్నది ఎవ్వరికి అంతు పట్టలేదు. విజయసాయి తాను వ్యవపాయ క్షేత్రంలో దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇక తాజాగా ఉప రాష్ట్రపతి జగదేవ్ ధన్ కడ్ వెల్‌కం కార్యక్రమంలో పాల్గొనడంతో విజయసాయి రాజకీయాలకు బ్రేక్ ఇవ్వరనే అందరూ అనుకున్నారు.
మామూలుగా ఉప రాష్ట్రపతి కూడా సిట్టింగ్ ఎంపీల కంటే ఆయనకే ప్రాధాన్యత ఇవ్వటంతో అందరూ స్టన్ అయిపోయారు. దీంతో విజయసాయి మళ్లీ కాస్త గ్యాప్‌తో రాజకీయాల్లో యాక్టివ్ అవుతారనే అందరూ అనుకున్నారు. ఇక విజయసాయి ఇప్పటికే ఢిల్లీ బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లారని… ఆయన జూన్ లేదా జులైలో బీజేపీ లో చేరతారని… బీజేపీలో కూడా ఆయన కీ రోల్ పోషిస్తారని కూటమి వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఇక విజయసాయిరెడ్డి బీజేపీలో చేరితే ఆయన ముందు నుంచి చెపుతున్నట్టుగా ఓ ఎలక్ట్రానిక్ న్యూస్ ఛానెల్ కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారని అంటున్నారు. విజయసాయి రెడ్డి జనంలో పెద్దగా పట్టున్న పాపులర్ లీడర్ కాదు. కానీ ఆయన తెరవెనక వ్యవహారాలు చక్కపెట్టడంలో మహా దిట్ట. ఇక బీజేపీలో చేరే అంశంపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి పెద్దలకు కూడా సమాచారం ఉందట. ఎలాగైనా జగన్‌ను వీక్ అయితే చాలున్నట్టుగా వారి ఆలోచనగా ఉందట.
Gulte Telugu Telugu Political and Movie News Updates