గ్రీష్మ‌ రాక తో వైసీపీ మ‌రింత డీలా

వైసీపీ మ‌రింత డీలా ప‌డ‌నుందా? ఆ పార్టీ వాయిస్ మ‌రింత త‌గ్గ‌నుందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నా.. వైసీపీ నాయ‌కులు ఒక్క‌రు కూడా స‌భ కు వెళ్ల‌డం లేదు. దీంతో ఆశ‌ల‌న్నీ మండ‌లిపైనే ఉన్నాయి. మండ‌లిలో కొంత మేర‌కు బ‌లం ఉండడం.. అక్కడ ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఉండ‌డంతో మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, వ‌ర‌దు క‌ల్యాణి వంటి వారు బ‌లంగా వాణిని వినిపిస్తున్నారు.

అయితే.. ఇప్పుడు అది కూడా త‌గ్గ‌నుంద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా మండ‌లిలో వైసీపీ త‌ర‌ఫున విరుచుకు పడుతున్న వ‌ర‌దు క‌ల్యాణి.. వైసీపీ ప‌రువు నిల‌బెడుతున్నార‌ని చెప్పాలి. బ‌ల‌మైన గ‌ళం వినిపించ‌డంతో పాటు.. వైసీపీకి ద‌న్నుగా మారారు. దీంతో మండ‌లిలో వైసీపీ గ‌ళం బ‌లంగానే వినిపిస్తోంద‌ని ప్ర‌చారం జ‌రు గుతోంది. అయితే.. ఇప్పుడు ఆమెకు చెక్ పెట్టేందుకు సీఎం చంద్ర‌బాబు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకు న్న కావలి గ్రీష్మ‌ను ఎంపిక చేశార‌ని త‌మ్ముళ్లు చెబుతున్నారు.

గ్రీష్మ‌.. ఆది నుంచి కూడా ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపించే మ‌హిళా నాయ‌కుల్లో ఇటీవ‌ల కాలంలో ఆమె ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ఆమె ప్రొఫైల్‌ను అన్ని కోణాల్లోనూ ప‌రిశీలించిన చంద్ర‌బాబు.. ఎంతో మంది బ‌రిలో ఉన్న‌ప్ప‌టికీ.. ఆమెను ఎంపిక చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీకి పెద్ద ప‌రీక్షే ఎదురు కానుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మండ‌లిలో వ్య‌వ‌హ‌రించిన తీరు వేరు.. ఇక నుంచి మ‌రో రేంజ్ అన్న మాట వినిపిస్తోంది.

గ్రీష్మ ఎంట్రీతో మండ‌లిలో వైసీపీ మ‌హిళానాయ‌కుల‌కు చెక్ ప‌డుతుంద‌న్న ప్ర‌చారం కూడా ఉంది. బ‌ల మైన ఎదురు దాడి చేయ‌డంలోనూ.. విధాన‌ప‌ర‌మైన చ‌ర్చ తోనూ ఆమె వైసీపీ దూకుడుకు చెక్ పెడ‌తార‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ త‌న‌కు అనుకూలంగా ఉంద‌ని బావించిన మండ‌లిలో ఆ పార్టీ వాయిస్ ఇక‌, మైన‌స్ కానుంద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో వైసీపీ ఎలా స్పందిస్తుం దో చూడాలి. ఏదేమైనా.. వైసీపీకి ఇప్పుడు మండ‌లిలో ఉన్న బ‌లం త్వ‌ర‌లోనే బ‌ల‌హీనం అవుతుంద‌ని అంటున్నారు. పైగా నాగ‌బాబు వంటి వ్య‌క్తులు మ‌రింత‌గా చెక్ పెట్టే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.