ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు మాట కు తెలుగు ఓటరు ఓటెత్తాడు. ఆయన మాటలను విశ్వసించాడు. ఎన్నికల ప్రచారంలో కేవలం కొద్ది గంటలు మాత్రమే చం ద్రబాబు ప్రచారం చేసినా.. ఆయన ప్రసంగాలు దుమ్ము రేపాయి. అప్పట్లోనే లక్షల మంది ఢిల్లీ ప్రజలు ఆయన ప్రసంగాలను విన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ వేస్తున్న అడుగులకు మనం మద్దతివ్వాలని.. …
Read More »చెబితే వింటివ.. కేజ్రీవాల్ పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి బీజేపీ దూసుకుపోయింది. 45 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యత కనబరించింది. దీంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు ఉడిగిపోయాయి. మూడోసారి కూడా.. అధికారం తమదేనని భావించిన.. కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రజలు దూరమయ్యారు. అసలు ఆయన గెలుపే అటు-ఇటుగా ఉండడం మరోదారుణం. ఇక, కీలక నేతలు కూడా వెనుకంజలో ఉన్నారు. …
Read More »కేజ్రీ పై వర్మ గెలుపు.. కాబోయే సీఎం ఆయనేనా?
అరవింద్ కేజ్రీవాల్… దేశ రాజకీయాల్లో రీసౌండ్ ఇచ్చిన పేరిది. ఇటు అధికార బీజేపీతో పాటుగా అటూ నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దేశ రాజధానిలో ముచ్చెమటలు పట్టించిన నేతగా ఆయనకు పేరుంది. నాడు వరుసబెట్టి 15 ఏళ్ల పాటు ఢిల్లీ సీఎం సీటులో తిష్ట వేసిన కాంగ్రెస్ పార్టీని సింగల్ దెబ్బకు దించేసిన కేజ్రీ… పదేళ్ల పాటు బీజేపీకి ఆ సీటు దక్కకుండా చేసారు. ఇదంతా గతం అనుకుంటే… …
Read More »ఉత్కంఠ లేదు.. ఢిల్లీ ఓటర్లు క్లారిటీ!
దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. 699 మంది అభ్యర్తులు.. 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ పోల్స్ కు సంబంధించి ఆది నుంచి పెద్ద ఎత్తున ప్రచారం.. రాజకీయం సాగాయి. ఎవరికి వారు నాయకులు, కార్యకర్తలు.. పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇంకేముంది.. ఓటరు నాడిని పట్టుకోవడం కష్టమని కూడా అనుకున్నారు. నిజానికి ఢిల్లీ ఎన్నికల …
Read More »కేసీఆర్ అండ్ కో అరెస్టులపై సీఎం రేవంత్ ఏమన్నారు?
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఒక సుగుణం ఉంటుంది. ఆయన్ను కలవటం.. టైం దొరకబుచ్చుకోవటం కష్టం కావొచ్చు. కానీ.. ఒకసారి కలిసిన తర్వాత.. ఆయన మాట్లాడే తీరు.. ఓపెన్ గా వ్యవహరించే విధానం మనసును దోచుకునేలా ఉంటుంది. ముఖ్యమంత్రి అన్న అహంభావం మచ్చుకు కనిపించదు. ఏం అడిగినా.. సమాధానం ఇచ్చే ధోరణి కనిపిస్తుంది. మీడియావారికి సైతం ఇది వర్తిస్తుంది. విడిగా ఆయన్ను కలవాలన్నా.. …
Read More »బాబు సత్తా!.. సీన్ మొత్తం రివర్స్!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన పొలిటికల్ కెరీర్ లోనే ఇప్పుడు యమా స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పక తప్పదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు ఫలితాలను రాబట్టిన చంద్రబాబు… కేంద్రంలోని అధికార పక్షాన్ని తన గుమ్మం వరకు రప్పించుకుంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాల కోసం ఏపీ ప్రతినిధులు ఇప్పుడు ఢిల్లీ వెళ్లడం లేదు. ఆ ప్రయోజనాలను ఇచ్చేందుకు కేంద్రమే ఏపీకి నడిచి …
Read More »వర్మ నోట ఆ పదాలే వినిపించలేదట
నిత్యం వివాదాలతో సావాసం చేస్తున్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనను తాను ఓ దర్శకుడిగానే నిరూపించుకున్నాడు. వైసీపీతో ఎంతగా అంటకాగుతున్నా కూడా తానూ ఓ సినిమా మనిషినేనని.. రాజకీయాల్లో ఆరితేరిన నేతను అయితే కాదని ఆయన తేల్చి చెప్పారు. సోషల్ మీడియా అసభ్య పోస్టుల వ్యవహారాల్లో శుక్రవారం ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరైన సందర్బంగా ఆయన దాదాపుగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పోలీసులు అడిగిన ప్రశ్నల్లో …
Read More »ఆపరేషన్ అరణ్యకు శ్రీకారం చుట్టిన పవన్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన విధినిర్వహణలో దూసుకుపోతున్నారు. పాలనలో కీలకమైన గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖల బాధ్యతలు ఏరికోరి మరీ పవన్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. మొన్నటిదాకా గ్రామీణాభివృద్ధిపై దృష్టి సారించిన పవన్… అందులో అద్భుతాలనే సృష్టించారని చెప్పక తప్పదు. పవన్ చర్యల వల్ల చాలా గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ఆ శాఖను గాడిలో పెట్టిన పవన్ ఇప్పుడు అటవీ శాఖపై దృష్టి సారించారు. …
Read More »ఏపీ కోరినట్టుగానే.. ‘వాల్తేర్’తోనే విశాఖ రైల్వే జోన్
కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా… అందులో ఎదో ఒక మెలిక ఉండనే ఉంటుంది. ఈ తరహా నిర్ణయాలను కేంద్రం తెలిసి తీసుకుంటుందో… లేదంటే అవగాహన లేక తీసుకుంటుందో తెలియట్లేదు. అయితే ఆ నిర్ణయాలు మాత్రం ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూనే ఉంటున్నాయి. తాజాగా ఏపీ పునర్వ్యవస్తీకరణ చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ప్రకటించింది. కొత్త జోన్ పరిధిపై …
Read More »వర్మ వెంట వైసీపీ దండు కదిలింది!
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల వ్యవహారంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ శుక్రవారం ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వైసీపీ అధికారంలో ఉండగా… నాడు విపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల ఫోటోలను మార్ఫింగ్ చేసిన వర్మ వారిపై అసభ్యకర పోస్టులు పెట్టారు. ఈ పోస్టులఫై టీడీపీ కార్యకర్త …
Read More »హమ్మయ్యా… బెర్తులన్నీ సేఫ్
తెలంగాణాలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే… ఆ వార్తలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీళ్లు చల్లేశారు. ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ లేదని ఆయన శుక్రవారం తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. అందులో భాగంగా ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ను కూడా కలిశారు. ఈ భేటీలో …
Read More »ర్యాంకులపై వైసీపీ రచ్చ..చంద్రబాబు కౌంటర్
సీఎం చంద్రబాబుపై ఎప్పుడు బురదజల్లుదామా అనే కాన్సెప్ట్ తో వైసీపీ నేతలు రెడీగా ఉంటారని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబు ఒక ఉద్దేశ్యంతో చెప్పిన విషయంలో నానార్థాలు తీసి..చిలవలు పలవలుగా చేసి ఆయన ఇమేజ్ కు డ్యామేజ్ చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని వారు ఆరోపిస్తుంటారు. ఈ కోవలోనే తాజాగా మంత్రులకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులపై కూడా వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates