భారత క్రికెటర్, గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు.. ఏపీ అధికార పార్టీవైసీపీలో చేరారు. రాయుడిని సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి.. కండువా కప్పారు. ఈ సందర్భంగా క్రికెటర్ రాయుడు మాట్లాడుతూ.. వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. జీవితంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైందని తెలిపారు. తొలి నుంచి తనకు సీఎం జగన్ పై నమ్మకం ఉందని, కుల మతాలకు అతీతంగా సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. …
Read More »వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ అక్కడి నుంచా?
మొన్నటి వరకు తెలంగాణ రాజకీయమే తన లక్ష్యంగా చెప్పుకున్న షర్మిల.. ఇప్పుడు అందుకు భిన్నంగా ఏపీ రాజకీయాల మీద ఫోకస్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన వేళ.. నామరూపాల్లేకుండా పోయినకాంగ్రెస్ పార్టీ ఉనికిని మళ్లీ పునరుద్దరించే పనిలో పడిన కాంగ్రెస్ పార్టీ.. అందులో భాగంగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతల్ని షర్మిల చేతిలో పెట్టాలని భావిస్తున్న వైనం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. షర్మిలను పార్టీరథసారధిగా ప్రకటిస్తే.. …
Read More »టీడీపీకి ‘ఐటీ సైన్యం’.. చంద్రబాబు వ్యూహం
వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆదిశగా ఇప్పుడు వ్యూహానికి మరింత పదును పెంచారు. ఇప్పటి వరకు సీబీఎన్ ఆర్మీ, ఐటీడీపీ, వ్యూహకర్తలు, ప్రధాన కార్యదర్శులు, అదికార ప్రతినిధులుగా ఉన్న సైన్యాన్ని మాత్రమే రంగంలోకి దింపుతున్నారు. అయితే. ఇప్పుడు ఐటీ సైన్యాన్ని సైతం ఎన్నికలకు వినియోగించుకునేందుకురెడీ అయ్యారు. ఐటీ సైన్యం అంటే.. ఎవరో కాదు చంద్రబాబు చేత, చంద్రబాబు వలన ఐటీ …
Read More »గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన
సహజంగా నాయకులు.. అనగానే ఎంతో కొంత గర్వంతో కూడిన దర్పం కామన్‌గానే ఉంటుంది. ఆ మాత్రం దర్పం చూపించకపోతే.. ఎలా అని కూడా అనుకుంటారు. అందుకే ‘గెలిచే వారకు సుబ్బయ్య.. గెలిచాక సుబ్బారావు అయ్యాడ’నే సామెత పుట్టింది. అయితే.. అందరూ అలానే ఉంటారా? అంటే చెప్పలేం. కానీ, ఎక్కడో ఒకరిద్దరు మాత్రం కొంత డౌన్ టు ఎర్త్(ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే) అన్నట్టే వ్యవహరిస్తారు. తమకు ఎంత పెద్ద పదవి …
Read More »తెలంగాణ లో నిజమైన సర్వే, ఏపీలో మళ్ళీ జగన్‌కేనట
ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మళ్లీ మరో ఛాన్స్ దక్కించు కుంటుందా? లేక పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని భావిస్తున్న టీడీపీ-జనసేనలు ఉమ్మడిగా అధికారం సాధిస్తాయా? పొత్తు ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇదీ.. కొన్నాళ్లుగా రాజకీయంగా జరుగుతున్న తీవ్రమైన చర్చ. ఇక, సాధారణ ప్రజానీకంలోనూ ఇటు పొత్తు, అటు ఒంటరి(వైసీపీ) పోటీపై అనేక అంచనాలు వస్తున్నాయి. సాధారణంగా ఒక పార్టీకి మరో పార్టీ జత …
Read More »ఆ మంత్రికి నో చెబుతున్న జగన్ ?
జగన్మోహన్ రెడ్డికి గట్టి మద్దతుదారుడిగా, అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ముద్రపడిన మంత్రి జోగు రమేష్ కు రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కదా ? వైసీపీ నేతల సమాచారం ప్రకారమే కాకుండా మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అలాగే అనుకోవాల్సొస్తోంది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం సర్వే వివరాలను బట్టి జోగికి గ్రౌండ్ రిపోర్టు అంత అనుకూలంగా లేదని సమాచారం. జోగిమీద అనేక కారణాలతో జనాల్లో మైనస్ ఉందని రిపోర్టులో వచ్చిందట. …
Read More »జిల్లాల మ్యాప్ మార్చనున్న సీఎం రేవంత్ ?
కేసీయార్ హయాంలో ఏర్పాటైన జిల్లాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమీక్షకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ తొందరలోనే జారీ అవబోతోందని అధికారవర్గాలు చెప్పాయి. ప్రత్యేక తెలంగాణా ఏర్పడేనాటికి పది జిల్లాలు మాత్రమే ఉండేవి. వాటిని కేసీయార్ ముందు 31 జిల్లాలుగా విభజించారు. తర్వాత మరో రెండు జిల్లాలను చేర్చి మొత్తం 33 జిల్లాలుగా చేశారు. అయితే మొదట్లో 31 జిల్లాలు చేసినా తర్వాత 33 జిల్లాలుగా …
Read More »అనుకున్నంతా జరిగిందా ? ఘోర ఓటమి
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో అనుకున్నంతా జరిగింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ఘోరంగా ఓడిపోయింది. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని చాలా రోజులు టీబీజీకేఎస్ ఊగిసలాడింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రభావం తప్పకుండా సింగరేణి ఎన్నికలపైన కూడా పడుతుందని కేసీయార్ భావించారు. సింగరేణి ఎన్నికల్లో ఓడిపోతే పరువు పోతుందని భయపడ్డారు. అందుకనే సింగరేణి ఎన్నికల నుండి తప్పుకుంటున్నట్లు కూతురు కవిత ద్వారా …
Read More »రైతుబంధు పై రేవంత్ కీలక నిర్ణయం ?
రైతుబంధు పథకం అమలుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పథకం అమలుకు అప్పర్ లిమిట్ సీలింగ్ విధించాలని అనుకుంటున్నదట. రైతుబంధు పథకం అమలుపై సమీక్షించిన తర్వాతనే రైతుభరోసా నిధులు విడుదల చేయాలని అనుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. 2018లో కేసీయార్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతుబంధు పథకంలో చాలా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. పథకంలో అనర్హులకు కూడా చాలా లబ్ది జరిగిందని వచ్చిన ఆరోపణలను కేసీయార్ ప్రభుత్వం …
Read More »దుమ్ము రేపేలా.. పార్టీల ‘స్లోగన్లు’.. ఎంత ఖర్చయినా ఓకే!
మరో మూడు మాసాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి నినాదాల ప్రిపరేషన్‌లో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. టీడీపీ, వైసీపీలు ఈ విషయంలో దూకుడుగా ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి అనేక నినాదాలు హల్చల్ చేస్తున్నాయి. మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా నమ్మకం.. రావాలి జగన్, కావాలి జగన్.. వంటివి ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ఇక, తాజాగా ఇస్తున్న నినాదాలు కూడా పార్టీని పరుగులు పెట్టిస్తున్నాయని నాయకులు అంటున్నారు. …
Read More »రాధాకు పెరుగుతున్న పొలిటికల్ స్పేస్.. !
ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్న దరిమిలా.. వంగవీటి రంగా వారసుడు రాధాకు కూడా.. రాజకీయ స్పేస్ పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. అయితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు. ఆయన కూడా పార్టీపై ఒత్తిడి తేవడం లేదు. గత ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేసిన ఓకే అన్న వైసీపీ.. రాధా కోరుకున్న విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇవ్వలేదు. దీంతో ఆయన అలిగి బయటకు …
Read More »అన్నావారి అలక.. రాజకీయాల నుంచి తప్పుకొంటున్నారట!
గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే, వైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబు.. అలక బూనారు. ఒక్క రోజులో ఆయన మాట మార్చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గిద్దలూరు నుంచి పోటీ చేసిన అన్నా.. రాష్ట్రంలోనే ఎక్కువ మెజారిటీ తెచ్చుకున్న రెండో నాయకుడిగా పేరు తెచ్చుకన్నారు. అయితే.. ఆయన దూకుడు స్వభావమే.. ఆయనను నాయకులకు దూరం చేసింది. మితి మీరిన అహంకారం కూడా ఉందని ఆయన అనుచరులే చెప్పుకొనే పరిస్థితికి …
Read More »